Wednesday, December 13, 2017

ఏనాటి ఋషివో నీవు ఏనాటి మహర్షివో నీవు

ఏనాటి ఋషివో నీవు ఏనాటి మహర్షివో నీవు
ఏనాటి ఆత్మవో నీవు ఏనాటి మహాత్మవో నీవు

ఋషిగా సిద్ధాంతివై మహర్షిగా వేదాంతివైనావు
ఆత్మగా ప్రకృతివై మహాత్మగా పరాకృతివైనావు   || ఏనాటి ||

ఋషిగా సిద్ధాంతాలు రచించినా మహర్షిగా వేదాంతాలు రుచించేవు
ఆత్మగా ప్రకృతినే ఆవహించినా మహాత్మగా పరాకృతులు ధరించేవు

ఋషిగా భావాలతో ఎదిగిన నీవు మహర్షిగా తత్వాలతో జీవించేవు
ఆత్మగా వేదాలతో ఒదిగిన నీవు సత్యాలతో మహాత్మగా ఉదయించేవు  || ఏనాటి ||

ఋషిలోనే కృషి ఉన్నది మహర్షిలోనే స్వయంకృషి ఉన్నది
ఆత్మలోనే ఓ మాత ఉన్నది మహాత్మలోనే జగన్మాత ఉన్నది

ఋషిలోనే పవిత్రం మహర్షిలోనే పరిశుద్ధం ప్రకృతితో కొనసాగుతున్నది
ఆత్మలోనే అన్వేషణం మహాత్మలోనే పరిశోధనం జగతితో జరుగుతున్నది  || ఏనాటి || 

No comments:

Post a Comment