Showing posts with label దేవి. Show all posts
Showing posts with label దేవి. Show all posts

Wednesday, December 14, 2016

ఓ దేవి భూదేవి నీవే మా శ్రీదేవి శ్రీశక్తివి

ఓ దేవి భూదేవి నీవే మా శ్రీదేవి శ్రీశక్తివి
ఓ దుర్గ శ్రీదుర్గ నీవే మా కరుణ కనక దుర్గ
ఓ మాత శ్రీ మాత నీవే మా లోక మాత        || ఓ దేవి ||

ఆది పరాశక్తిగా నీవే ఉదయించాలి మహాకాళి మాతగా నీవే కరుణించాలి
గాయిత్రి మంత్రంతో నీవే తపించాలి శ్రీ చక్ర యంత్రమై నీవే వరించాలి
శ్రీ కనక దుర్గవై నీవే అవతరించాలి మహా మాతగా నీవే అధిరోహించాలి
ఓంకార శక్తివై అష్టాదశ విధాలుగా మహా శ్రీశక్తి పీఠాన్ని నీవే ధరించాలి     || ఓ దేవి ||

దైవమై మహా ధాతగా దేహమే మహా ధూతగా నీవే వరించాలి
సత్యమే మహా శక్తిగా ధర్మమే మహా కాళిగా నీవే అవతరించాలి
జీవమే ఓంశక్తిగా శ్వాసే మహా పరాశక్తిగా నీవే అంతర్భవించాలి   
ఓంకార ధాతవై శ్రీచక్ర యంత్రాన్ని శ్రీధర శక్తి గా నీవే సాగించాలి   || ఓ దేవి || 

Thursday, September 29, 2016

తల్లిగా ప్రేమించే అమ్మవు నీవే

తల్లిగా ప్రేమించే అమ్మవు నీవే
మాతగా లాలించే మహా దేవి నీవే
మానవత్వం కలిపించే కల్పవల్లి నీవే     || తల్లిగా ||

మీలోనే ఒదిగిపోయి ఎదిగాము మహా గొప్పగా
మీతోనే ఉండిపోయి నేర్చాము మహా క్షేత్రంగా

మీయందు ఉంటాము ఎల్లప్పుడు సంతోషంగా
మీ ముందే ఉంటాము ఎప్పటికి ఆనందముగా  || తల్లిగా ||

మా కష్టాలనే ఓదార్చెదవు హాయిగా
మా నష్టాలనే భరించేవు సులువుగా

మా జీవితాలకు రూపమిచ్చేవు మహాత్మగా
మా జీవనాన్నే ఆదుకునేవు మహా తల్లిగా  || తల్లిగా ||