Sunday, January 27, 2019

మేఘం అలిగినా మేఘం కదిలినా

మేఘం అలిగినా మేఘం కదిలినా
మేఘం పలికినా మేఘం నడిచినా

జగమే జలమై ప్రకృతి వనమై ఎదిగేను మనకై

మేఘం కురిసినా మేఘం ఉరిమినా
మేఘం వణికినా మేఘం వరించినా

జగమే జలమై ప్రకృతి వనమై ఎదిగేను మనకై   || మేఘం ||

జలమే జల్లులుగా జలాశయమై సాగిన జలజీవ జలపాతమే మన సాగరమాయే
జలమే జల్లులుగా జలజలమై పారిన జలజీవ జలధారయే మన ప్రాంతమాయే

జలమే జీవమై జలమున జీవనమై జలాంతర వనమై జీవులకే జీవితమాయే
జలమే జగమై జలమున జీవనమై జలధారపు జీవమై జీవులకే జగత్తరమాయే  || మేఘం ||

జలమే మేఘం జలమే జీవం జలమే జీవన తరంగ సాగరం
జలమే జలజం జలమే జీవం జలమే జీవిత పరంగ జలపరం

జలమే జఠిలం జలమే జనకం జలమే జీవుల జలచర రూపం
జలమే జపనం జలమే జగణం జలమే జీవుల జలచర జలకం  || మేఘం ||