Tuesday, September 27, 2011

ఆకాశంలా ప్రతి విశ్వ రూపాన్ని

ఆకాశంలా ప్రతి విశ్వ రూపాన్ని ప్రతి క్షణం చూస్తూనే ఉన్నా
సూర్యునిలా ప్రతి రూప భావ తేజస్సును తిలకిస్తూనే ఉన్నా
విశ్వ రూపాలలో మెరిసే వర్ణ కాంతిలో నేనే నిలయమై ఉన్నా
ప్రకాశించే విశ్వ రూపాలకై నా మేధస్సులో అన్వేషిస్తూనే ఉన్నా

Monday, September 26, 2011

పూజ్యాయ విజ్ఞేశ్వరాయ - బ్రంహా

పూజ్యాయ విజ్ఞేశ్వరాయ - బ్రంహా విష్ణు మహేశ్వరాయ
సూర్యం విశ్వ తేజాయ - సర్వం కర్త కర్మ క్రియ కార్యాయ
దైవం విశ్వ ధారయ - సత్యం కార్య నిర్వాహా సమస్తాయ
జగత్ విశ్వ విజ్ఞాయ - వేదం సర్వ జ్ఞాన స్వరూపాయ

Thursday, September 8, 2011

ప్రభుత్వమా! ప్రతి సమస్యకు చివరి పరిష్కారం

ప్రభుత్వమా! ప్రతి సమస్యకు చివరి పరిష్కారం నా విశ్వ ప్రణాళికయే
విశ్వమున కలిగే ప్రతి సమస్యకు భవిష్య సూచనగా నా ప్రణాళికయే
విశ్వ ప్రణాళిక నిర్మాణముతో చాలా సమస్యలు మళ్ళీ సంభవించవు
ప్రతి విభాగ నిర్మాణ కార్య క్రమము సూక్ష్మ పరిశీలనతో కూడినది
ప్రతి నిర్మాణ విభాగ కార్యాన్ని వివరంగా శాస్త్రీయంగా వివరించగలను
చాలా చక్కని సూక్ష్మ పరిశుద్ధ శుభ్రతగల నిర్మాణ జీవన విధానము
నా విశ్వ ప్రణాళిక నిర్మాణ కార్య క్రమ విధానము స్వర్గం వలే ఉండును
నేడు మీరు కల్పించే పతకాలాన్నీ తాత్కాళిక ఉపయోగమైనవే
ఈ పతకాలన్నీ సమాజాన్ని పరిశుద్ధ శుభ్రతగా మార్చలేవు
Click on Link http://universalprocedure.blogspot.com/

Friday, September 2, 2011

నా రూపమున ఏ రూపమున్నదో

నా రూపమున ఏ రూపమున్నదో అదే విశ్వ రూపముగా నిలిచింది
నాలో ఏ భావాలున్నాయో అవే విశ్వ భావాలుగా కలుగుతున్నాయి
నా మేధస్సులో ఉన్న వేద కాలమే విశ్వ రూపాలతో సాగుతున్నది
నాలో ఎప్పుడు ఏది కలిగినా విశ్వ భావనగా వేద కాలమే కలిగించును