Showing posts with label హృదయము. Show all posts
Showing posts with label హృదయము. Show all posts

Monday, August 14, 2017

ఏమిటో నీ ధ్యాస ఏమిటో నీ శ్వాస

ఏమిటో నీ ధ్యాస ఏమిటో నీ శ్వాస
తెలియని తొలి ఉచ్చ్వాస తెలుపని తొలి నిచ్ఛ్వాస
తరతరాలుగా సాగే జీవ భావ దేహ ధ్యాన మంత్రమే   || ఏమిటో ||

వేదమై వచ్చిందో విజ్ఞానమై సాగిందో మర్మమై దాగినది మేధస్సులో
గానమై పలికిందో స్వరమై పిలిచిందో భావమై వచ్చినది దేహములో

ఉచ్చ్వాసగా సాగినా నిచ్చ్వాసగా నిలిపినా శ్వాసగా సాగుతున్నది ప్రతి జీవిలో
ఊపిరిగా ఉంటున్నా స్వధ్యాసగా వస్తున్నా శ్వాసగా ఆడుతున్నది ప్రతి జీవిలో  || ఏమిటో ||

భావమై వచ్చిందో స్వభావమై నిలిచిందో మంత్రమై స్మరిస్తున్నది దేహములో
జీవమై వెలసిందో దైవమై ఒదిగిందో తంత్రమై విస్మరిస్తున్నది హృదయములో

ప్రాణంగా ఎదిగినా కాలంతో ఒదిగినా శ్వాసగా జీవిస్తున్నది ప్రతి అణువులో
ప్రాయంగా సాగినా సమయంతో వచ్చినా శ్వాసగా వరిస్తున్నది ప్రతి అణువులో  || ఏమిటో || 

Monday, April 25, 2016

ఏ హృదయానికి భాష లేదురా మేధస్సుకు మాట లేదురా

ఏ హృదయానికి భాష లేదురా మేధస్సుకు మాట లేదురా
భావనగా ఆలోచనకు తోచిన అర్థమే స్వరము పలికేనురా
జీవత్వములో దాగిన అజ్ఞాన విజ్ఞానములే నోటి మాటలేరా
ఎదిగిన అనుభవమే భావాలుగా మేధస్సులో ఆలోచనలురా
మాటలతో అతిశయోక్తిగా పొగడుతూ మనస్సునే తృంచకురా
ఉన్నది ఉన్నట్లుగా తెలిసిన యదార్థమునే నీవు తెలుపురా
భాషలేని హృదయానికి భావముతో కూడిన శ్వాస ఉన్నదిరా
శ్వాస ఉన్నంత వరకే హృదయానికి అమూల్యమైన విలువరా
హృదయమే అమృతమైన అమ్మగా ప్రతి జీవిలో జీవిస్తున్నదిరా 

Friday, April 22, 2016

హృదయము లేని జీవితం యదలో దాగిన యదార్థ కథనమే

హృదయము లేని జీవితం యదలో దాగిన యదార్థ కథనమే
సుఖ సంతోషాలు లేని జీవిత కాలమే హృదయ జీవన ఘోష
కష్టాలతో సాగిన కాలం నష్టాలతో దాగిన హృదయ కాలేయమే
శ్వాసకైనా సంకోచం లేని రోగ దేహముతో సాగేనే కర్మణ జీవితం 

Wednesday, April 6, 2016

హృదయమే సూర్యుడై మేధస్సులో ఉదయించేనా

విశ్వమందు నీవు వినవా శ్రీరామా! తెలుసుకున్నావా .....
హృదయమే సూర్యుడై మేధస్సులో ఉదయించేనా
ఆలోచనే ఆకాశమై విశ్వ లోకమంతా జీవించేనా
భావమే బ్రంహాండమై అంతరిక్షాన్ని చుట్టేసేనా
దేహమే దైవమై ముల్లోకాలలో ప్రయాణించేనా
జగతియందు నేను విన్నాను మిత్రమా! తెలుసుకున్నాను .....