Showing posts with label గుణతత్వం. Show all posts
Showing posts with label గుణతత్వం. Show all posts

Friday, December 30, 2016

ఏనాటిదో ఈ భావన ఏనాటి వరకో తెలియని భావాల సంభావన

ఏనాటిదో ఈ భావన ఏనాటి వరకో తెలియని భావాల సంభావన
ఏనాటిదో ఈ తత్వం ఏనాటి వరకో తెలియని తత్వాల సతత్వం  || ఏనాటిదో ||

నాలోనే కలిగేను విశ్వ భావాల జగతి తత్వాల బ్రంహాండ వేదాంతం
నాలోనే ఉదయించేను సూక్ష్మ రూపాల అనంత ఆకారాల మహోత్తరం

ప్రతి క్షణం ఆది కాల మర్మోదయ ఉదయ సూక్ష్మ రూప ఆత్మ పరమాత్మ భావత్వం
ప్రతి భావం శూన్య కాల మన్మోదయ తన్మయ మహా రూప పరంధామ వేద గుణతత్వం  || ఏనాటిదో ||

క్షణక్షణమున కలిగే విశ్వ భావాల కదలికలలో ఎన్నో అసంఖ్యాక అనంత రూప భావ వేద వర్ణ తత్వాలే
రోజురోజున మారే కాల ప్రభావాల పరిణామాలలో ఎన్నో సూక్ష్మ పరిశోధనాత్మక ప్రకృతి చర్యల పరిచయాలే

ఏ ప్రదేశమైన ఏ స్థానమైన ఎప్పటికైనా జ్ఞాన విజ్ఞాన విషయం సూచన వివరణాల సంభాషణ భావాలే
ఏ కాలజ్ఞానమైన ఏ కార్యచర్య ఐనా విజ్ఞాన సంబోధిత వేద ఉపనిషత్తుల పఠనాల పరిపూర్ణ ప్రభావాలే  || ఏనాటిదో ||