Showing posts with label విష్ణు. Show all posts
Showing posts with label విష్ణు. Show all posts

Monday, September 19, 2016

జయ జయహో జయ విజ్ఞేశ్వర జయ జయహో జయ మహేశ్వర

జయ జయహో జయ విజ్ఞేశ్వర జయ జయహో జయ మహేశ్వర
జయ జయహో పర బ్రంహ జయ జయహో పర విష్ణు పరమేశ్వర
జయ సాక్షత్ పర బ్రంహ జయ దేవో పరంధామ పర లోక ప్రాణేశ్వర
జయ విజయ జయ గురు బ్రంహ జయ దేవో జయ విజయ విశ్వేశ్వర 

Thursday, August 25, 2016

హరి హర పరమేశ్వర హరి హర పర బ్రంహా

హరి హర పరమేశ్వర హరి హర పర బ్రంహా
హరి హర దేవ బ్రంహ విష్ణు మహదేశ్వరహా    || హరి హర ||

హరి హర విజ్ఞేశ్వరహా హరి హర జ్ఞానేశ్వరహా
హరి హర జీవేశ్వరహా హరి హర లోకేశ్వరహా

సర్వం సర్వాంతర్యామి విశ్వం విశ్వాంతర్యామి
అనంతం అంతర్యామి భావం అంతర్భావయామి

సంపూర్ణ విష్ణు పరిపూర్ణ బ్రంహా ప్రజ్ఞాన పూర్ణ మహేశ్వరహా
పరిశుద్ధ పరిశోధన పవిత్రాయహే బ్రంహా విష్ణు మహేశ్వరహా || హరి హర ||

హరి హర పర లోక కైలాస పరమేశ్వరహా
హరి హర ఇహ లోక వైకుంఠ విష్ణు దేవా
హరి హర మహా లోక జ్ఞాన బ్రంహేశ్వరః

దైవం దైవాంతర్యామి సత్యం సత్యాంతర్యామి
ధర్మం ధర్మాంతర్యామి నిత్యం నిత్యాంతర్యామి

మహా విష్ణుం మహా బ్రంహం మహా ఈశ్వరం
మహా గుణం మహా భావం మహా తేజం హరి హరః || హరి హర || 

Monday, August 8, 2016

బ్రంహ విష్ణు పరమేశ్వర రూపాలే జీవుల ప్రతి రూపాలు

బ్రంహ విష్ణు పరమేశ్వర రూపాలే జీవుల ప్రతి రూపాలు
ఆత్మ మహాత్మ పరమాత్మ తత్వాలే జీవుల భావ స్వభావాలు  || బ్రంహ ||

ప్రతి జీవిలో ఉదయించే జీవం శ్వాసగా జన్మించునే
ప్రతి రూపంలో కనిపించే తత్వం ధ్యాసగా తోచేనులే

జీవించుటలో కర్త కర్మ క్రియలు మన జీవితానికి సోపానాలు
ఎదుగుటలో భావ స్వభావ తత్వాలు మన జీవనానికి వేదాలు  || బ్రంహ ||

ప్రకృతియే ప్రత్యక్ష దైవంగా బ్రంహ విష్ణు మహేశ్వరులే పరమావధిగా
విశ్వమే జగతికి లయముగా పంచభూతములే పరిశోధన జీవములుగా

మాతృత్వంతో జన్మనిచ్చే మాతా రూపమే బ్రంహ విష్ణు మహేశ్వర రూపాలుగా
మధురంతో అమృతాన్ని పంచే దైవ స్వరూపమే ఆత్మ మహాత్మ పరమాత్మంగా  || బ్రంహ || 

Tuesday, June 14, 2016

బ్రంహయే భావన విష్ణువే వచన మహేశ్వరుడే మనస్సు

బ్రంహయే భావన విష్ణువే వచన మహేశ్వరుడే మనస్సు
మన భావనలో ఉన్నది బ్రంహ విజ్ఞానము
వేద వచనములో ఉన్నది విష్ణు వేదాంతము
మనస్సులో ఉన్నది మహేశ్వరుని సిద్ధాంతము
త్రీ మూర్తులలో ఉన్న విశ్వ విజ్ఞానమే మన జీవన విధానము