Showing posts with label యువసేన. Show all posts
Showing posts with label యువసేన. Show all posts

Tuesday, July 19, 2016

సహాసమే శ్వాసగా సాగిపో యువసేన

సహాసమే శ్వాసగా సాగిపో యువసేన
పోరాటమే ధ్యాసగా నడిచిపో జనసేన
విజయమే మాటగా వెళ్ళిపో మహాసేన  || సహాసమే ||

జయమే నీది రాజ్యమే నీది పోరాటమే నీది
భవిత నీది కాలమే నీది ధైర్య సహాసమే నీది 

విజయంలోనే ఉన్నది అభివృద్ధి జయించుటలోనే ఉన్నది సంవృద్ధి
సంకల్పంలోనే ఉన్నది స్వయంకృషి కర్తవ్యంలోనే ఉన్నది సర్వస్వం 

యువతకు తెలియాలి విజ్ఞానం జనానికి తెలపాలి అనుభవం
సమాజానికి అందించాలి సామర్థ్యం మనిషికి ఉండాలి కర్తవ్యం  || సహాసమే ||

ఒంటరిగా సాగే పోరాటంలోనే కలవాలి అందరి భావాల శాంత హృదయం
సమూహంతో సాగే సహనంలోనే కలగాలి మహోదయ భావాల లక్ష్య గమనం

శ్రమించడంలోనే ఉన్నది శ్రమదానం పని చేయడంలోనే ఉన్నది ప్రతిఫలం
ప్రయాణంలోనే ఉన్నది శ్వాసా స్నేహం మార్గంలోనే ఉన్నది ధ్యాసా గమ్యం 

నిత్యం సత్యం ధర్మం సహజమే భావం బంధం తపనం సమయోచితమే 
కాలం సమయం ప్రయత్నం విజయమే లక్ష్యం ధ్యేయం కర్తవ్యం సమన్వయమే  || సహాసమే ||