Showing posts with label ఆలోచనలు. Show all posts
Showing posts with label ఆలోచనలు. Show all posts

Wednesday, July 5, 2017

కలలే కంటున్నావా కథలే వింటున్నావా

కలలే కంటున్నావా కథలే వింటున్నావా
ఊహలే చేస్తున్నావా ఆలోచనలే గమనిస్తున్నావా

కలలైనా కథలైనా విజ్ఞానం ఉందని తెలుసుకున్నావా
ఊహలైనా ఆలోచనలైనా భావం ఏమని తెలుపుకున్నావా   || కలలే ||

కన్నులకే తెలియని కలలు కంటున్నా కాలం ఆగదులే
చిత్రాలకే తెలియని కథలు చెపుతున్నా సమయం నిలవదులే

వేదాలకే తెలియని ఊహలు చేస్తున్నా గమనం ఒదగదులే
భావాలకే తెలియని ఆలోచనలు వస్తున్నా కార్యం చేరదులే   || కలలే ||

కలలన్నీ కన్నులకు తెలియని మేధస్సులో కలిగే చిత్ర భావాలే
కథలన్నీ కన్నులకు కనిపించని మేధస్సులో కలిగే చిత్ర రూపాలే

ఊహలన్నీ చెవులకు వినిపించని మేధస్సులో కదిలే చిత్ర స్వభావాలే
ఆలోచనలన్నీ వరుసకు చేరని మేధస్సులో కదిలే చిత్ర భావ తత్వాలే   || కలలే ||

Tuesday, December 27, 2016

ఏనాటిదో రూపం ఎప్పటిదో కాలం ఎంతటిదో జీవం

ఏనాటిదో రూపం ఎప్పటిదో కాలం ఎంతటిదో జీవం
మరవలేని జ్ఞాపకాలతో మర్మమై నాతో సాగుతున్నది

ఎందుకో స్వప్నం ఎవరికో ఊహం ఏనాటికో వాంఛనం
తీరలేని కోరికలతో తీరిపోతున్నది జన్మజన్మల బంధనం  || ఏనాటిదో ||

రూపానికి తేజం లేదుగా కాలానికి కరుణ రాదుగా శ్వాసకు సంతృప్తి అసలే ఉండదుగా
తెలిసిన జ్ఞాపకాలతో సాగుతున్నా హృదయం దుఃఖ సాగరమై కన్నీటితో తెలిపేనుగా

కోరికలు ఎన్నున్నా తీరని ఆశల వాంఛనాలు ఊహలతో స్వప్నాలుగా మిగిలేనులే
ప్రతి జన్మలో కోరికలు ఏవైనా తీరని భావాలతో ఆలోచనలు బంధాలుగా సాగేనులే   || ఏనాటిదో ||

ప్రాణమే ఉన్నా రూపమే జీవిస్తున్నా కాలమే మహా చలనమై సాగేను విశ్వంతో
భావమే ఉన్నా బంధమే సాగుతున్నా తత్వములే యుగాలుగా సాగేను జగంతో

దేహానికి రూపం ఏదైనా కాలంతో సాగే మార్పులు ఏవైనా కోరికలు మనస్సుకే
మేధస్సుకు ఆలోచనలు ఏవైనా సాధనతో సాధించే లక్ష్యాలు హృదయానికే  || ఏనాటిదో ||

Friday, September 30, 2016

సత్యములు నిత్యములు పలుకులుగా వచ్చేనా

సత్యములు నిత్యములు పలుకులుగా వచ్చేనా
ఆలోచనలు స్వభావములు భావాలుగా తోచేనా
జ్ఞానములు విజ్ఞానములు సుజ్ఞానములుగా కలిగేనా
విశ్వమున నీవు ఎచట ఉన్నా నేను నీ విజ్ఞాన ధాతను మిత్రమా! 

Wednesday, July 6, 2016

నా భావాలు విశ్వానికే అంకితమై జీవిస్తాయి

నా భావాలు విశ్వానికే అంకితమై జీవిస్తాయి
నా స్వభావాలు జగతిలో నిలయమైపోతాయి
నా తత్వాలు లోకంలోనే స్వభావితమౌతాయి
నా ఆలోచనలు పరమాత్మతో నిలిచిపోతాయి
నా విజ్ఞాన వేదాలు ప్రతి జీవిలో ఉదయిస్తాయి
నా అనుభావాలు మహాత్ములతో సాగిపోతాయి
నా మాటలు మేధస్సులలో పలకరించిపోతాయి  

Friday, February 19, 2016

ఏమిటో ఈ జీవన విధానము దిక్కులకే తోచని ఆలోచనల అలజడులు

ఏమిటో ఈ జీవన విధానము దిక్కులకే తోచని ఆలోచనల అలజడులు
ఏ ఆలోచన ఏమి తెలుపునో ఏ మనస్సు ఏమని కావాలని అంటుందో
మనస్సు మేధస్సుల ఆలోచనలలో జీవనం ఎటువైపు సాగుతున్నదో
తీరని కోరికల తెలియని ఆలోచనల అనుభవమా మనకు తెలిసేదెలా
మేధస్సులోని విజ్ఞానం జయం కలిగిన నాడు మనస్సునే మెప్పించునా
ఆలోచనలను అదుపులో దాచి అర్థాలను విజ్ఞానంతో సాధనగా సాగించాలి
విజ్ఞాన సాధన అర్థమే అనుభవమైన విజయమై జీవితాన్ని మార్చును
దిక్కులలో కలిగే ఆలోచనలు మనస్సుకే ఐనా మేధస్సుకే అప్పగించండి