Wednesday, July 5, 2017

కలలే కంటున్నావా కథలే వింటున్నావా

కలలే కంటున్నావా కథలే వింటున్నావా
ఊహలే చేస్తున్నావా ఆలోచనలే గమనిస్తున్నావా

కలలైనా కథలైనా విజ్ఞానం ఉందని తెలుసుకున్నావా
ఊహలైనా ఆలోచనలైనా భావం ఏమని తెలుపుకున్నావా   || కలలే ||

కన్నులకే తెలియని కలలు కంటున్నా కాలం ఆగదులే
చిత్రాలకే తెలియని కథలు చెపుతున్నా సమయం నిలవదులే

వేదాలకే తెలియని ఊహలు చేస్తున్నా గమనం ఒదగదులే
భావాలకే తెలియని ఆలోచనలు వస్తున్నా కార్యం చేరదులే   || కలలే ||

కలలన్నీ కన్నులకు తెలియని మేధస్సులో కలిగే చిత్ర భావాలే
కథలన్నీ కన్నులకు కనిపించని మేధస్సులో కలిగే చిత్ర రూపాలే

ఊహలన్నీ చెవులకు వినిపించని మేధస్సులో కదిలే చిత్ర స్వభావాలే
ఆలోచనలన్నీ వరుసకు చేరని మేధస్సులో కదిలే చిత్ర భావ తత్వాలే   || కలలే ||

No comments:

Post a Comment