Wednesday, July 19, 2017

ఓ సూర్య దేవ! నీవు ఏనాటి దైవానివో

ఓ సూర్య దేవ! నీవు ఏనాటి దైవానివో
ఓ సూర్య తేజ! నీవు ఏనాటి దేహానివో
ఓ సూర్య భావ! నీవు ఏనాటి రూపానివో

ప్రతి క్షణం జగతిలో ఉదయిస్తూనే ప్రజ్వలిస్తున్నావు
ప్రతి కణం విశ్వంలో వెలుగుతూనే ప్రయాణిస్తున్నావు  || ఓ సూర్య దేవ! ||

ఎంతటి భారమో నీ కార్యాచరణ ఏనాటి బంధమో నీ కార్యాదక్షణ
ఎంతటి వైనమో నీ కార్యాదీక్షణ ఏనాటి స్వభావమో నీ కార్యావర్ణన

ఎంతటి రూపమో నీ కార్యావేదన ఏనాటి దేహమో నీ కార్యాభావన
ఎంతటి గుణమో నీ కార్యావచన ఏనాటి మూలమో నీ కార్యాజ్ఞానన

జగమే నీవని జీవిస్తూ వెలుగే నీవని ఉదయిస్తున్నావు
విశ్వమే నీవని శ్వాసిస్తూ ధ్యాసే నీవని వెలుగుతున్నావు  || ఓ సూర్య దేవ! ||

ఎంతటి చిత్రమో నీ కార్యావరణ ఏనాటి జ్ఞానమే నీ కార్యాదరణ
ఎంతటి ఊష్ణమో నీ కార్యావర్గన ఏనాటి తేజమో నీ కార్యాదహన

ఎంతటి దైవమో నీ కార్యాజనన ఏనాటి వరమో నీ కార్యాతపన
ఎంతటి లీనమో నీ కార్యాకర్తన ఏనాటి విధమో నీ కార్యాకర్మన

దైవమే నీవని దహిస్తూ తేజమే నీవని వర్ణిస్తూ చూస్తున్నావు
భావమే నీవని వహిస్తూ రూపమే నీవని జీవిస్తూ వస్తున్నావు   || ఓ సూర్య దేవ! || 

No comments:

Post a Comment