Friday, July 7, 2017

ఉదయం ఉదయం జగతికే సూర్యోదయం

ఉదయం ఉదయం జగతికే సూర్యోదయం
అభయం అభయం జగతికే శుభోదయం
వినయం వినయం జగతికే నవోదయం

సూర్యోదయమే జగమంతా కార్యాచరణ ఉదయం
సూర్యానందమే జగమంతా కార్యాదరణ అభయం
సూర్యావరణమే జగమంతా కార్యావరణ పర్యావరణం   || ఉదయం ||

ఉదయించే సూర్యోదయం జగతికే ప్రజ్వలం జీవన ప్రకృతం
అభయమిచ్చే శుభోదయం జగతికే ప్రతేజం జీవిత ప్రమోదం

ఉదయించే లోకం సర్వం శాంతం ప్రశాంతం పరిమళ ప్రభాతం
అభయమిచ్చే లోకం సర్వం జ్ఞానం విజ్ఞానం పరిశోధన ప్రజ్ఞానం   || ఉదయం ||

ఉదయం మొదలయ్యే కార్యావచన కమనీయం కన్నులకే కరుణామృతం
అభయం ఆరంభమయ్యే కార్యాకర్తన కర్తవ్యం సుకార్యాలకే కళా నైపుణ్యం
వినయం ప్రారంభమయ్యే కార్యాభావన కమలం కాలానికే కాంతి చైతన్యం

ఉదయించుటలో కార్యా కాంతి సూర్యోదయం ప్రకృతి వర్ణాల తేజోదయం
అభయమిచ్చుటలో కార్యా క్రాంతి శుభోదయం విజయ వర్గాల నవోదయం   || ఉదయం ||

No comments:

Post a Comment