నేను చూడని రూపం ఎవరిది
నేను వీడని భావం ఎటువంటిది
నేను తలవని స్వప్నం ఎక్కడిది
నేనుగా చూడనిది నేనే వీడనిది నేనై తలవనిది ఏదో పరమార్థమే || నేను ||
నేను నేనని నాలో నేనే నేనని నాలో దాగినది ఏదో ఉందని
నేను నేనేనని నాలో నేనేనని నాలో ఉన్నది ఏదో తెలిసిందని
నేనుగా చూడని రూపం నాలో దాగిన అంతర్భావం
నేనుగా వీడని భావం నాలో ఎదిగిన పరమానందం
నేనుగా తలవని స్వప్నం నాలో ఒదిగిన ప్రజ్వలం || నేను ||
నేనుగా ఉన్నానని నాలోనే ఉన్నానని ఏదో తెలియని తత్వం
నేనుగా ఉంటానని నాలోనే ఉంటానని ఏదో తెలియని బంధం
నేనుగా చూసిన రూపం నాలో దాగిన అనంతమైన ఆత్మ స్వరూపం
నేనుగా విడిచే భావం నాలో ఎదిగిన అత్యంతమైన ఆత్మ స్వభావం
నేనుగా తలిచే స్వప్నం నాలో ఒదిగిన అసాధ్యమైన ఆత్మ స్వతత్వం || నేను ||

No comments:
Post a Comment