Showing posts with label త్యాగం. Show all posts
Showing posts with label త్యాగం. Show all posts

Friday, September 2, 2016

జయహో జనతా అన్నది సహాసమే మన పోరాటం

జయహో జనతా అన్నది సహాసమే మన పోరాటం
జయహో జనతా అన్నది సమూహమే మహా సమరం
జయమే లక్ష్యం అంటూ శాంతమే సహనంతో సాగుతున్నది  || జయహో జనతా ||

జన సమూహంతో సాగే సహాసమే మహా విజయం
జన ప్రమేయంతో కొనసాగే మహా కార్యమే కర్తవ్యం
జనుల పలుకులలో కలిగే ధైర్యమే జయ విజయం
జనుల నడకలతో సాగే పట్టుదలయే మహా జయం  || జయహో జనతా ||

స్వయంకృషితో ఎదిగే జీవుల లక్ష్యమే సమాజానికి విజయ చిహ్నం
సమానత్వంతో కలిగే మహోత్తర భావాలే దేశానికి స్ఫూర్తి దాయకం
లక్ష్యం కోసం జీవితాన్నే త్యాగం చేసిన మహా వీరులే దేశానికి గర్వం
విజయంతో దేశాన్ని నడిపించడమే మహా విజ్ఞానుల మహోదయ జ్ఞానం || జయహో జనతా ||

Saturday, December 26, 2009

ప్రేమే దేశం ప్రాణమే త్యాగం

ప్రేమే దేశం ప్రాణమే త్యాగం అమర జీవులు సాధించినదే కీర్తి ఖ్యాతి స్వాతంత్య్రం
మనదే దేశం మనదే రాజ్యం మనం చాటుకున్నమానవ రూప భావమే మానవత్వం
మనదే దేశం మనలో స్నేహం మనం గౌరవించుకున్నదే మహా జన్మ భూమి భావం
మనదే జగతి మనలో ప్రగతి మనలోని విశ్వ విజ్ఞానమే ప్రపంచానికి ప్రశాంతి స్తూపం