Showing posts with label మాయ. Show all posts
Showing posts with label మాయ. Show all posts

Tuesday, February 16, 2016

మరణించాక మాయ లేదు జన్మించాక మర్మము లేదు

మరణించాక మాయ లేదు జన్మించాక మర్మము లేదు
ఉదయించాక చీకటి లేకున్నా అజ్ఞానము కలిగి ఉండెను
మరణించాక చీకటి ఉన్నా అజ్ఞానము తొలగి పోయెను
జీవము ఉన్నంతవరకే అజ్ఞాన విజ్ఞాన సామరస్యములు
ఏ జీవికి విజ్ఞానమొక్కటే గాని అజ్ఞానమొక్కటే గాని నిలవవు
అజ్ఞాన విజ్ఞాన కలయికలు కాల కార్యములలో కలుగుతూ సాగేను
అజ్ఞానము ఎక్కువగా ఉంటే అల్పకుడు విజ్ఞానము ఎక్కువగా ఉంటే విజ్ఞాని
విజ్ఞాన ఆలోచనలతో కార్యాలను సాగిస్తూ విజ్ఞానవంతుడిగా జీవించు
అజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు వదిలేస్తూ విజ్ఞానంతో కార్యాలోచన సాగించాలి
విజ్ఞానంతో కార్యాన్ని సాగిస్తే విజయంతో కార్య సిద్ధి ఫలితం లభించును
విజ్ఞానములో అనుభవమున్నది అలాగే అజ్ఞానములోనూ ఉన్నది
అజ్ఞానంతో వచ్చిన అనుభవాన్ని మరల అదే కార్యాన్ని అలాగే సాగించరాదు
అజ్ఞానంతో చేసిన కార్యాన్ని అనుభవంతో విజ్ఞాన కార్యంగా సాగించాలి
ఎంత అనుభవం ఉన్నా యంత్రములో మంత్రమున్నది అందులో మాయ ఉన్నది
మేధస్సు ఉన్నంతవరకే కార్యాలోచన సాగుతూ యంత్ర తంత్రాన్ని సృష్టించవచ్చు
మేధస్సులోనే మాయ ఉన్నది మర్మమున్నది అజ్ఞాన విజ్ఞాన అనుభవమున్నది