Wednesday, March 31, 2010

మిమ్మల్ని మీరే మెచ్చేలా

మిమ్మల్ని మీరే మెచ్చేలా మీలో ఏ ఒక భావమైనా ఉందా
మీ జీవిత కాలంలో మహాగొప్పగా కలిగిన భావనైనా ఉందా
ఇతరులకు కలగని తోచని విధంగా ఏ భావనైనా మీలో ఉందా
భావనైనా లేకపోతే మీరు మెచ్చే మహాలోచనైనా మీలో ఉందా

విశ్వంలో నే ఏ క్షణం

విశ్వంలో నే ఏ క్షణం ఏ వైపు ఉన్నా నిన్నే తిలకిస్తూ ఉంటాను
నా భావాలు ఎప్పుడూ విశ్వ కదలికలపైననే ఆకార దృశ్యాలతో
మహాగొప్ప భావాలు కలగాలని దివ్యసత్యాన్ని తెలుసుకోవాలని
ఆత్మలో పరమాత్మనై అణువణువునా వేచి ఉన్నా ఓ విశ్వమా

ఆత్మ జ్ఞానం కలిగే వరకు

ఆత్మ జ్ఞానం కలిగే వరకు మన ఆలోచనలను భావాలుగా గుర్తించలేమా
ఆలోచనలను భావాలుగా గుర్తించేందుకు హంస సత్య గుణం ఉండవలెన
హింసలో కలిగే ఆలోచనలను సత్యంగా తెలుసుకుంటే భావాలుగా తెలియునా
భావాలలోనే హంస సత్యం ఉన్నదని మహా ఆలోచన గ్రహించేనా మనలో
మహా ఆలోచనలు లేకపోతే ఆత్మజ్ఞానం కలగక అసత్య భావాలతోనే నేటికి
హంస గుణాలుగల విజ్ఞాన్నాన్ని తెలుసుకుంటే ఆత్మజ్ఞానంతో ఎరుక భావాలే

నా దారి సరైనదేనా

నా దారి సరైనదేనా సరికాకపోతే సరిచేయవా కాలమా
నాకు నచ్చినా నా వారికి సరిలేక తెలిసి తెలియనట్లే
అటు ఇటు ఎటో ఎవరికి తెలియకపోతే నాకెలా తెలిసేది
నా దారి నాకైనా సరిపోవాలనే సర్దుకుని పోతున్నాను
ఏనాటికైనా నే నడిచేదారే మహా ద్వారమవుతుందనే
కాలంతో ప్రయాణిస్తున్నా విజ్ఞాన వేదనతో భావనగానే
ఆలోచనగా ఆలోచిస్తే సత్యాన్ని తెలిపే దారి తెలుస్తుంది

భగవంతుడు వస్తానన్న వేళ

భగవంతుడు వస్తానన్న వేళ నీలో ఉన్న భావన తెలుపగలవా
కనిపిస్తూ తెలిపినాడా కనబడక తెలిపినాడా తను వస్తానని
మాటలు విన్నావా రూపాన్ని చూశావా భగవంతుడే ననుకున్నావా
నిజమేనని తలచావా వస్తాడనే వేచి ఉన్నావా ఇంకా అలానే
అతనితో మాట్లాడినావా లేక విన్నదే గ్రహిస్తూ నిలిచావా
అతను తెలిపేటప్పుడు చుట్టూ ఉన్న ప్రాంతం ఏ విధంగా ఉన్నది
అతడు తెలిపిన సమయ సందర్భం ఎలా ఉన్నదో గుర్తున్నదా
వస్తాడనే అనుకో అతనికి ఏం చేశావో ఎలా ఆ ప్రదేశాన్ని ఉంచావు
అతడు వస్తాననుటలో నీలో ఉన్న గొప్ప గుణం ఏమిటో నీకైనా తెలుసా
ఎప్పటికి సత్యవతిగానే జీవిస్తూ పరమాత్మ స్వభావాలతో ఉంటున్నావా
ఎవరికైనా తెలిపావా ఎవరికి తెలియకూడదనే తెలుపక పోయావా
నేను తెలిపినవన్ని నీలో కలిగితే వస్తాడో లేదో నీకు అర్థమవుతుంది
ఆశ లేని భావన నీలో ఉంటె ఎప్పటికి నీలోనే భగవంతుడు ఉంటాడు
ఆత్మజ్ఞానంతో జీవించే వరకు ఆత్మలోనే పరమాత్మ జీవిస్తూనే భావనగా

Tuesday, March 30, 2010

ఏనాటి మహత్యమో

ఏనాటి మహత్యమో నాలోనే దాగినది ఓ మహా భావన
విశ్వమున నాలో కలిగినా మరల ఎవరికి కలగదే అలా
రూపము చూడలేనంతగా భావము తలచలేనంతగా
ఎవరికి తెలియని అనంతరూపం తెలియని ఆ భావం
కలగానైనా ఊహగానైనా తెలుసుకోలేని గ్రహించలేనిది
తెలుపుటకు వీలుకానిది తెలుపాలనే భావన తోచనిది
నాలోనే మిగిలిపోయెను పరమాత్మ మహాత్య భావనలా

మట్టిలోనే మాణిక్య మైనా

మట్టిలోనే మాణిక్య మైనా మహాత్యమైనా
మనిషికి మట్టె ఆధారం అందులోనే ఆహారం
వ్యవసాయమే జీవనోపాధిగా మనిషికి జీవితం
మట్టిలోని విత్తనమే మాణిక్యం అదే వృక్షమైతే మహత్యం
-----
రాజ్యాలైనా యుగాలైనా మట్టిలోనే ఏనాటికైనా
ఖనిజాలైనా భవనాలైనా మట్టిలోనే ఏనాటికైనా
ఏ జీవి ఐనా ప్రకృతైనా మట్టిలోనే ఏనాటికైనా
మట్టి నుండి వెలసినదైనా మట్టిలోనే ఏనాటికైనా
మహాత్యమైనా మట్టి వలనే మాణిక్యమైనా మట్టిలోనే

We are all Gods

We are all Gods but they/we do't know -
Every god by birth child after that become to god -
A person become to God is very easy and goodthing -
A person thinks by sense on problems with keen observation in society -
And also learning of nature for getting knowledge and truth -
He never creates anything just remove the foolishness in society -
He is living for society not for him, he always thinks how to change the person by truth -
Whenever his sourrounding people got the truth he never lives in that place -
He is not having any desires just he lives for sharing and survive the life -
He is great philosophy to explain the truth in various ways of any work -
Finally he says do't pray to me, we are all gods by intent of truth in heart -
Truth destroys the desires, understand the nature, survive the society -

ఆహారాన్ని మానుకుంటేగాని

ఆహారాన్ని మానుకుంటేగాని రోగాన్ని వదులుకోలేవని నాలో ఓ వేదన
దీర్ఘకాలంగా భాదను అనుభవిస్తూ ఆలోచనలు మారిపోతూనే ఉన్నాయి
విజ్ఞానంగా ఎదగలేక కార్య ప్రణాళిక ఫలించక ఎన్నోవిధాల వెనుకబడిపోయా
అజ్ఞానులు కూడా ఎంతగానో ఎదుగుతూ వెళ్లి పోయారు నాకన్నా గొప్పగా
నావారు నన్ను ఏమన్నా నాలో నేనే ఒదిగిపోయా మరోధ్యాసతో మహర్షిలా
రోగము గుర్తు రాకుండా నాలో తెలియకూడదని మరో ధ్యాసతో జీవిస్తున్నా
ఆహారము కూడా వద్దనే అల్పాహారముతో శ్వాసను సాగిస్తూ యుగాలుగా
ఆలోచనలను కూడా వదలి భావాలతో యోగాత్మనై విశ్వంలో ధ్యానిస్తూనే
రోగము నుండే యోగులై మహాత్మాగా ఎందరో ఆధ్యాత్మకంగా పరమాత్మవలె

వెలుగు వెలుగించు నీవే

వెలుగు వెలుగించు నీవే వెలుగులో ప్రవేశించు
నీవే విజ్ఞాన వెలుగువై అందరిలో వెలగాలి నేడే
ఏ గాలి వీచిన అజ్ఞానం తొలగించేలా మెలగాలిలే
దురలవాట్లను సైతం తరిమేలా చీకటిలో వెలగాలిలే
ధ్యాసతోనే ఆత్మజ్ఞానంతోనే ఆధ్యాత్మకంగా నీవే
విశ్వ విధాతవై ధ్యాన సాగర శ్వాసలో వెలగాలిలే

ఎవరికైనా ఆలోచన కలుగుట

ఎవరికైనా ఆలోచన కలుగుట లేదా మధ్యమునే నిలిపివేయాలనే
లేనివాడు అవయవాలు లేనివాడిగా అనారోగ్యమైన దేహముతోనే
ఎంతకాలం ఎవరికోసం జీవించుట తెలియని అజ్ఞాన అలవాట్లతోనే
ఉన్నవాడు దోచుకునే రోజులివే అని తెలిసిన వీడలేక మధ్యముతోనే
మధ్యమును సేవించి పోయినా కుమారులు మరల మధ్యముతోనే
సంభరాల ఉత్సవాలు మధ్యముతోనే భాష లేక ఆచారాలు లేకనే
మాంసాహారంతో జీర్ణం కాక ఆవేశాల ఆవేదనలెన్నో ధ్యాస లేకనే
తెలియని వ్యర్థముగా తెలుసుకోలేక సమాజమంతా చీకటిలోనే
ప్రపంచమున సాధించినది పగలు చెప్పుకున్నా రాత్రి ఏది లేదనే

Monday, March 29, 2010

తల్లి స్వరమున ఎన్నో

తల్లి స్వరమున ఎన్నో రాగభావ పదాలు
పలుకగా పలుకగా పదాలు అర్థాలుగా
తెలుపగా తెలుపగా అర్థాలు భాషగా
తల్లి తెలిపిన అర్థమే తెలుగు భాషగా
-----
అర్థమగుటకు తల్లి ఒడిలోనే భావాలతో
భావాలు తెలుపుతూ తెలుసుకుంటూ
అనర్థాన్ని అర్థంగా మారుస్తూ పలికిస్తూ
పరమార్థముగా నా బాషే నీకు తోడుగా
తెలుగు తల్లినై పెదాల యందే తియ్యగా

తెలుగు భాషను తెలుపగా

తెలుగు భాషను తెలుపగా తెలుపేగాని
తేట తెలుపుగానైనా తెలుగు భాషేగాని
తెలుగు తియ్యదనము తేనీయమేగాని
తెలుపుతున్నారు తెలుగువారు తెలుగేనని
-----
తలుపు తట్టిన తెలుగు చప్పుడే
తీగ మీటిన తెలుగు రాగమే
తేనీయమన్నా తెలుగు భావమే
తరతరాలుగా ఆంధ్రావనిలో తెలుగే

Yet get set

Sift gift lift
Main gain rain pain
Neat meat seat
Fat mat bat
Lot dot not
Brain train drain
Kind mind bind
Yet get set
Lace pace race
Light tight might night
Wish dish fish
Hint mint tint
Tone none bone
Nice dice mice
Some come dome
Craft draft graft
Need deed weed
Hit sit bit
Hut but cut nut out put
Hang bang tang
East cast past
Just dust must lust
Tire fire mire
Hoot foot toot
Beep deep weep
Soon boon noon
Way say pay
Line fine mine
Row bow sow
Lash dash bash
Hear tear dear near sear
Slash clash flash
Best pest nest

Rage page cage
Glow blow flow

తియ్యదనముకై వెతికి వెతికి

తియ్యదనముకై వెతికి వెతికి
చేదు రుచులతో మైమరచిపోయా
దిక్కు దిక్కున దేశములు తిరిగిన
తెలుగు స్వర భాషతో చెవి తియ్యదనమే

అప్పుడప్పుడే అప్పు అడగవాకోయ్

అప్పుడప్పుడే అప్పు అడగవాకోయ్
పప్పుకై అప్పులెన్నో చేయవాకోయ్
నేడు మానుకో నీ తప్పులెన్నిటినో
ఒప్పుగానే నీవు కాస్త కష్టపడవోయ్
ఖర్చులెన్నో తగ్గించగా అప్పులేదోయ్
ఎవరికైనా అప్పు వద్దనే సాయపడవోయ్

సూర్య చక్రము చంద్ర శంఖము

సూర్య చక్రము చంద్ర శంఖము ధరించి
వీర ఖడ్గము దివ్య కాగడాను చేతబట్టి
మహా అవతార ఉగ్ర రూప శూరిడిగా
ఆకాశం అదిరేలా కఠోరంగా గర్జించగా
క్రూర మృగాలవలె అజ్ఞానులు నశించెను

సూర్యుడు ఉదయిస్తున్నప్పుడే

సూర్యుడు ఉదయిస్తున్నప్పుడే నన్ను చూస్తే
నా రూపంలో కలిగే భావనయే మహా గుర్తుగా
సూర్య భావన నాలో కలిగే సమయ సందర్భాన్ని
నీవు తిలకిస్తేగాని పరమాత్మ భావన కలగదే ఎలా

Sunday, March 28, 2010

ఏమున్నది నాలో ఏమైనదో

ఏమున్నది నాలో ఏమైనదో నాకు తెలియని రహస్యముగా
జరిగినది మరచిపోయేలా జరగబోయేది తెలియనివిదంగా
జరుగుతున్నది ఎందుకో అవసరం లేదనే తెలుపుతున్నది
ఎంతవరకని ఇలా వేచి వేచి జీవితాన్ని నడిపిస్తూనే వెళ్ళాలా

కర్మ సిద్ధాంతాన్ని వ్రాసినది

కర్మ సిద్ధాంతాన్ని వ్రాసినది మానవుడేనని ఆనాటి ఆలోచన
ఆలోచనలను భావాలుగా చూడగల్గితే హింస అనే మహాలోచన
హింసను హంస భావంతో చూస్తే లేత మనస్సు గగుర్పాటుగా
గగుర్పాటుగా తోచే మహా ఆలోచనలతో వ్రాసినదే కర్మ సిద్ధాంతం

Saturday, March 27, 2010

భూమి పొరలలో దాగిన మట్టిని

భూమి పొరలలో దాగిన మట్టిని నేనే విత్తనాన్ని మొలకెత్తించే భావాన్ని నేనే
మేఘానై వర్షాన్ని కురిపిస్తూ భూమి పొరల ప్రవాహాన దాగే తడిని సైతం నేనే
విత్తనములో ఎదిగే లేత మొలక గుణ భావ ప్రక్రియను అణువణువునా నేనే
వృక్షముగా ఎదుగుతూ ఎన్నో రకాలుగా ఉపయోగమై నశించుటలోనూ నేనే

మర్మ రహస్యము తెలిసినంత

మర్మ రహస్యము తెలిసినంత గొప్పగా భావనను తెలుపవలెన
మర్మమునే వివరించి మరోధ్యాసలో రహస్యమునే గ్రహింపజేదున
ఎరుక లేక గ్రహించినచో ఆత్మజ్ఞానమున్నా రహస్యము మర్మముగానే
నిద్రలో కూడా గ్రహించే భావన నీలో ఉంటె రహస్యములేని భావన నీలో

Monday, March 22, 2010

Hey! Man : you

Hey! Man : you do't have time, ok see you later after one year -
Hi, you remember me just one year back I met you -
Sorry I do't know Who are you -
I am your young-age friend -
What you want know, I want my one rupee -
When you given to me, ninty nine years back -
I do't know, but I know you can't remember gotted things -
Any have give one ruppe know your millionaire -
No yaar I do't have chane, I have only two rupee note -
I know you do't give and you can't remember helpers -
This discussion period you only spend more then hundred rupee for yourself -
I understand the persons, but you understand the things for business -
Know I am knowledge person, but you foolish millionaire -
Because you think one rupee, I think help for life -
A millionaire can't change the world only change by knowledge -
Always poor people living the society to face the problems -
(This story not for one ruppee so many things in society)

గుర్తు లేనివిధంగా ఎందుకు

గుర్తు లేనివిధంగా ఎందుకు జీవిస్తారయ్యా
సాయం చేయగా మరచిన వారిలా ముఖమేలా
చూడని వారిలా కళ్ళు లేని కబోధివా
అంధత్వంలో మునిగిపోయిన అజ్ఞానివా
ఎరుక లేని ఆలోచనలతో మూర్ఖత్వమా
తలుపు తట్టి తలవంచి సాయం చేసినా
తల నరికి రావణుడిలా జీవించడ మెందుకు
ఎందుకిలా మోసం చేస్తూ ఎందరో ఎందరికి
మంచివారిని కూడా మాయ చేసే సమాజంగా
విష భావనతో జీవించడం కన్నా ఆహారం వద్దనే జీవించు

సమాజంలో వెళ్ళితే ప్రతి రోజూ

సమాజంలో వెళ్ళితే ప్రతి రోజూ ఎన్నో తెలియని రూపాలే
అడవిలో వెళ్ళినా ఎన్నో తెలియని చెట్లు పుష్పాలే వింతగా
ఏ ప్రాంతం వెళ్ళినా ఎన్నో తెలియనివే తెలిసి తెలియనట్లుగా
ప్రయాణిస్తూ ఉంటే చూడని ప్రాంతాలుగా తెలుసుకుంటూనే
ప్రతి క్షణం ఎన్నో తెలియనివే తెలుసుకుంటూ ఆలోచనగా
ఆలోచిస్తుంటే ఆగని భావాలుగా ఆలోచన విధానమే వేరని
ఎన్ని తెలిసినా ఏది తెలియదనే ఎందరో తెలియనివారేనని
ఎంతవరకో ఇలా నాలో భావన ఎప్పటినుండో ఉన్నదే గుర్తుగా

What an imagination

The sun rises and sun sets are very nice intent and moments every day -
I saw the sun as apple color at the time of morning -
Different clouds of shades before the sun with slightly changes with so may aspects -
The sky is "Live monitor" it shows all effects of nature things -
Wonderful aspects of sky shades with all moments is a great art -
The birds flying in different places with different ways and different groups -
The following of birds flying is very nice -
Sometimes the birds are flying on my head level -
The sky shows different kinds of flying birds and also sounds-
The birds sounds is nice music with different verities of frequency -
The Eagle flying is very nice, it can't flies always in the sky -
Sometimes planes helicopters and rockets visibility is good -
I seen first visible of sun moon star and sky lighting and darkness -
The moon looks sometimes in every month like a piece of watermelon and muskmelon -
I seen the diamonds in pomegranate fruits and also stars in the sky -
so many things are you will imagine for getting an ideas in your mind -

Sunday, March 21, 2010

ఓ సూర్యా! సూర్యోదయ

ఓ సూర్యా! సూర్యోదయ సూర్యాస్తమయ వేళలో నేను నిన్ను తిలకించక పోతే
నీ భావాలను ఆకాశ చంద్రునికి తెలుపగలవని నేను ప్రతి రోజు భావిస్తున్నా
ఆకాశ చంద్రున్ని అలాగే నక్షత్రాలను చూస్తూ నీ భావాలను రోజూ నే గ్రహిస్తున్నా
నాలోని భావాలను కూడా నీవు గ్రహించగలవని నా విజ్ఞాన భావన ఎదుగుటకు

ఓ సూర్యా! నీవు ఉదయించే

ఓ సూర్యా! నీవు ఉదయించే సమయాన నీలో కలిగే భావన నాకు తెలుపు
నీవు అస్తమించే సమయాన నీలో కలిగే భావన నేను గ్రహించి తెలుపగలను
అస్తమించుటలో ప్రతి రోజు కలిగే భావన నాలో మారుతున్నట్లే తిలకిస్తున్నాను
ఉదయించుటలో కూడా నీలో కలిగే భావన ప్రతి రోజు మారితే నాకు తెలుపు
నీలో భావనలు మారుతూ ఉంటే నేను తిలకించుటలో ఎన్నో మహా భావాలు
సూర్యోదయ సూర్యాస్త సమయాలలో నేను ఎక్కడున్నా నీ భావనలు గ్రహిస్తూనే
నాకు తెలియని భావాలు నీలో ఉంటే నాకు తెలుపవలేనని దివ్య భావనతో
నీలో ఒకే భావన ఉంటే ఆ భావన పరమాత్మ భావనయే నని నేను గ్రహించా

మీకు తెలియని సమస్యలెన్నో

మీకు తెలియని సమస్యలెన్నో నాకు తెలుసు
సమస్యల పరిష్కారాన్ని ఆలోచిస్తారే గాని
సమస్యలకు మూల కారణమేమిటో తెలుసుకోండి
విజ్ఞానంగా జాగ్రతగా జీవిస్తే సమస్యలు పరిష్కారంగా
అజ్ఞానంగా జీవిస్తే పరిష్కారం లేని విధంగా కష్టాలై
ఆధ్యాత్మిక ఆత్మ జ్ఞాన సత్యాన్ని తెలుసుకోండి

మనకు ఎన్నో సమస్యలు

మనకు ఎన్నో సమస్యలు ఎప్పుడూ ఉంటాయి
సమస్యలను పరిష్కారిస్తూనే సాగిపోతుంటాం
తీరని సమస్యలెన్నో ఎక్కువవుతూ ఉంటాయి
ఎన్నో సమస్యలను పరిష్కారించడం కంటే
ఒక కొత్త సమస్యను మహా గొప్పగా పరిష్కారిస్తే
తీరని సమస్యలన్నీ తీరిపోగలవని నా భావన
కొత్త సమస్య అంటే మహా విజ్ఞాన కార్యమని

మాట మాటకు మౌనమనే

మాట మాటకు మౌనమనే అర్థం వచ్చేలా నాలోని భావన
యోగిగా ఏ విజ్ఞానం తెలిపిన వివరించినా మౌనమనే అర్థం
అర్థాన్ని వివరించుటలో భావాలే గాని అనర్థాలోచనలు లేవు
ఏ మాటైనా సమాధానమైనా మౌనమనే రహస్యమే భావన
ఏకాగ్రతతో ప్రశాంతంగా తెలిపే నా రూపమే మౌనమనే మాట

ఎంత సాధించినా ఎంత పొందినా

ఎంత సాధించినా ఎంత పొందినా మళ్ళీ కొంత కాలానికి చాలదన్నట్లు
ఎంత ఎత్తు ఎదిగినా ప్రశాంతమైన సమయాన ఆలోచిస్తే ఇంకా ఎదగాలనే
మన కంటే ఎక్కువగా ఎదిగిన వారి కంటే చాలా ఎక్కువగా ఎదగాలనే
ఎంత ఎదిగినా దురాశలేని విజ్ఞానంతో స్వయంగా ఎదిగామన్న ఖ్యాతి పొందాలి
కృషి లేని ఖ్యాతి ఆక్రుతిలేని వికారం ఒదగ లేని ఎత్తు ఉపయోగంలేని విత్తనంలా

సృష్టిలో ఉన్న వజ్రవైడూర్యాలతో

సృష్టిలో ఉన్న వజ్రవైడూర్యాలతో నా నుదుటిపై దేవతా మూర్తుల విగ్రహాలను చెక్కుతున్నారు
కలియుగాంతానికి వజ్రవైడూర్యాలను దాచేందుకు దేవతా మూర్తుల రూపాలు నిలిచేందుకు
సువర్ణాన్ని అక్షర సత్య వేద గ్రంథాలుగా నా నుదుటి పై భాగాన లిఖించి భావాలుగా నాలోనే
నా భావం జగతిలో ఎప్పటికీ నిలిచేలా నేను పరమాత్మ భావమై శూన్య స్థానాన ఆరా వలె

Saturday, March 20, 2010

ఎన్ని భావాలని తెలుపను

ఎన్ని భావాలని తెలుపను క్షణ క్షణానికి ఓ అధ్బుతమైన భావం
ప్రతి అధ్బుతంలో ఓ విజ్ఞానం అందులో మహా తత్వ వేదాంతం
మేధస్సున అన్నీ నిక్షిప్తమై మరెన్నో అధ్బుతాలకు భావాలుగా
ఏ అధ్బుతాన్ని తెలిపినా మరో అద్భుతం నాలో చేరుతున్నది

నేను మరణించే భావన

నేను మరణించే భావన నాలో మొదలయింది
మరణిస్తున్నానని నాలో కలిగిన భావమెందుకో
జన్మించే భావన తెలియకున్నా మరణ భావన తెలిసే
నే తెలుపలేని స్థితిలో ఆ భావన నాలోనే మరణిస్తున్నది

కాలం ఎప్పుడూ భావాలను

కాలం ఎప్పుడూ భావాలను మారుస్తున్నట్లు కలిగిస్తుంది మేధస్సున
మన జ్ఞానేంద్రియాల దృష్టి ఏకాగ్రత వలన ఆలోచనలు మారుతూ
మనలో కలిగే భావాలు వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా ఎన్నో
ఋతువులలో కలిగే మార్పులు కాల ప్రభావంగా మారుతున్నట్లు
భావాలు మారితేనే మనలో సద్గుణాలు ఫలిస్తాయని నా భావన

జయహే జయ జయ జయహే

జయహే జయ జయ జయహే
భారతమాతకు నిరంతరం జయహే
దేశ విదేశాలలో మన మాతకే జయహే
ఏ దేశమైనా మన దేశానికే భారతి మాతా
మన దేశానికే విజయానిచ్చే భారతమాతకే జయహే
మాతా మన దేశాన్ని రక్షించే దైవముగా నీకు జయహే
జగతిలో జగన్మాతగా భారత దేశాన జన్మించిన నీకు జయహే
జగతిలో నిత్యం జయముగా నిలిచే నీకు ఎల్లప్పుడూ తెలిపేదే జయహే
జననీ జగతిలోని జనులంతా నీకు కృతజ్ఞతగా ప్రకృతి మాతగా జయహే
జయహే మాతా జయహే జయ జయ జయహే మాతా జయహే
జయహే జయహే జయ జయ జయ జయహే..... జైహింద్!

ఏమున్నది నాలో

ఏమున్నది నాలో పరమాత్మ భావన తప్ప
మీకైనా తెలుస్తున్నదా నాలో ఏమున్నదని
నా రూపమైనా తెలుసా నేనెలా ఉంటానని
ఆలోచన భావం లేక అణువులేని ప్రదేశాన
శూన్యమైనను కాలం లేని విధంగా నేనెవరో

విశ్వంలో ఒక అణువంత

విశ్వంలో ఒక అణువంత ప్రదేశాన నేను నిలిచి విశ్వాన్ని తిలకిస్తున్నా
ప్రతి రూప భావాన్ని అనుభూతితో తిలకిస్తూ పరమానంద మూర్తిగా
చీకటి వెలుగులలో దివ్య ప్రకాశములు పక్షుల విహారాలు ఎన్నెన్నో
కాలం కన్నులకేనని విజ్ఞానం జ్ఞానేంద్రియాలతోనేనని నా విశ్వభావన

అమ్మా నేను నీవెంటే

అమ్మా నేను నీవెంటే ఉన్నానని నీ ఆత్మలో భావనగా
ఎప్పటికి ప్రతి అడుగులో నీవు ఎరుకతో ఉండవలెనని
శ్వాసలో నేనున్నా నీ ఆలోచనలో కాలం వెంటాడుతూనే
ఏ క్షణం ఎలా ఉంటుందో ధ్యానిస్తూ జీవించవలేనని నేను

నేనే నీవని నీవే నేనని

నేనే నీవని నీవే నేనని చంద్రునిలో కలిగిన భావమే నాలోని భావమని
చంద్రున్ని చూడుటలో నాలో కలిగిన అనుభూతి తన అనుభూతిగానే
నే చంద్రుడని అల నిలిచిపోయా ఓ విశ్వ ప్రదేశాన దివ్యానంద భావనగా
అనుభూతిగా కలిగే భావన నాలోనే అమరమై నేను నేనేనని చంద్రత్వం

ప్రతి పక్షి తన జీవిత కాలంలో

ప్రతి పక్షి తన జీవిత కాలంలో ఎగిరిన దిశలన్నీ నాకు తెలుసు
ఏ దిశ ఎంత దూరమో ఆ గమ్య దూర ప్రాంతాలు నా మేధస్సులో
ఏ కాలమున ఎక్కడ ఎలా జీవిస్తాయో ఎలా జీవనం చేస్తాయో
ఆకాశాన విహారించే పక్షులు నా నేత్రమున దిశాలుగా యుగయుగాన

నేనైనా నేను నేనేనని

నేనైనా నేను నేనేనని నన్ను నేనే నేనన్నాను
నా నాన్నైనా నన్ను నేను నేనే నని నన్ ననెను
నీ నాన్నైనా నన్ను నేను నేనేనని ననెనే
నేను నేనేనని నేనైనా నాన్నైనా నన్ ననెను

నేనే నిన్ను నే నన్నానని

నేనే నిన్ను నే నన్నానని నా నాన్న నన్ ననెను
నా నాన్న నన్ ననేనని నా నాన్న నాన్న నా నాన్న ననెను
నా నాన్న నాన్న నా నాన్నను నన్నానని నీ నాన్న నన్ ననెను
నీ నాన్న నన్ ననేనని నేను నిన్ నన్నాను

Friday, March 19, 2010

Hey man : Where

Hey man : Where are you going just listen your history -
what you did today something great about you or got anything -
Everyday routine in my life and also I have so many problems -
Every man having problems but you know the way of solutions -
I have some solutions remaining I do't have any idea -
Ok, forget all the problems now you will learn yourself lets start -
Every day you will do your own interesting work related to knowledge -
That work gives so many ideas and also gives future goals to reach awards -
You can try best of your knowledge, now you will close the eyes and also problems -
Do't search me, I here in your soul please contact with thoughts of knowledge -
If any support please do meditation I will give something great for you -
Finally you will be repeat this to some persons, that day really marvelous -

నాలో ఎప్పుడూ ప్రతి జీవి

నాలో ఎప్పుడూ ప్రతి జీవి రూప భావము చలిస్తూనే ఉంటుంది
ఉదయానే ప్రతి జీవి రూప దర్శనంతో మహా గొప్పగా భావిస్తూ
నా నేత్రములు విశ్వ రూప తేజమై మహా విజ్ఞాన స్వరూపంగా
ఏ జీవి మరణించినను ఆత్మ నాలో కలిసిపోతూ నా రూపాన్ని
చలింప జేస్తూ ఎన్నో విధాల క్షణ క్షణం అనంత భావాలతో

నాలో ఏ రూప బావమైనా

నాలో ఏ రూప బావమైనా పరమాత్మ భావన కోసమే
నేను జీవిస్తున్నదే ఆ భావన కోసమేనని నా విశ్వాసం
భావనకై వేచి వేచి నా రూప భావ కదలికలు అలలుగా
ఏ రూప భావంతో పరమాత్మ భావాన్ని పొందగలనోనని

ఓ కాలమా నేనే

ఓ కాలమా నేనే ఆత్మావతారంగా ఆత్మ యుగంలో అవతరిస్తున్నా భావంతో
ఆత్మతో ఎదిగే విశ్వ జీవములు నాలో ఏకమై లోకాన్ని పరమాత్మ భావనగా
నా యుగంలో నేనే ఆత్మ జ్ఞానిగా జీవించవలేనని ప్రతి జీవిలో నా భావనయే
ఆత్మ భావన లేని జీవము నా యుగాన జీవించలేక మరో కర్మ యుగానికే

ఓ కాలమా నాలో

ఓ కాలమా నాలో సంపూర్ణ ఆత్మజ్ఞానం లేకపోతే పరిశుద్ధమైన విజ్ఞానంతో కలిగించు
నేను ఒక మహాత్మగా విశ్వంలో ఏకం కావటానికి పరమాత్మ భావనకై వేచి ఉన్నాను
యుగాలుగా ఆత్మను నిత్య విజ్ఞాన సత్యంగా పరమాత్మ తత్వంతో జీవింపజేస్తున్నాను
నేటి జన్మలో ఎరుకతో తెలుపుతున్నా సరైన కాలానికి పరమాత్మ భావన కలగాలని

Tuesday, March 16, 2010

కాలం కన్నా గొప్పగా

కాలం కన్నా గొప్పగా ఏదీ జరగదు సాగదు
క్షణం కూడా కాలంలో ఒక భాగమైనా ఏనాటికి మార్పులేదు
క్షణానికి అలసట లేదు అలాగే కాలానికి నిరుత్సాహం లేనేలేదు
కాలానికి క్షణం ఊపిరిగా నిత్యం శ్వాసగా కాలానికి తోడుగా కాలంలా

మీకు ఏ విజ్ఞాన ఆలోచన

మీకు ఏ విజ్ఞాన ఆలోచన కావలసివస్తే ఆ ఆలోచన నా మేధస్సు నుండే గ్రహించండి
నా మేధస్సులో అన్ని ఆలోచనలు అనంత కాలంగా సత్యంగా అమర్చబడి ఉన్నాయి
ఎవరికి ఏ ఆలోచన ఏ సమయాన ఎలా కావాలనుకుంటే అలా నా మేధస్సు నుండే
మనస్సు కన్నా వేగంగా సముద్రం కన్నా గొప్పగా వేదం కన్నా మహాసత్యంగా మీలో
సమయానికి క్షణంలా ప్రతి క్షణం ఆలోచనకు ఆలోచనగా నిరంతర ధారలా ఊటలా
శాస్త్రీయమైనా సాంకేతికమైనా శాస్త్రవేత్తకైనా అల్ప జ్ఞానికైనా పరమాత్మ భావంతోనే
నన్ను స్మరించే వారికి మీలో పాద స్పర్శగా నేనే మీ ఎరుకలో లీనమై అద్భుతంగా

నా విజ్ఞానం తెలుపుటలో

నా విజ్ఞానం తెలుపుటలో మీలోని విజ్ఞానాన్ని సత్యంగా మార్చేందుకే తెలుసుకో
ఎరుక లేని విజ్ఞానం దారి లేని గాలిలా ఎవరికి వారు ఎవరి విజ్ఞానం వారిదేనని
ఆలోచించే విధానం ఉన్నా ఏది సత్యమైనదో తెలుసుకోలేని జ్ఞానంగా నిలిపివేసి
జ్ఞానాన్ని అరగదీసి సాగదీయుటలో మెరిసే విజ్ఞానం అనుభవంగా మహా సత్యంగా
అనుభవంగా తెలుసుకునే వరకు జ్ఞానంలో మలినమే గాని మెరిసే సత్యాన్ని చూడలేక

కొన్ని క్షణాలలో కలిగిన

కొన్ని క్షణాలలో కలిగిన అద్భుత ఆలోచనలను గ్రహించినా తెలుపలేక పోయాను
నేను నిర్ణయించుకున్న కార్యాలను నెరవేర్చుకునేందుకు అద్భుతాలను వదిలేశా
ఆనాటి అధ్బుతాలకంటే నేడు మహాగొప్పగా మరో ఆశ్చర్యాద్భుతాలను తెలుపుతా
అద్భుతం సూదిమొనలో ఉన్నట్లు నన్ను నేనే గుచ్చుకొని ఆలోచనలకు ఎరుక కలిగిస్తున్నా

Monday, March 15, 2010

నాలోనే పరమాత్మ ఉన్నాడని

నాలోనే పరమాత్మ ఉన్నాడని నేను జీవించే విధానములో నా భావనలు తెలుపుతున్నాయి -
నా జీవన విధానము మహా విజ్ఞానముకన్నా గొప్పగా దివ్య పవిత్రతగా వేద సత్య భావాలుగా -
విశ్వ భావాలతో జీవిస్తున్నానని ప్రకృతిని పరిశీలించే తత్వం నాలో ఉన్నదని దైవ విశిష్టతగా -
నాలోనే నేను నేనుగా ఆత్మజ్ఞానంతో ధ్యానిస్తూనే ఎన్నో భావనలను పరమాత్మ తత్వమునకై -

ప్రతి క్షణం మనకు

ప్రతి క్షణం మనకు ఎవరో ఒకరు సహాయం చేస్తూనే ఉంటారు
చాల శ్రద్ధగా ఆలోచిస్తూ గమనిస్తే ప్రతి ప్రాంతమున ఉపకారంగా
మనవారు లేదా తెలిసినవారు లేదా తెలియనివారెందరో సహాయంగా
కొన్ని సందర్భాలలో కొందరి నుండి అపకారం కూడా జరగవచ్చు జాగ్రత్తా

ఒక భావనతో ఉండగలవేమోగాని

ఒక భావనతో ఉండగలవేమోగాని ఒకే ఆలోచనతో ఉండలేవు ఎప్పటికి అలా ఎవరైనా -
ఆలోచనలు ఎప్పటికప్పుడు వివిధ రకాలుగా జ్ఞానేంద్రియాల ద్వారా వస్తూనేఉంటాయి -
ప్రతి ఆలోచనను ఒక సత్య భావనతో గమనించగలవేమోగాని ఒకేవిధంగా గ్రహించలేవు -
పరమాత్మ భావన కూడా ఒక విధమైన తత్వమే గాని రూప భావాలను గ్రహించలేము -

Sunday, March 14, 2010

భావనగా శాస్త్రవేత్తనై

భావనగా శాస్త్రవేత్తనై వివిధ రకాల ఆలోచనలను విశదీకరిస్తున్నా
ప్రతి ఆలోచన గుణ స్పర్శ విశేషనములను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా
ఎప్పుడు ఎవరికి ఏ ఆలోచన ఎలా కలుగుతుందో ఎలా ఉంటుందో
ఎవరి మేధస్సున ఏ ఆలోచన ప్రభావం ఎలాగో తెలుసుకుంటున్నా

నీకు నీవుగా తెలుసుకోవాలని

నీకు నీవుగా తెలుసుకోవాలని నేను నీకేది తెలుపుట లేదు
జీవ రహస్యమున దాగిన జీవన సత్యాన్ని నీవే తెలుసుకోవాలని
నీ ఆత్మ ఆవేదనలో కూడా నీవు గుర్తించలేని విధంగా జీవిస్తుంటే
నేను ఏది తెలిపినా నీలో మార్పుకలగని అజ్ఞాన ఆలోచనలే నేటికి
తెలుసుకోవాలని ఎదిగే తత్వం ఉన్నప్పుడే మహా వృక్షంలా నీలో

నాలోని ఆలోచనలను

నాలోని ఆలోచనలను భావనలుగా నేనే మార్చుకుంటున్నా
ఆలోచనలుగా అర్థం కాని విజ్ఞాన్నాన్ని భావనలుగా అర్థమయ్యేలా
భావనలే లేకపోతే ఏ ఆలోచన ఎవరికి అర్థం కాదే ఇతర జీవులకైనా
భావనగా తలచిన తర్వాతనే ఆలోచనగా అర్థమవునని నా భావన

om! namaha!

Hey! Man when you came to the mountain top I receive your voice -
Your breath say oh! to you then hoo! say to me by inhale and releasing of breath -
Your pray to me as om! namah! are same as to your breath process -
when you observe your words I will give to same words for you -
If you say loudly I will repeat three times to your ear please listen -
Please do meditatation I will give more words and peace of mind to you -
You observe the breath then only you know the truth of words in life -
I am not a person I am your soul so I want real life from truth like oh! and hoo! : om! namah! -
As per the changes of oh! hoo! : om! maha! : om! namaha!

ఆలోచనతో దురాలోచనను

ఆలోచనతో దురాలోచనను వెల్లగొట్టండి విజ్ఞానంగా
మరో ఆలోచనగా గొప్ప ఆలోచనను కలిగించుకోండి
మహా ఆలోచనలతో మహా సత్యాన్ని తెలుసుకోండి
ఒక్క సత్య భావనతో ఎటువంటి అజ్ఞాన్నైనా వదులుకోండి

భావనలను ఎందుకు

భావనలను ఎందుకు తెలుపుతున్నానో తెలుకోండి
భావనలో ఏమున్నదో ఆలోచనగా గ్రహించగలరా
గ్రహించే సమయాన అర్థమే ఆలోచనగా విజ్ఞానముగా
విజ్ఞానములో కలిగే భావనలే సత్యమని ఆలోచనగా వేరే
భావనలు దానికవే కలుగుతాయిగాని ఆలోచనలు మనమే
భావనలను ఆలోచనలతో మనమే విజ్ఞానంగా మార్చుకోవాలి

Saturday, March 13, 2010

ఓ విశ్వమా నేను మరణించే

ఓ విశ్వమా నేను మరణించే సమయాన నాలో ఒక భావం అలాగే నిలిచిపోతే
ఆత్మతో నా భావం నీలో చేరకపోతే ప్రకృతిలో నీవు లీనమైన వేళ నీలో చేరేను
ఏనాటికి నీలో ఆ భావం చేరకపోతే ఆ భావంతోనే నేను నేనుగా విశ్వంలోనే
భావనగా నిలిచేటట్లు చేసిన నీవే నాలో పరమాత్మగా ఏనాటికైనా లీనమైపో

ఓ విశ్వ భావమా

ఓ విశ్వ భావమా జీవిస్తున్నవారంతా నావారే కర్తగా ఆలోచించు
నావారందరు కర్మ యోగులైనా నేటి నుండి నావలె మహాత్ములుగా
ధ్యాన సాధనలో తమ జీవితాలను ఆత్మజ్ఞానంతో ఆధ్యాత్మకంగా
కర్మ భావాలను విజ్ఞానంతో తొలగిస్తూ సత్యాన్వేషణలో దివ్యభావనతో

నే అడుగేస్తే అదిరేనా

నే అడుగేస్తే అదిరేనా ఆ మహా రూపం నడిచొస్తే బెదిరేనా ఆ విశ్వ భావం
నాలో ఆ శక్తి తత్వం ఉందంటే తొలగించు ఈ క్షణమే కలిగించు దైవత్వం
పరమాత్మగా నా దివ్యరూప భావాన్ని చూపించు విశ్వ ప్రపంచానికి నేడే
నేనెవరో తెలియాలి ప్రతి జీవికి తమ ద్వేష భావాలు కరుణతో కరిగేలా

నాకు చెందవలసిన ఒక భావన

నాకు చెందవలసిన ఒక భావన విశ్వం నుండి నాలో చేరటంలేదనే ఒక దివ్యాలోచన -
సృష్టి తత్వముచే ఆ భావనను పొందాలని ఆలోచనగా అన్వేషిస్తూ నిరంతరం విశ్వంలో -
యుగాలుగా ప్రయత్నిస్తూనే ధ్యానాలోచనతో మరెన్నో భావాలను తెలుసుకుంటున్నా -
ఏ ఆలోచనతత్వం భావనగా నాలో చేరునో తెలుసుకుంటూనే నేటికి ప్రకృతి భావాలలో -

నేను తెలుపుటలో ఎప్పుడు

నేను తెలుపుటలో ఎప్పుడు ఏ సందేహము కలిగినా ఒక ఆలోచనగా మీ మేధస్సున
ఎప్పుడు ఎలా విజ్ఞానం చెందుతున్నా ఎవరు ఎలా తెలుపుతున్నా పరమార్థ భావనగా
కాలంతో విజ్ఞానం చెందుటలో ఏ సందేహమైనా భావనగానే ఎరుకతో అర్థమయ్యేలా
ఏ సందేహమైనా ఎరుకతో గ్రహించుటలో ప్రకృతి ప్రభావముగా పరమార్థమే మేధస్సున

Friday, March 12, 2010

ఎన్నో యుగాలుగా వేచి

ఎన్నో యుగాలుగా వేచి వేచి ఒక భావన కోసం ఆలోచిస్తూ అన్వేషిస్తున్నా
యుగాలుగా శరీరాలే వెళ్లి పోతున్నా ఆత్మగా కాలంతో నిత్యం సాగుతున్నా
ఆలోచనకు ఎరుకను జతచేసి మరో ధ్యాసలో కూడా తెలుసుకునే విధంగా
ధ్యాన ధ్యాసలో కలిగిన ఆ భావనను ఎరుకతో ఆలోచనగా తెలుసుకున్నా

Tuesday, March 9, 2010

ఆనాడు రుచించిన ఫలములే

ఆనాడు రుచించిన ఫలములే తెలుపగా తెలిపిన వాటినే నేడూ తింటున్నాము
ఆనాడు రుచించిన వారెందరో ఆరోగ్యమునకై తెలిపిన వాటినే ఆహారముగా
సృష్టిలో ఎన్నెన్నో ఉన్నా మన ఆరోగ్యానికి అవసరమైనవే ఆనాడు గుర్తించారు
ఆరోగ్యానికి సరికాని వాటిని కూడా ఆనాడే రుచించి పరిశీలించి గుర్తించగలిగారు

ఆలోచనలను భావనగా

ఆలోచనలను భావనగా మహా ధ్యాసలో గ్రహించే వారికే విశ్వ సత్యము ప్రజ్ఞానముగా
తెలిసిన సత్యాన్ని అనుభవముగా ఆత్మ జ్ఞాననంతో వివరించినప్పుడే పరిశుద్ధముగా
సత్యాన్వేషణలో అనంతాలోచన భావాలను గుర్తించి పరిశీలించగల్గితేనే పరిపూర్ణముగా
ప్రజ్ఞాన పరిశుద్ధ పరిపూర్ణ స్వభావ సత్యాలే ఆధ్యాత్మిక రూపంగా పరమాత్మ భావంగా

Monday, March 8, 2010

మహా ధ్యాసతో గొప్ప పని

మహా ధ్యాసతో గొప్ప పని చేస్తున్నపుడు ఒక ఆలోచన మనస్సును విరిచినట్లు చేస్తుంది -
పని చేయుటలో కలిగే ఆటంకము వలన మన ఆలోచన దిశ మారి విసుగు కలిగిస్తుంది -
ఆటంకముతో పని చెదిరిపోతే మరల మహాధ్యాస కలుగుటకు చాలా సమయం పడుతుంది -
పని చెదరక ఆలోచనలు మాత్రమే మారితే కొంత సమయానికి మరల ఆ ధ్యాస కోసం -
ఆటంకము వలన ఆవేశం చెందవచ్చు మనస్సును కుదుట పరచి ఏకాగ్రతగా ఎరుకతో -

ఒక పనికి సంభందించిన

ఒక పనికి సంభందించిన ఎన్నో ఆలోచనలను మేధస్సున ఉంచి పనిచేస్తున్నాము
మేధస్సున దాగిన ఆలోచనలు ప్రజ్ఞానంగా పరిపూర్ణంగా ఉండేలా జ్ఞాపకం చేయాలి
సందేహముగా ఉండే ఆలోచనలను మరల విజ్ఞానంగా చేసుకొని మెరుగుపరచాలి
విజ్ఞానంతో అనుభవాలను తెలుసుకొని భవిష్య సమస్యలపై ఎరుకతో నిఘాపెట్టాలి
సమస్యలను పరిష్కారించినప్పుడే నీలోనే విజ్ఞానం పరిపూర్ణ ప్రజ్ఞానంగా ఉంటుంది

భావనలు కూడా నాలో

భావనలు కూడా నాలో ఆగిపోతాయనే ఒక భావన స్వభావమై నాతో అంటున్నది
ఏ స్వభావాలు నాలో లేనప్పుడే ఒక భావనతో చివరిగా నా మేధస్సున ఆగేనని
ఆ భావన ఆగే సమయం మరణంలా కాక శ్వాస మరో జీవమై సృష్టిలో కిరణంలా
కాంతి కిరణంలో నా భావన నిలిచిపోతూ పరమాత్మగా ఎవరికి తెలియని స్వభావమే

నేననుకున్న భావన నాలో

నేననుకున్న భావన నాలో కలిగేవరకు సాధన చేస్తూనే
సాధన తప్పినచో కాలం వృధా కావడమేకాక ఆలోచనలు మారేను
ఆలోచనలకు మరల అవే భావనలు కలగాలంటే చాలా కష్టం
ఒక భావనాలోచనతో ఎప్పటికి మరవక అదే భావన కలిగేంతవరకు

నాకు కావలసిన ఆలోచన

నాకు కావలసిన ఆలోచన ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో భావనగా
ఆ భావనతో నేను ఎవరిననేది జగతికి తెలిసేలా నా విజ్ఞానం తెలిసేలా
నాలో దాగిన విశ్వవిజ్ఞాన వేద సత్యం అర్థమయ్యేలా నా భావన జగతిలో
నేను మహా భావనలు కలిగిన వారిలో ఒకడిగా పరమాత్మ భావన కలిగేవరకు

Sunday, March 7, 2010

నాలో భావన కలుగుతుందని

నాలో భావన కలుగుతుందని ఒక స్వభావం మేధస్సున గుర్తించేందుకు ఎదురుచూస్తూనే -
స్వభావమే భావనను కలిగించేందుకు ఆలోచనలు ఆగేలా చేసే ధ్యాసయే ధ్యానముగా నాలో -
ధ్యానమున ఆలోచనలు లేక కలిగే స్వభావమే మహా భావనగా నాలో నాకు ఎరుకగా తెలిసేలా -
మహా భావనయే ఆత్మజ్ఞానంగా విశ్వ విజ్ఞాన సత్య భావనలతో పరమాత్మ భావన కలిగేలా -

నేను ఆలోచించే కాలం

నేను ఆలోచించే కాలం వెళ్లిపోయింది ఇక నా మేధస్సున భావాలే కల్గుతున్నాయి -
ప్రతి జీవిలో అణువులో సృష్టిలో కాల మార్పులలో కలిగే ఆలోచనలన్నీ ఆలోచించా -
ఆలోచనలుగా కలిగేవన్నీ ఆలోచనలుగా ఆనాడే ఆలోచించి నేడు ఏ ఆలోచన లేక -
ఆలోచనలుగానే భావాలు ఆలోచనలుగా కాక నాలో స్వభావాలుగానే మొదలైనాయి -
ఏదైనను భావ స్వభావాలతోనే విజ్ఞాన సత్య ప్రభావాలుగా పరమాత్మ భావనలవలె నే -

ఏ మహాత్ముడు నీకు తెలుపడు

ఏ మహాత్ముడు నీకు తెలుపడు నీవు యోగాత్మగా విశ్వాత్మగా సత్యాత్మగా మారవలేనని -
ఏ మానవుడు కూడా నీకు తెలుపడు ఎందుకంటే సరైన ఆత్మవిజ్ఞానం లేక అంతంతే -
నీలో ఎప్పుడైతే ఒక సత్య భావన కలిగి ఆత్మగా నీలో ఎప్పుడు విజ్ఞానం కలుగుతుందో -
ఆత్మజ్ఞానంతో సత్యాన్వేషణలో ఒక భావనను ఎల్లప్పుడు ఆలోచనలతో స్వభావాలుగా -
స్వభావాలతో ప్రతీది పరిశీలిస్తూ దివ్యాత్మగా లోకాత్మగా పరమాత్మ భావనగా నీవే నీలో -

పక్షులు జంతువులు అంటున్నాయి

పక్షులు జంతువులు అంటున్నాయి మాకు మనుషుల్లా ఆలోచనలు లేవు భావనలే మాలో -
ఆలోచనలే ఉంటె ఏనాడో మాలో ఒక భాష కలిగి మీతో మాట్లాడే వాళ్ళం ఇద్దరికీ అర్థమయ్యేలా -
మా భాధలు యేవో మీకు తెలుపలేం ఆలోచనలే ఉన్నా మీరు మమ్మల్ని అర్థం చేసుకోలేరు -
మాలో కొన్ని రకాల పక్షువులను జంతువులను భుజిస్తున్నారు ఎన్నో రకాలుగా నాశానాలే -
జీవహింస అనే భావం మీ సత్య జ్ఞానంలో లేదా లేకపోతే మీ పిల్లలకు గాయమైతే ఏ ఆలోచనతో -
మా పిల్లలు చనిపోతే ఎక్కడని వెతికేది ఏ సమాచార వార్తలలో తెలిపేది ఏ భాషలో వివరించేది -
మాకు స్వేచ్చగా జీవించాలనే ఉంది మీలాగా మాకు అన్ని వసతులు విజ్ఞానం రూప శైలి లేవు -
మీరు ఏది కావలసి వస్తే దాన్ని ఎలాగో పొందవచ్చు మాకు అలాంటి ఆలోచనలే లేవు కలగవు -
మాకు ఆత్మజ్ఞానం తెలియకపోయినా మాలో ఆత్మ భావనలే ఉన్నాయి భావనలలోనే ఎల్లప్పుడు -
మమ్మల్ని వధించేటప్పుడైనా మీలో ఆలోచన భాధలు కలగకపోతే భావనలైనా మనిషిగా కలగాలే -
భావనలు మనిషిలో లేకపోతే ఆధ్యాత్మిక సత్యాలు తెలియక పరమాత్మ భావనను గుర్తించలేని స్థితిలో -

ప్రతి జీవి నుదిటిపై

ప్రతి జీవి నుదిటిపై ఉండేది ఆత్మ జ్ఞానమే గాని తల రాతలు కావు
తలరాతలు మన తల్లిదండ్రుల నుండి సమాజ స్థితి నుండి కలిగేవే
మన ఆలోచనల విధానం ద్వార మన ప్రయత్నాలకు గీత సాగుతూ
కాలంతో సాగే గీత ఎలా వెల్లుతుందో గాలికి కూడా అర్థంకాని విధంగా
అన్ని మార్పులకు మన సంకల్పం ఎలాఉంటె అలా అందులో గొప్పగా
విజ్ఞానంగా ఎదుగుతూ ఇంకా ఏదో తెలుసుకోవాలనే భావనతో ఆత్మజ్ఞానం
ఆత్మజ్ఞానమున కూడా మహా గొప్పగా తెలుసుకోవాలనే ఆధ్యాత్మికము
ఆధ్యాత్మికము కూడా చాలదనుకుంటే మహావేద విశ్వవిజ్ఞాన సత్యాన్వేషణ
సత్యాన్వేషణలో ఏనాటికో మర్మమువలె శూన్యముగా పరమాత్మ భావన

నేడు జీవహింస చేసే వాడు

నేడు జీవహింస చేసే వాడు ఒకప్పుడు మాంసహారిగా నాలో
ఆనాడు ఆహారమైనా నేడు జీవ హింసగా సత్యాలోచనతో
ఆనాటి నుండి ఆచారాలతో పూజిస్తూనే భుజిస్తూనే నేటికి
భాధలో కలిగే ఆ జీవి వేదన మన ప్రాణాలుగా పిల్లలుగా
తెలియకపోతే గ్రహించి తెలుసుకుని ఇతరులకు తెలపండి
ప్రతి జీవి నుదిటి పై జీవిని ఆత్మగానే తలచమని భావన
ఆత్మజ్ఞానిగా ఎదిగేంతవరకు సాధించినదంతా ఒకరికోసమే
మీకై మీరు ఎవరికి వారు సాధించవలసినది ఆధ్యాత్మికమే
ధ్యాన సాధనలో ఆధ్యాత్మికంగా ఎదిగే వారే పరమాత్మగా

* నేటి సమాజ స్థితి ఎవరికి

నేటి సమాజ స్థితి ఎవరికి అర్థమవుతున్నది లేదా చూస్తూ అలాగే వెళ్ళిపోతున్నారా ఎలా -
నేటి సమాజమున ఎందరో అభాగ్యులు అనాధలవలె మతిపోయినవారిలా భిక్షాదిపతుల్లా -
వీరిలో ఎందరో ఆకార వికారములతో తిండి గుడ్డ వసతి సరిగాలేని అశుభ్రత జీవితాలతో -
అంగ వైకల్యములతో ఎందరో వివిధ ప్రాంతాలలో విడ్డూరంగా చూడలేని స్థితులగతులలో -
జీవించే విధానాలు తెలిసి తెలియక కాలం ఎలా గడిపేస్తున్నారో పగటి రాత్రులకే తెలుసు -
సమాజాన్ని మార్చి మార్చి చూసినా మారలేక మార్చలేక మతిపోయిన వారిలోనే ఒకరిగా -
ఎందరో ఎన్నో సహాయ సంస్థలు స్థాపించినా ఇంకా ఎందరో సమాజముననే జీవించగలడం -
సంస్థలలో సదుపాయాలు లేవా ఆర్ధిక ఇబ్భందులున్నాయా లేదా నచ్చటం లేదా -
కొందఱు తమ ప్రగతిని సాధించలేక సమాజ మార్పుల స్తితిపైనే ఆలోచనతో అధోగతి -
మేధావులు లేరా సమాజములో మార్పులు తీసుకురాలేరా ఇంకా ఎన్నాళ్ళైనా అధ్వానమేనా -
కొందరికి ఇంటిలో వేధింపులు సమాజమున అర్థంకాని సమస్యలు ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో -
ఒక వైపు నిత్యవసర ధరలు గాలిలో వెళ్ళుతుంటే ఆకలి చావులు స్మశానానికి పరగులు తీస్తున్నాయి -
శుభ్రత లేక పక్కవాడు శుభ్రత లేక ప్రాంతాలు శుభ్రత లేక వివిధ అలవాట్లతో అనారోగ్యంతో చనిపోయేవారే -
మనసులో ఒక భావన నిలుపుకోండి నేటి నుండైనా సమాజము మారిపోయే స్థితిని ఆలోచిద్దాం ఐక్యంగా -
ఆధ్యాత్మిక భావనలు ప్రతి మనిషిలో లేనంత వరకు సమాజముననే కాదు దేశ విదేశాలలోనూ ఇలానే -
నేను తెలిపే కొన్ని విషయాలకు మీ ఆలోచనలో ఒక ఆలోచనకు స్పృహ లేక మతి చెదిరేటట్లు చేయును -
సమాచార వార్తలలో తెలిసే అభాగ్యులకైనా సహాయం అందిచకపోతే ఎవరికి ఎలా చెప్పాలో నాలోనే ఉన్నట్లుగా -
విజ్ఞాన మేధస్సు గలవారు నన్ను కలవండి నేనే తెలిపే కొన్ని విషయాలను సమాజ శ్రేయస్సుకు ఎలాగని -

Saturday, March 6, 2010

నా ఆత్మ భావాన్ని

నా ఆత్మ భావాన్ని ఎన్నో వేల లక్షల కోట్ల రూపాలుగా విభజించి ప్రతిజీవిలో ప్రకృతి రూపములలో అణువులలో దాచిఉంచా -
ఏ రూపమైతే నిత్య ధ్యాన సాధన చేయగలునో ఆ రూపానికి ఆత్మజ్ఞానాన్ని కలిగించి నా పరమాత్మ స్వభావాన్ని తెలుపుతా -
భావ స్వభావాలు తెలియక ఎందరో అజ్ఞానులై విజ్ఞానులను కూడా అజ్ఞానులవలె తెలియని విధంగా విధిగా కర్మ భావాలతో -
వేద విజ్ఞాన సాంకేతిక ప్రజ్ఞానములున్నా పరిశుద్ధముగా లేని కార్యములలో సమస్యలుగా నేటికి ఆధ్యాత్మిక భావన లేక -

Friday, March 5, 2010

నే చనిపోతానని ఆనాడే

నే చనిపోతానని ఆనాడే తెలుసు మీకు తెలుపలేక భాదను కలిగించలేక
భాధలో కన్నీరే కాటుకగా మారితే వర్షమే కురవాలని నా ఆత్మ ఓదార్పు
ఎవరి మరణమైనా ఏనాటికైనా తప్పదని నాలో ఒక ఆలోచన ఓదార్పుగా
నాలో భాధలు ఉన్నా కాటుకగా నైనా కనిపించని మేఘాలుగా ఆలోచనలే వర్షాలుగా -

క్షణ కాల సమయాన్ని

నేడు మనకు తెలిసిన క్షణ కాల సమయాన్ని ఒక క్షణంగా ఆనాడు ఎలా గుర్తుంచారు -
ఒక క్షణ సమయాన్ని కనుగొనుటకు ఎంత కాలంగా ఎందరు శ్రమించారు -
కొంత సమయాన్ని ఎక్కువగా లేదా తక్కువగా ఆనాడు తీసుకొని గుర్తించి ఉండవచ్చు -
ఇలా ఎక్కువ తక్కువలు ఎన్నో ఆనాడు జరిగి ఉండవచ్చు -
క్షణ సమయాన్ని గుర్తించడానికి ఉపయోగించిన పద్ధతులు ఏవి వాడిన వస్తువులు ఏవి -
అలాగే ఆలోచించిన ఆలోచనలు ఏవి ఎందరిలో ఎలా కలగాయి ఎందుకు కనుగొన్నారు -
ఎవరి సమస్య ఆధారంతో క్షణాన్ని కనుగొనవలసిన అవసరం ఏర్పడింది -
సూర్య వెలుగును పగలుగా చీకటిని రాత్రిగా అలా పగలు రాత్రిని రోజుగా నిర్ణయించుకున్నారు -
ప్రతి రోజు పగలు రాత్రి రెండు ఉన్నందున అంకెల సంఖ్యలను పగటికి అలాగే రాత్రికి కేటాయించారు -
పగటిని పన్నెండు గంటలుగా రాత్రిని పన్నెండు గంటలుగా నిర్ణయించారు -
పగటిని మూడు వందల అరవై డిగ్రీల ఆధారంగా ముప్పై డిగ్రీలుగా విభజించి పన్నెండు గంటలుగా నిర్ణయించారని ఒక అవగాహన -
గంటకు ముప్పై డిగ్రీల చొప్పున పన్నెండు గంటలకు మూడు వందల అరవై డిగ్రీలు -
ఒక గంటను ఆరు డిగ్రీలుగా విభజించి నిమిషంగా నిర్ణయించారని మరొక అవగాహన -
నిమిషానికి ఆరు డిగ్రీలు చొప్పున గంటకు అరవై నిమిషాలుగా మూడు వందల అరవై డిగ్రీలు -
నిమిషాన్ని కూడా ఆరు డిగ్రీల ఆధారంగానే అరవై క్షణాలుగా నిర్ణయించారని నా మరో అవగాహన -
క్షణాన్ని కూడా ఆరు డిగ్రీల ఆధారంగా ఒక క్షణంగా అతి తక్కువ సమయాన్ని గుర్తించేందుకు నిర్ణయించారని చివిరి అవగాహన -
మూడు వందల అరవై డిగ్రీలను కాలంగా నిర్ణయించేందుకు ముఖ్య కారణము ఏమనగా సూర్యుని భ్రమణము ఆధారంగాననే నా ఆలోచన -
ఒక క్షణ సమయాన్ని ఖచ్చితంగా గుర్తించ గల్గితే చాలు ఆ రోజు ముగింపును మనం సులువుగా తెలుసుకొచ్చు -
మొదట ఒక క్షణాన్ని ఎప్పుడు ప్రారంభించిన ఒక రోజు పూర్తి కావడాన్ని నేను తెలిపిన డిగ్రీల ఆధారంగా గుర్తించవచ్చు -
ఒక రోజు పూర్తి కావడాన్ని ఖచ్చితంగా మరల రేపటికి అదే క్షణానికి ముందుగా ఒక రోజని సులువుగా అర్థమవుతుంది -
క్షణ సమయంతోనే నిమిషాన్ని గంటను అలాగే పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటల కాల వ్యవధిని రోజుగా మూడు వందల అరవై డిగ్రీల ఆధారంగా -
ఎనభై ఆరు వేల నాలుగు వందల క్షణాలు పూర్తయితే చాలు ఒక రోజుగా మనకు సులువుగా అర్థమువుతుంది -
ఈ క్షణాలను పూర్తిగా అయ్యేంతవరకు మనం ఎల్లప్పుడు ఖచ్చితంగా గుర్తించలేము కనుక గడియారముగా ఒక యంత్రాన్ని కనుగొన్నాము -
మొదటి క్షణాన్ని సూర్యుడు మనకు తలపైన నిటారుగా ఉన్నప్పుడు మధ్యాహ్న సమయాన ఆరంభించారని నాలో దాగిన ఒక గొప్ప ఆలోచన -
ఇలాంటి విషయాలు ఎన్నైనా తెలుపగలను నాలో ఎన్నో ఎన్నెన్నో విజ్ఞానంగా మేధస్సున అనంతముగా దాగి ఉన్నాయి -

మనల్ని ఎగిరించే శక్తి

మనల్ని ఎగిరించే శక్తి ఆలోచనలకే ఉంది ఆలోచన లేక ఎగరలేము
ఆలోచనలో ఎగర గలమనే భావన కలగాలి లేదంటే ఎగరలేము
మన బరువును కూడా ఎగర గలిగించే శక్తి ఆలోచనకే ఉంది
ఎగరలేకున్నా ఎగరడానికి కావలసినదేమో ఆలోచనయే తెలుపుతుంది
నీటిలో ఈదాలన్నా ఈత నేర్చుకోవాలన్నా ఆలోచనలతోనే
ఒక యంత్రముతో వాహనంగా గాలిలో ఎగిరించాలన్నా ఆలోచనలతోనే
ఏ యంత్రములోనైనా స్పర్శగా ఆలోచనలుగానే అవి పని చేయగల్గుతాయి
పక్షి గాలిలో ఎగారాలన్నా నీటిలో జల జీవులు ఈదాలన్నా ఆలోచనలతోనే
ఏ మాయ చేయాలనుకున్నా భ్రమ కలిగించాలన్నా ఆలోచనలే
దేనిని నమ్మాలన్నా నమ్మకం కలగాలన్నా ఆలోచనలతోనే
విజ్ఞానమైన ఆలోచనలతోనే ఏదైనా సాధించగలం సృస్టించగలం
మానవుడు యోగిగా శాస్త్రవేత్తగా మహాత్మాగా ఎలాగైనా ఆలోచనలతోనే
ఇంకా ఎంతో కొన్ని వేల లక్షల యుగాలుగా ఆలోచనల గురించి నేనే చెప్పగలను
అతి సూక్ష్మమైన వాటిని ఎన్నిటినో ఎన్నో రకాలుగా వివరించగలను
మానవుని యొక్క గొప్పతనం ఏమిటంటే ఆలోచనలను విజ్ఞానంగా గుర్తించడం
విజ్ఞానమైన ఆలోచనలతోనే ఎన్నిటినో సృష్టిస్తూ మానవుడు ఎన్నిటినో సాధిస్తున్నాడు
ఆలోచనలేకుండా శ్వాస కూడా ఆడదు అలాగే శరీరంలో వివిధ ప్రక్రియలు జరగవు
మనం కింద పడాలన్నా ఆలోచన కలుగుతుంది మీకు తెలియాలంటే ఎరుకాలోచనయే
విశ్వం ఆలోచనలేని భావనతో జీవి ఆలోచన భావనతో ఇలా సృష్టిలో ఎన్నో ఎన్నెన్నో
ప్రకృతిలో కొన్నింటికి చలన భావాలుంటాయి అలాగే కొన్నింటికి చలనంలేక
ఏదైనా సరే భావన లేక లేదా ఆలోచన లేక ఇది జరిగింది ఇది వచ్చిందని తెలుపగలరా
క్షణంలో ఒక జీవికి కలిగే కొన్ని వేల ఆలోచనలను గుర్తించగలిగే వారికే విజ్ఞానార్థము

Thursday, March 4, 2010

నాకు తెలిసిన సంగీతమే..~..!

నాకు తెలిసిన సంగీతమే : స్వరాలుగా! స రి గ మ ప ద ని ' స -
స రి గ మ ప ద ని స ..... స ని ద ప మ గ రి స ..~~.. సా రీ గా మా పా దా నీ సా -
స.....! రి.....! గ.....! మ.....! ప.....! ద.....! ని.....! స.....! ..~.. స.....! ని.....! ద.....! ప.....! మ.....! గ.....! రి.....! స.....! -
స ...సా... ఆ! ~ రి ..రీ.. ఈ! ~ గ ..గా.. ఆ! ~ మ ..మా.. ఆ! ~ ప ..పా..ఆ! ~ ద ..దా.. ఆ! ~ ని ..నీ.. ఈ! ~ స ..సా.. ఆ! -
సస రిరి గగ మమ పప దద నిని సస .. ~ .. ససా రిరీ గగా మమా పపా దదా నినీ ససా -
ససస(సా... ఆ!) రిరిరి(రీ.. ఈ!) గగగ(గా.. ఆ!) మమమ(మా.. ఆ!) పపప(పా..ఆ!) దదద(దా.. ఆ!) నినిని(నీ.. ఈ!) ససస(సా.. ఆ!) -
సరి గమ పద నిస ~ నిస పద గమ సరి ~~ సని దప మగ రిస -
ససరి గగమ పపద నినిస ~ నినిస పపద గగమ ససరి ~~ రిసస మగగ దపప సనిని -
సరిగ రిగమ గమప మపద పదని దనిస నిసస ససరి ~ గరిస మగరి పమగ దపమ నిదప సనిద ససని రిసస -
సరిగమ పదనిస ~ పదనిస సరిగమ ~~ సనిదప మగరిస -
సగమ సమప సపద సదని సనిస ~ సనిస సదని సపద సమప సగమ ~~ మగస సమప దపస నిదస సనిస -
సగప సగద సగని సగస ~ సగస సగని సగద సగప ~~ పగస దగస నిగస సగస -
సరిమ సరిప సరిద సరిని సరిస ~ సరిస సరిని సరిద సరిప సరిమ ~~ మరిస పరిస దరిస నిరిస సరిస -
సరిమప సరిపద సరిదని సరినిస ~ సరినిస సరిదని సరిపద సరిమప ~~ పమరిస దపరిస నిదరిస సనిరిస -
సరిపద సరిదని సరినిస సరిసస ~ సరిసస సరినిస సరిదని సరిపద ~~ ససరిస సనిరిస నిదరిస దపరిస -
సరిగప సరిగద సరిగని సరిగస సరిసరి ~ సరిసరి సరిగస సరిగని సరిగద సరిగప ~ రిసరిస సగరిస నిగరిస దగరిస పగరిస -
సరిగమప సరిగమద సరిగమని సరిగమస ~ సరిగమస సరిగమని సరిగమద సరిగమప ~~ సమగరిస నిమగరిస దమగరిస పమగరిస -
సరిగిమపద సరిగమపని సరిగమపస సరిగమదని సరిగమనిస సరిగమసస ~ (పై లాగానే) -
ఇలా ఎన్నో విధాల ఎన్నో రాగాలతో స్వరాగాలుగా వినసొంపుగా పాడగలిగితే పాడుతా తీయగా సంగీతాల సరిగమప -
ఇంకా ఎన్నో విధాల తెలుపగలను మీరు తెలుసుకోండి ప్రయత్నిచండి -

-----
సంగీత సాహిత్య స్వరగాన సమ్మేళన స్వభావమే స్వర రాగ గంగా శ్వాస లయగానమే
ఓంకార భావాలు నటరాజ నాట్యాలు సరిగమల నాదవేదాలుగా మనలోనే లయకారమై
గానాల గమనాలు మేధస్సున లీనమై స్వరవీణ గీతాలే విశ్వ వేణువులో పదనిసలుగా
సృష్టిలో నరనాడినే కదిలించి రోగమునే వణికించి ఆరోగ్య నాధములుగా ధ్యానధ్యాసలో

* Infosys - NRN Murthy

A person got an great idea to implement innovative thoughts -
He started with small stuff and did hard work continuously -
He is doing so many projects to implement his ideas and worth by patience -
He is always positive and progressive in daily life and towards work also -
He never stops until achieving great success to get recognition globally - He faces so many problems and converts them to achievements with his communication skills -
First he wins in the flat world, then now he runs in any undulations of universal standards -
He started a company in a small area with single digit number of employees -
Now he gives more employment with large area throughout the world and also fecilitate the training to all -
Within short time he achieved great success and now he is one of the leading personalities of the world -
In the world so many great/leading people are there, but he is one of the best -
He used "Information in Systematic way" that is called "Infosys" by NRN Murthy -
-----
An electrical engineer from India, had great ideas to implement innovative thoughts -
He started a small company with a very small investment and did a lot of hard work -
He has been implementing his ideas by being inquisitive and articulate -
He believed "Engineering isn't theory but application of the theory to solve problems and make a difference to society" -
He strives constantly for global recognition with in short time -
With his ability to convert obstacles to opportunities, he has emerged the most admired business leader of India -
His company now gives employment to over a lakh professionals with excellent training facilities -
Today his company is one among the top IT companies in India -
Within a short time he achieved great success and now he is one of the leading personalities of the world -
In the world so many great/leading people are there, but he is one of the best -
He runs in any undulations of universal standards and has won in the flat world -
He used "Information in Systematic way" that is called "Infosys" by NRN Murthy -
N. R. Narayana Murthy is the Founder-Chairman of Infosys Technologies Limited. He founded Infosys in 1981. Under his leadership, Infosys was listed on NASDAQ in 1999 -
Mr. Murthy articulated, designed and implemented the Global Delivery Model which has become the foundation for the huge success in IT services outsourcing from India. He has led key corporate governance initiatives in India. He is an IT advisor to several Asian countries -

ప్రతి ఆలోచనను నేనే

ప్రతి ఆలోచనను నేనే ప్రతి జీవిలో కలిగించాలంటే మీకు కలిగేది ఎప్పుడు
ఒక ఆలోచనను కలిగించా దాని తర్వాత కావలసిన ఆలోచన కలగటం లేదు
నాకు కావలసిన ఆలోచనైనా మీకు కావలసిన ఆలోచనైనా మీలో కలగటం లేదు
భావనగా ఎన్నో ఆలోచనలను ఎన్నో విధాల తెలిపినా కలగకపోతే ఎంతవరకు ఇలానే
ఎరుకతో విజ్ఞానంగా గ్రహించుటకు ప్రయత్నిస్తే మీలో కలిగినదే కాక ఎదుటివారి ఆలోచన తెలిసేలా

Wednesday, March 3, 2010

సృష్టిలోనే వదిలేశాను

సృష్టిలోనే వదిలేశాను ఒక ఆలోచనను హాయిగా మరల రావాలనే
ఏనాడు ఎలా ఎక్కడి నుండి వస్తుందో ఎరకతోనే ఎదురు చూస్తున్నా
నాలో చేరే ఆ ఆలోచన మహా విజ్ఞాన సత్య భావంగానే నాకు తెలిసేలా
విశ్వంలోనే అత్యంత దివ్యమైన స్థానం నుండి ప్రకాశామువలె వస్తున్నది
నేను మెళకువగా మేళుకునే సమయాన సూర్యచంద్ర బింభములు కనబడు వేళ
నక్షత్రాలు కనబడక కనిపిస్తూనే నాలో చేరుతున్నది ఆ ఆలోచన పరమాత్మగా

మరో ధ్యాస ఎప్పుడు ఎలా

మరో ధ్యాస ఎప్పుడు ఎలా కలుగుతుంది
మనం సహజంగా ఆలోచించేది ప్రథమ ఎరుకతో గుర్తుగా తెలిసినట్లు ఉండే ధ్యాస -
మనం అర్థం చేసుకొనుటలో ఊహించుకునే చిత్రాలలో ధ్యాస మరోధ్యాస లా -
నిద్రలో వెల్లిపోవుటకు మరో ధ్యాస గా ఆత్మ/ద్వితియ ఎరుకలతో -
మనకు తెలియకుండానే కొన్ని ఆలోచనలతో మరోధ్యాస
వివిధ సమస్యలతో లేదా ఏది తోచని సందర్భాలలో కలిగేది మరోధ్యాస -
ధ్యానించే సమయాన తెలియకుండా కలిగేది మరోధ్యాస -
ఒక పని చేసేటప్పుడు ఇంకో పని గుర్తుకు రావటంలో మరోధ్యాస -
ఆలోచనలలో కూడా మరో ఆలోచనలు కలిగేటప్పుడు మరోధ్యాస -
అనారోగ్యమున కలిగే భాధలో కూడా మరోధ్యాస -
రుచించుటలో కలిగే భావనలలోనైనా మరోధ్యాస -
మనకు గుర్తుండేవన్నీ ప్రథమ ఎరుక ద్వారా గుర్తు లేనివి మరో ఎరుక ద్వారా లేదా తెలియనట్లుగా -
ప్రతి క్షణం వివిధ రకాల ఆలోచనలతో మరో ధ్యాసగా ఎలా వెళ్ళిన మరల ప్రథమ ఎరుక ధ్యాసలోనే -
శాస్త్రవేత్తలకు ఏ ఆలోచన ఏ ధ్యాసలో వెల్లుతుందో ఏ జ్ఞానం తెలియునో మరోధ్యాసలో -
ధ్యాసలేని ధ్యాస కూడా మరోధ్యాసగా కోమ వలె లేదా మతి పోయినట్లుగా -

మొదటగా తలిచే ఆలోచన

ప్రతి జీవిగాని శిశువుగాని మొదటగా తలిచే ఆలోచన శ్వాస -
లోకానికి పరిచయమయ్యేటప్పుడు మొదటి ఆలోచన భాదగా -
శ్వాసతో కలిగిన ఆలోచనలతో తన శరీరం అవయవాలతో పనిచేయడం మొదలవుతుంది -
భాధగా తలిచే భావనయే ఏడుపు గా మనకు తెలియును -

మనం నిర్ణయించుకున్న

మనం నిర్ణయించుకున్న కాలమానం ప్రకారం కాలం ఎలా వెళ్ళిపోతుందో తెలుస్తున్నది -
క్షణ సమయం తెలిసినందున క్షణాలుగా కాలం రోజులుగా ఎలా వెళ్ళిపోతుందో తెలియును -
విశ్వకాలం నకు క్షణాలు లేవు మరి ఆనాటి నుండి ఎలా వెళ్ళిపోతుందో ఎవరికి తెలుసు -
ఆనాటి నుండి చంద్ర సూర్య భ్రమనములతో వెలుగు చీకటిగా సాగుతూనే కాల ప్రయాణం విశ్వమున -

Tuesday, March 2, 2010

ఓం నమః - ఎలా ఉద్భవించాయి

ఓం నమః - ఎలా ఉద్భవించాయి సృస్టించబడ్డాయి గుర్తించబడ్డాయి -
మన ఉచ్చ్వాస నిచ్చ్వాస లలోనే ఓం నమః లు కలవు -
ఉచ్చ్వాసలో ఓం నిచ్చ్వాసలో నమః లుగా మన శ్వాస -
ఓ ఓమ్ గా శ్వాస తీసుకొనుటలో హా హూ గా శ్వాస వదులుటలో -
ఉచ్చ్వాస నిచ్చ్వాస ల ప్రక్రియలో ఓమ్ హూ ను ఓమహా అలా ఓమః గా -
ఓమః ను ఓం మః అలా కొంత కాలంగా ఓం నమః గా సాగుతున్నాయి -
మన ఉచ్చ్వాస నిచ్చ్వాసలో ఓం నమః లు ఉన్నప్పుడు మనలో సత్యమే కలగాలి -
తెలిసిన వారైనా తెలుపండి మన నోటిలోని విజ్ఞానం ఎంత దివ్యమైనదో -
నేటి సమాజమున కొందఱు చెవిలో సీసం పోసుకున్నట్లు మాట్లాడెదరు -
ఎవరు ఎంతటి విజ్ఞానము తెలిపిన నే తెలుపుటలో పరమాత్మ భావన -
నేటి సమాజమున సరైన సత్యము తెలుపు వారు లేక వివిధ రకాలుగా ఎందులకో -
ఆలోచించే ధ్యాన ఎరుకతో ఓం నమః గా తెలుపుతున్నా అర్థమైన వారికి పరమార్థంగా -

* Yahoo!

A man who seeks freedom and success by Hardwork -
Success finally gives a great word "YAHOO!" -
There is nothing beyond this word, neither bad nor good -
The person has reached the universal peak -
He sees the entire world in that word through the net -
It takes you to an endless journey of business -
So many people travelling along with the journey of Yahoo! -
Anyhow some people finally got into Yahoo! -
In nature, on the mountain top you say Yahoo! loudly, it replies same to your ear -
Also the breath of inhale is "yaa…" and releasing is "hoo…" like yahoo...! -Anyhow end of a project or any happy situation, everyone says Yahoooooo..! -
If your mind can't handle any task, just say Yahoo! (openly), it gives few seconds of relief -
The relief gives activeness to thoughts and get the ideas to the project or any work with success as like "Yahoo!" -
The intent of word power, Yahoo! still increases by "Jerry Yang's" worth -
-----
Yahoo! started off as a web portal with a web directory providing an extensive range of products and services for online activities -
It is now one of the leading internet brands and has the most trafficked network on the internet -
On November 17, 2008, The Wall Street Journal reported that Jerry Yang would step down as CEO as soon as the company found a replacement -

నా విజ్ఞానము అర్థంకాకపోతే

నా విజ్ఞానము అర్థంకాకపోతే కొన్ని రోజులు ధ్యానం చేస్తూ పరమార్థముకై ప్రయత్నించండి -
మనస్సును ప్రశాంతముగా ధ్యాసను ధ్యానముగా ఆలోచన లయభావములో లీనమైతేగాని -
మరో ధ్యాసలో కొత్త ఆలోచనలుగా అర్థాలు వివిధ భావాలుగా వైవిధ్యముతో కూడిన విధంగా -
అఖండమైన విజ్ఞానము అమర వేదంలా ఆలోచిత చైతన్యముగా మీ మేధస్సున కమలముగా -

మీ భావాలు నాలాగే ఉంటే

మీ భావాలు నాలాగే ఉంటే స్వర్గంలో సువర్ణాలతో నేనే బ్రంహా ముహూర్తమున లిఖిస్తాను -
అక్షర సత్యాలనే పదాలతో సరిచేసి పదాలనే వాఖ్యాలతో గునింపజేసి వాఖ్యాలను అచ్చుగా -
సువర్ణాలతో సమకూర్చి నెమలి ఈకతో నునుపుగా చేసి ఏ సమయమైనా నక్షత్రాలవలె -
ప్రకాశించునట్లు దర్శించినవారు విజ్ఞానవంతులుగానే విస్మరించి తిరిగి మరో లోకానికి ప్రవక్తగా -

ఎక్కడ ఎవరికి ఏ సమయాన

ఎక్కడ ఎవరికి ఏ సమయాన ప్రమాదాలు జరగబోతాయో తెలుసుకోవాలని ఆలోచిస్తున్నా -
ప్రమాదాలు జరిగే ముందు వారి ఆలోచనల విధానాన్ని మార్చేందుకే ప్రయత్నిస్తున్నా -
క్షేమంగా వెళ్ళాలనే భావన కలిగించి వేగము కన్నా ప్రాణమే మిన్నా ఏది ఏమైనా జరగబోతున్నా -
నష్టం కన్నా కష్టమే మేలని ఆరోగ్యంతో కృషించగలిగితే అన్యాయమే లేని న్యాయమే మన జీవితం -
ప్రమాదాలు జరగకుండా చూసేవారు లోకానికి సృష్టికర్తగా చరిత్రలో నిలేచే ఉంటారు ఏ యుగానైనా -
ఇంకా ఎన్నో మానవునికి తెలియనివి దిక్కులు తోచని విధంగా ఆలోచిస్తున్నా ప్రతి క్షణం నేనే -

తెలిసినది ఆచరణలో

తెలిసినది ఆచరణలో లేనంతవరకు నా భావనలన్నీ ఒకేలా అనిపిస్తాయి కదా
ఒక భావనను ఆచరణతో తెలుసుకుంటే భావాలలో స్వభావాలను గుర్తించగలవు
స్వభావాలలో తెలిసే వివిధ గుణ విచక్షణలే ప్రజ్ఞాన పరిపూర్ణ విజ్ఞాన తత్వములు
ఎన్నో తెలిసిన భావాలను తెలియనట్లుగా వదిలేస్తే పరిపూర్ణత లోపించి అజ్ఞానంగా

Monday, March 1, 2010

నేడు చదువుతావని ఆనాడే

నేడు చదువుతావని ఆనాడే తెలుసు అందుకే నీకై ఈ క్షణాన వేద విజ్ఞానము
కాలం ఎప్పటికి ఉంటుంది గాని ఇలాంటి సమయం మరల రాదు తెలుసుకో
నీకు కావలసిన జ్ఞానమే నీకు తెలియవలసిన విజ్ఞానమే నేటితో ఆరంభం
ప్రతీది అర్థం చేసుకొనుటకన్నా పరమార్థంగా ఆలోచిస్తూ ఆచరణలో ఎరుకతో
ఒక క్షణం ఆలస్యమైనా కొన్నివేల యుగాల జ్ఞానాన్ని తెలుసుకోలేక మరుపుజీవిలా

అంతా ఆలోచనలలోనే

అంతా ఆలోచనలలోనే దాగిఉన్నది ఆలోచనలు లేవంటే ఏది జరగదు
ఆలోచనలతో ఏ జీవికి కావలసింది ఆ జీవి సమకూర్చుకోగల్గుతుంది
మనకు కావలసింది దక్కవచ్చు లేదా దక్కక వేరే ఏదైనా జరగవచ్చు
మన ప్రయత్నం మనం చేస్తే కాలం అనుకూలించవచ్చు లేదా ఏదైనా
ఆలోచనలలో పటిష్టతను ఎర్పరుచుకుంటూ అనుభవ జ్ఞానంతో సాగాలి
ప్రతీది ఆలోచనలోనే దాగుంది ఎరుకతో క్షుణ్ణంగా పరిశీలించి చూడు

నా భావనాలోచన

నా భావనాలోచన నేనుగా నేనే ఆలోచించగా కలిగిన భావన
నాలో కలిగే ప్రతి ఆలోచన ఒక భావనతో కలిగిన విధముగానే
భావనను గుర్తించగల్గితే ఆ ఆలోచన యొక్క విచక్షణ తెలియును
విచక్షణగా తెలిస్తే ఎప్పుడు ఎందుకు ఎలా ఉపయోగపడునో తెలుపును
ఏ ఆలోచనైనా సత్య భావనతో విజ్ఞానంగా తెలుసుకుంటే పరమార్థమే

సృష్టిలో ప్రతి రకమైన జీవిలో

సృష్టిలో ప్రతి రకమైన జీవిలో అవయవాల అమరిక మహా గొప్పగా ఏ జీవికి తగ్గట్లు ఆ జీవికి అనుగుణంగా -
ప్రతి జీవి తన పనిని తానే చేసుకునేటట్లు ఆహారాన్ని దక్కించుకునేటట్లు వివిధ రకాలుగా ఎంతో అనుకూలంగా -
ఆ జీవి జీవించడమే కాక మరో జీవికి జన్మనిస్తూ స్వతహాగా ఎదిగేలా ఆహారంతో సహా అన్నీ కల్పిస్తూ నేర్పిస్తూ -
విజ్ఞానంగా మరియు ఇతర జీవుల రక్షణ ఆరోగ్య పరిస్థితులు ఇతర జాగ్రత్తలు ఎన్నిటినో నేర్పిస్తూనే తను జీవిస్తూ -
ఏ జీవికి తగ్గట్టు ఆ జీవి వసతిని ఏర్పాటు చేసుకుంటూ వంశాభి వృద్ధితో ఆనాటి నుండి సాగుతూనే జీవిస్తున్నాయి -
మానవ మేధస్సుతో మనం చూస్తూనే తెలుసుకుంటూ సృష్టిస్తున్న నేటి సాంకేతిక విజ్ఞాన యంత్ర అధ్భుతములే -