Monday, March 22, 2010

సమాజంలో వెళ్ళితే ప్రతి రోజూ

సమాజంలో వెళ్ళితే ప్రతి రోజూ ఎన్నో తెలియని రూపాలే
అడవిలో వెళ్ళినా ఎన్నో తెలియని చెట్లు పుష్పాలే వింతగా
ఏ ప్రాంతం వెళ్ళినా ఎన్నో తెలియనివే తెలిసి తెలియనట్లుగా
ప్రయాణిస్తూ ఉంటే చూడని ప్రాంతాలుగా తెలుసుకుంటూనే
ప్రతి క్షణం ఎన్నో తెలియనివే తెలుసుకుంటూ ఆలోచనగా
ఆలోచిస్తుంటే ఆగని భావాలుగా ఆలోచన విధానమే వేరని
ఎన్ని తెలిసినా ఏది తెలియదనే ఎందరో తెలియనివారేనని
ఎంతవరకో ఇలా నాలో భావన ఎప్పటినుండో ఉన్నదే గుర్తుగా

No comments:

Post a Comment