సృష్టిలోనే వదిలేశాను ఒక ఆలోచనను హాయిగా మరల రావాలనే
ఏనాడు ఎలా ఎక్కడి నుండి వస్తుందో ఎరకతోనే ఎదురు చూస్తున్నా
నాలో చేరే ఆ ఆలోచన మహా విజ్ఞాన సత్య భావంగానే నాకు తెలిసేలా
విశ్వంలోనే అత్యంత దివ్యమైన స్థానం నుండి ప్రకాశామువలె వస్తున్నది
నేను మెళకువగా మేళుకునే సమయాన సూర్యచంద్ర బింభములు కనబడు వేళ
నక్షత్రాలు కనబడక కనిపిస్తూనే నాలో చేరుతున్నది ఆ ఆలోచన పరమాత్మగా
No comments:
Post a Comment