ఆహారాన్ని మానుకుంటేగాని రోగాన్ని వదులుకోలేవని నాలో ఓ వేదన
దీర్ఘకాలంగా భాదను అనుభవిస్తూ ఆలోచనలు మారిపోతూనే ఉన్నాయి
విజ్ఞానంగా ఎదగలేక కార్య ప్రణాళిక ఫలించక ఎన్నోవిధాల వెనుకబడిపోయా
అజ్ఞానులు కూడా ఎంతగానో ఎదుగుతూ వెళ్లి పోయారు నాకన్నా గొప్పగా
నావారు నన్ను ఏమన్నా నాలో నేనే ఒదిగిపోయా మరోధ్యాసతో మహర్షిలా
రోగము గుర్తు రాకుండా నాలో తెలియకూడదని మరో ధ్యాసతో జీవిస్తున్నా
ఆహారము కూడా వద్దనే అల్పాహారముతో శ్వాసను సాగిస్తూ యుగాలుగా
ఆలోచనలను కూడా వదలి భావాలతో యోగాత్మనై విశ్వంలో ధ్యానిస్తూనే
రోగము నుండే యోగులై మహాత్మాగా ఎందరో ఆధ్యాత్మకంగా పరమాత్మవలె
No comments:
Post a Comment