నేటి సమాజ స్థితి ఎవరికి అర్థమవుతున్నది లేదా చూస్తూ అలాగే వెళ్ళిపోతున్నారా ఎలా -
నేటి సమాజమున ఎందరో అభాగ్యులు అనాధలవలె మతిపోయినవారిలా భిక్షాదిపతుల్లా -
వీరిలో ఎందరో ఆకార వికారములతో తిండి గుడ్డ వసతి సరిగాలేని అశుభ్రత జీవితాలతో -
అంగ వైకల్యములతో ఎందరో వివిధ ప్రాంతాలలో విడ్డూరంగా చూడలేని స్థితులగతులలో -
జీవించే విధానాలు తెలిసి తెలియక కాలం ఎలా గడిపేస్తున్నారో పగటి రాత్రులకే తెలుసు -
సమాజాన్ని మార్చి మార్చి చూసినా మారలేక మార్చలేక మతిపోయిన వారిలోనే ఒకరిగా -
ఎందరో ఎన్నో సహాయ సంస్థలు స్థాపించినా ఇంకా ఎందరో సమాజముననే జీవించగలడం -
సంస్థలలో సదుపాయాలు లేవా ఆర్ధిక ఇబ్భందులున్నాయా లేదా నచ్చటం లేదా -
కొందఱు తమ ప్రగతిని సాధించలేక సమాజ మార్పుల స్తితిపైనే ఆలోచనతో అధోగతి -
మేధావులు లేరా సమాజములో మార్పులు తీసుకురాలేరా ఇంకా ఎన్నాళ్ళైనా అధ్వానమేనా -
కొందరికి ఇంటిలో వేధింపులు సమాజమున అర్థంకాని సమస్యలు ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో -
ఒక వైపు నిత్యవసర ధరలు గాలిలో వెళ్ళుతుంటే ఆకలి చావులు స్మశానానికి పరగులు తీస్తున్నాయి -
శుభ్రత లేక పక్కవాడు శుభ్రత లేక ప్రాంతాలు శుభ్రత లేక వివిధ అలవాట్లతో అనారోగ్యంతో చనిపోయేవారే -
మనసులో ఒక భావన నిలుపుకోండి నేటి నుండైనా సమాజము మారిపోయే స్థితిని ఆలోచిద్దాం ఐక్యంగా -
ఆధ్యాత్మిక భావనలు ప్రతి మనిషిలో లేనంత వరకు సమాజముననే కాదు దేశ విదేశాలలోనూ ఇలానే -
నేను తెలిపే కొన్ని విషయాలకు మీ ఆలోచనలో ఒక ఆలోచనకు స్పృహ లేక మతి చెదిరేటట్లు చేయును -
సమాచార వార్తలలో తెలిసే అభాగ్యులకైనా సహాయం అందిచకపోతే ఎవరికి ఎలా చెప్పాలో నాలోనే ఉన్నట్లుగా -
విజ్ఞాన మేధస్సు గలవారు నన్ను కలవండి నేనే తెలిపే కొన్ని విషయాలను సమాజ శ్రేయస్సుకు ఎలాగని -
No comments:
Post a Comment