ఓ సూర్యా! నీవు ఉదయించే సమయాన నీలో కలిగే భావన నాకు తెలుపు
నీవు అస్తమించే సమయాన నీలో కలిగే భావన నేను గ్రహించి తెలుపగలను
అస్తమించుటలో ప్రతి రోజు కలిగే భావన నాలో మారుతున్నట్లే తిలకిస్తున్నాను
ఉదయించుటలో కూడా నీలో కలిగే భావన ప్రతి రోజు మారితే నాకు తెలుపు
నీలో భావనలు మారుతూ ఉంటే నేను తిలకించుటలో ఎన్నో మహా భావాలు
సూర్యోదయ సూర్యాస్త సమయాలలో నేను ఎక్కడున్నా నీ భావనలు గ్రహిస్తూనే
నాకు తెలియని భావాలు నీలో ఉంటే నాకు తెలుపవలేనని దివ్య భావనతో
నీలో ఒకే భావన ఉంటే ఆ భావన పరమాత్మ భావనయే నని నేను గ్రహించా
No comments:
Post a Comment