Friday, March 5, 2010

క్షణ కాల సమయాన్ని

నేడు మనకు తెలిసిన క్షణ కాల సమయాన్ని ఒక క్షణంగా ఆనాడు ఎలా గుర్తుంచారు -
ఒక క్షణ సమయాన్ని కనుగొనుటకు ఎంత కాలంగా ఎందరు శ్రమించారు -
కొంత సమయాన్ని ఎక్కువగా లేదా తక్కువగా ఆనాడు తీసుకొని గుర్తించి ఉండవచ్చు -
ఇలా ఎక్కువ తక్కువలు ఎన్నో ఆనాడు జరిగి ఉండవచ్చు -
క్షణ సమయాన్ని గుర్తించడానికి ఉపయోగించిన పద్ధతులు ఏవి వాడిన వస్తువులు ఏవి -
అలాగే ఆలోచించిన ఆలోచనలు ఏవి ఎందరిలో ఎలా కలగాయి ఎందుకు కనుగొన్నారు -
ఎవరి సమస్య ఆధారంతో క్షణాన్ని కనుగొనవలసిన అవసరం ఏర్పడింది -
సూర్య వెలుగును పగలుగా చీకటిని రాత్రిగా అలా పగలు రాత్రిని రోజుగా నిర్ణయించుకున్నారు -
ప్రతి రోజు పగలు రాత్రి రెండు ఉన్నందున అంకెల సంఖ్యలను పగటికి అలాగే రాత్రికి కేటాయించారు -
పగటిని పన్నెండు గంటలుగా రాత్రిని పన్నెండు గంటలుగా నిర్ణయించారు -
పగటిని మూడు వందల అరవై డిగ్రీల ఆధారంగా ముప్పై డిగ్రీలుగా విభజించి పన్నెండు గంటలుగా నిర్ణయించారని ఒక అవగాహన -
గంటకు ముప్పై డిగ్రీల చొప్పున పన్నెండు గంటలకు మూడు వందల అరవై డిగ్రీలు -
ఒక గంటను ఆరు డిగ్రీలుగా విభజించి నిమిషంగా నిర్ణయించారని మరొక అవగాహన -
నిమిషానికి ఆరు డిగ్రీలు చొప్పున గంటకు అరవై నిమిషాలుగా మూడు వందల అరవై డిగ్రీలు -
నిమిషాన్ని కూడా ఆరు డిగ్రీల ఆధారంగానే అరవై క్షణాలుగా నిర్ణయించారని నా మరో అవగాహన -
క్షణాన్ని కూడా ఆరు డిగ్రీల ఆధారంగా ఒక క్షణంగా అతి తక్కువ సమయాన్ని గుర్తించేందుకు నిర్ణయించారని చివిరి అవగాహన -
మూడు వందల అరవై డిగ్రీలను కాలంగా నిర్ణయించేందుకు ముఖ్య కారణము ఏమనగా సూర్యుని భ్రమణము ఆధారంగాననే నా ఆలోచన -
ఒక క్షణ సమయాన్ని ఖచ్చితంగా గుర్తించ గల్గితే చాలు ఆ రోజు ముగింపును మనం సులువుగా తెలుసుకొచ్చు -
మొదట ఒక క్షణాన్ని ఎప్పుడు ప్రారంభించిన ఒక రోజు పూర్తి కావడాన్ని నేను తెలిపిన డిగ్రీల ఆధారంగా గుర్తించవచ్చు -
ఒక రోజు పూర్తి కావడాన్ని ఖచ్చితంగా మరల రేపటికి అదే క్షణానికి ముందుగా ఒక రోజని సులువుగా అర్థమవుతుంది -
క్షణ సమయంతోనే నిమిషాన్ని గంటను అలాగే పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటల కాల వ్యవధిని రోజుగా మూడు వందల అరవై డిగ్రీల ఆధారంగా -
ఎనభై ఆరు వేల నాలుగు వందల క్షణాలు పూర్తయితే చాలు ఒక రోజుగా మనకు సులువుగా అర్థమువుతుంది -
ఈ క్షణాలను పూర్తిగా అయ్యేంతవరకు మనం ఎల్లప్పుడు ఖచ్చితంగా గుర్తించలేము కనుక గడియారముగా ఒక యంత్రాన్ని కనుగొన్నాము -
మొదటి క్షణాన్ని సూర్యుడు మనకు తలపైన నిటారుగా ఉన్నప్పుడు మధ్యాహ్న సమయాన ఆరంభించారని నాలో దాగిన ఒక గొప్ప ఆలోచన -
ఇలాంటి విషయాలు ఎన్నైనా తెలుపగలను నాలో ఎన్నో ఎన్నెన్నో విజ్ఞానంగా మేధస్సున అనంతముగా దాగి ఉన్నాయి -

No comments:

Post a Comment