Sunday, March 7, 2010

పక్షులు జంతువులు అంటున్నాయి

పక్షులు జంతువులు అంటున్నాయి మాకు మనుషుల్లా ఆలోచనలు లేవు భావనలే మాలో -
ఆలోచనలే ఉంటె ఏనాడో మాలో ఒక భాష కలిగి మీతో మాట్లాడే వాళ్ళం ఇద్దరికీ అర్థమయ్యేలా -
మా భాధలు యేవో మీకు తెలుపలేం ఆలోచనలే ఉన్నా మీరు మమ్మల్ని అర్థం చేసుకోలేరు -
మాలో కొన్ని రకాల పక్షువులను జంతువులను భుజిస్తున్నారు ఎన్నో రకాలుగా నాశానాలే -
జీవహింస అనే భావం మీ సత్య జ్ఞానంలో లేదా లేకపోతే మీ పిల్లలకు గాయమైతే ఏ ఆలోచనతో -
మా పిల్లలు చనిపోతే ఎక్కడని వెతికేది ఏ సమాచార వార్తలలో తెలిపేది ఏ భాషలో వివరించేది -
మాకు స్వేచ్చగా జీవించాలనే ఉంది మీలాగా మాకు అన్ని వసతులు విజ్ఞానం రూప శైలి లేవు -
మీరు ఏది కావలసి వస్తే దాన్ని ఎలాగో పొందవచ్చు మాకు అలాంటి ఆలోచనలే లేవు కలగవు -
మాకు ఆత్మజ్ఞానం తెలియకపోయినా మాలో ఆత్మ భావనలే ఉన్నాయి భావనలలోనే ఎల్లప్పుడు -
మమ్మల్ని వధించేటప్పుడైనా మీలో ఆలోచన భాధలు కలగకపోతే భావనలైనా మనిషిగా కలగాలే -
భావనలు మనిషిలో లేకపోతే ఆధ్యాత్మిక సత్యాలు తెలియక పరమాత్మ భావనను గుర్తించలేని స్థితిలో -

No comments:

Post a Comment