భగవంతుడు వస్తానన్న వేళ నీలో ఉన్న భావన తెలుపగలవా
కనిపిస్తూ తెలిపినాడా కనబడక తెలిపినాడా తను వస్తానని
మాటలు విన్నావా రూపాన్ని చూశావా భగవంతుడే ననుకున్నావా
నిజమేనని తలచావా వస్తాడనే వేచి ఉన్నావా ఇంకా అలానే
అతనితో మాట్లాడినావా లేక విన్నదే గ్రహిస్తూ నిలిచావా
అతను తెలిపేటప్పుడు చుట్టూ ఉన్న ప్రాంతం ఏ విధంగా ఉన్నది
అతడు తెలిపిన సమయ సందర్భం ఎలా ఉన్నదో గుర్తున్నదా
వస్తాడనే అనుకో అతనికి ఏం చేశావో ఎలా ఆ ప్రదేశాన్ని ఉంచావు
అతడు వస్తాననుటలో నీలో ఉన్న గొప్ప గుణం ఏమిటో నీకైనా తెలుసా
ఎప్పటికి సత్యవతిగానే జీవిస్తూ పరమాత్మ స్వభావాలతో ఉంటున్నావా
ఎవరికైనా తెలిపావా ఎవరికి తెలియకూడదనే తెలుపక పోయావా
నేను తెలిపినవన్ని నీలో కలిగితే వస్తాడో లేదో నీకు అర్థమవుతుంది
ఆశ లేని భావన నీలో ఉంటె ఎప్పటికి నీలోనే భగవంతుడు ఉంటాడు
ఆత్మజ్ఞానంతో జీవించే వరకు ఆత్మలోనే పరమాత్మ జీవిస్తూనే భావనగా
No comments:
Post a Comment