Friday, March 5, 2010

మనల్ని ఎగిరించే శక్తి

మనల్ని ఎగిరించే శక్తి ఆలోచనలకే ఉంది ఆలోచన లేక ఎగరలేము
ఆలోచనలో ఎగర గలమనే భావన కలగాలి లేదంటే ఎగరలేము
మన బరువును కూడా ఎగర గలిగించే శక్తి ఆలోచనకే ఉంది
ఎగరలేకున్నా ఎగరడానికి కావలసినదేమో ఆలోచనయే తెలుపుతుంది
నీటిలో ఈదాలన్నా ఈత నేర్చుకోవాలన్నా ఆలోచనలతోనే
ఒక యంత్రముతో వాహనంగా గాలిలో ఎగిరించాలన్నా ఆలోచనలతోనే
ఏ యంత్రములోనైనా స్పర్శగా ఆలోచనలుగానే అవి పని చేయగల్గుతాయి
పక్షి గాలిలో ఎగారాలన్నా నీటిలో జల జీవులు ఈదాలన్నా ఆలోచనలతోనే
ఏ మాయ చేయాలనుకున్నా భ్రమ కలిగించాలన్నా ఆలోచనలే
దేనిని నమ్మాలన్నా నమ్మకం కలగాలన్నా ఆలోచనలతోనే
విజ్ఞానమైన ఆలోచనలతోనే ఏదైనా సాధించగలం సృస్టించగలం
మానవుడు యోగిగా శాస్త్రవేత్తగా మహాత్మాగా ఎలాగైనా ఆలోచనలతోనే
ఇంకా ఎంతో కొన్ని వేల లక్షల యుగాలుగా ఆలోచనల గురించి నేనే చెప్పగలను
అతి సూక్ష్మమైన వాటిని ఎన్నిటినో ఎన్నో రకాలుగా వివరించగలను
మానవుని యొక్క గొప్పతనం ఏమిటంటే ఆలోచనలను విజ్ఞానంగా గుర్తించడం
విజ్ఞానమైన ఆలోచనలతోనే ఎన్నిటినో సృష్టిస్తూ మానవుడు ఎన్నిటినో సాధిస్తున్నాడు
ఆలోచనలేకుండా శ్వాస కూడా ఆడదు అలాగే శరీరంలో వివిధ ప్రక్రియలు జరగవు
మనం కింద పడాలన్నా ఆలోచన కలుగుతుంది మీకు తెలియాలంటే ఎరుకాలోచనయే
విశ్వం ఆలోచనలేని భావనతో జీవి ఆలోచన భావనతో ఇలా సృష్టిలో ఎన్నో ఎన్నెన్నో
ప్రకృతిలో కొన్నింటికి చలన భావాలుంటాయి అలాగే కొన్నింటికి చలనంలేక
ఏదైనా సరే భావన లేక లేదా ఆలోచన లేక ఇది జరిగింది ఇది వచ్చిందని తెలుపగలరా
క్షణంలో ఒక జీవికి కలిగే కొన్ని వేల ఆలోచనలను గుర్తించగలిగే వారికే విజ్ఞానార్థము

No comments:

Post a Comment