తల్లి స్వరమున ఎన్నో రాగభావ పదాలు
పలుకగా పలుకగా పదాలు అర్థాలుగా
తెలుపగా తెలుపగా అర్థాలు భాషగా
తల్లి తెలిపిన అర్థమే తెలుగు భాషగా
-----
అర్థమగుటకు తల్లి ఒడిలోనే భావాలతో
భావాలు తెలుపుతూ తెలుసుకుంటూ
అనర్థాన్ని అర్థంగా మారుస్తూ పలికిస్తూ
పరమార్థముగా నా బాషే నీకు తోడుగా
తెలుగు తల్లినై పెదాల యందే తియ్యగా
No comments:
Post a Comment