Showing posts with label సయోధ్య. Show all posts
Showing posts with label సయోధ్య. Show all posts

Friday, July 15, 2016

మహాత్మగా నడిచే కాలం ఏది

మహాత్మగా నడిచే కాలం ఏది
కాలంతో నడిచే మహాత్ములు ఏరి
మహాత్మగా జీవించే కాలం ఎప్పటికో మరి  || మహాత్మగా ||

మనలో మనకు తెలియని విజ్ఞానమే మహాత్మకు తెలిసేనని
మనలో మనం చెప్పుకోలేని విజ్ఞానమే మహాత్ములు తెలిపేనని

మహాత్మగా ఎదగాలని ఉన్నా ఎదగలేని కాలం తీరు సమస్యలతోనే
మహాత్మగా నిలవాలని ఉన్నా నిలువలేక సమయంతో సాగిపోతూనే

మనలో మనమే మహాత్మ అని గర్వించే భావాలు శూన్యమై పోయేనే
మనలో మనం గుర్తించని మహానుభావులు ఎందరో ఎక్కడికో వెళ్ళేనే  || మహాత్మగా ||

మహాత్మగా సాగే ప్రయాణం కాలమే తెలిపే లోకమై వస్తుందని
మహానుభావులుగా నడిచే మార్గం మనతోనే మొదలవుతుందని

మనకు మనమే సహాయం చేసుకుంటే సయోధ్యమైన అభివృద్దేనని
మనలో మనం కలిసి ఏకమై పోతేనే ఏదైనా మన కోసం ప్రాప్తిస్తుందని

అభివృద్ధిలో ఉన్న యోగ భావమే మహాత్ముల సారాంశమైన విధానమని
ఏకత్వంలో ఉన్న సంయోగమే మహానుభావుల ప్రశాంతమైన విజ్ఞానమని  || మహాత్మగా ||