Showing posts with label కఠినం. Show all posts
Showing posts with label కఠినం. Show all posts

Wednesday, March 15, 2017

ఏదో చూస్తూ ఉన్నా తోచదులే నా మదిలో

ఏదో చూస్తూ ఉన్నా ఏది తోచదులే నా మదిలో
ఏదో చేస్తూ ఉన్నా ఏది కలగదులే నా యదలో
ఏదో వింటూ ఉన్నా ఏది నిలవదులే నా దేహంలో

ఏదేదో చేయాలని ఎంతో నేర్చుకోవాలని అనుకున్నా నేనే నా మేధస్సులో ఎంతో గొప్పగా  || ఏదో చూస్తూ ||

ఎప్పటి దాకా చూస్తానో ఎంత వరకు చేస్తానో ఏదైనా వింటానో తెలియదులే తుది వరకు
చూసింది ఎప్పటిదో చేసింది ఏనాటిదో విన్నది ఏమైనదో తెలియదులే ఏ చివరి వరకు

జ్ఞాపకాల విజ్ఞానంతో మరవలేని జ్ఞానంతో ఏదో తెలియని కార్యాలతో సాగేను నా ప్రయత్నం
అనుభవాల నిర్ణయంతో ఏదో పరిష్కారంతో అధ్యాయాలుగా కార్యాలతో సాగేను నా విజయం  || ఏదో చూస్తూ ||

నా కార్యాలకు ఏ విఘ్నం కలిగినా అభ్యంతరం లేదని నాలో కలిగే భావాలే తెలిపేను పరమార్థం
నా సమస్యలకు ఆటంకం వచ్చినా అనర్థం జరిగినా నాలో నిలిచే ఆలోచనలే తెలిపేను పరమాత్మం

ఏ కాలం ఏ విజ్ఞానాన్ని తెలుపుతుందో మేధస్సుకే పరీక్షగా ఆలోచనలకే సమస్యగా తోచే గమనం
ఏ సమయం ఏ అనుభవాన్ని సూచిస్తుందో మేధస్సుకే దీక్షగా భావాలకే కఠినంగా తోచే తరుణం  || ఏదో చూస్తూ ||