Showing posts with label సుజ్ఞానం. Show all posts
Showing posts with label సుజ్ఞానం. Show all posts

Friday, September 30, 2016

విజ్ఞానిగా ఉదయించావు సుజ్ఞానంతో ఎదుగుతున్నావు

విజ్ఞానిగా ఉదయించావు సుజ్ఞానంతో ఎదుగుతున్నావు
ప్రజ్ఞాన పర బ్రంహగా విశ్వ విజ్ఞానంతో సాగుతున్నావు
ప్రతి జీవిలో పరమాత్మవై పర ధ్యాసతో జీవిస్తున్నావు   || విజ్ఞానిగా ||

శ్వాసే ధ్యాస అని పర ధ్యాసతో ధ్యానం చేస్తూ ఉన్నావా
ధ్యాసే జీవం అని పర భావంతో ధ్యానిస్తూనే ఉంటావా
శ్వాస ధ్యాసతో ధ్యానిస్తూనే పర జీవంతో ఉంటున్నావా

ధ్యాసే విజ్ఞానమని శ్వాసపై జ్ఞాపకమే తలచి ఎరుకతో ధ్యానిస్తున్నావా
శ్వాసే సర్వస్వమని ధ్యాసతో ఏకాగ్రతనే వహించి ఎదుగుతున్నావా
ధ్యానమే పర తత్వ భావమని పరమాత్మగా నీవే శ్వాసతో సాగుతున్నావా  || విజ్ఞానిగా ||

ధ్యానించుటలో తెలిసే భావాలే విశ్వ విజ్ఞానమని మేధస్సుకే తెలిసేనా
ఏకాగ్రతలో కలిగే ఆలోచనలే జీవన పరిశోధనమని మనస్సుకే తెలిసేనా
ఎరుకతో తోచే భావాల అర్థాలే నవ జీవన విధానమని మనిషికే తెలిసేనా

మహాత్మగా నీవే జీవించుటలో నీవే మహర్షిగా జీవించెదవు
ఆత్మగా నీవే సాధించుటలో నీవే పరమాత్మగా మిగిలెదవు
బ్రంహగా నీవే తెలుపుటలో నీవే ఓ బ్రంహర్షిగా ఉండెదవు  || విజ్ఞానిగా ||

Tuesday, July 26, 2016

జీవంలో తత్వమా దేహంలో దైవమా

జీవంలో తత్వమా దేహంలో దైవమా
ఆలోచనలో భావమా మేధస్సులో వచనమా
మాటలతో సాగే జీవన వేదమా కాలంతో విజ్ఞానమా  || జీవంలో ||

సర్వం విజ్ఞానం సర్వాంత సుజ్ఞానం సత్యాంశ భోదనం
విశ్వం విధేయం విశ్వాంతర సంభోధం నిత్యాంశ పఠనం

అద్వైత్వ భావమే దేహంలో ఆత్మ స్వభావం
దైవత్వ స్వభావమే జీవంలో శ్వాస తత్వం

మరవలేని జీవిత ప్రయాణంలో ఎన్నో జీవ తత్వాలు ఆలోచనల స్వభావాలు
మరుపేలేని కాల గమనంలో ఎన్నో దైవత్వ స్వభావాలు సత్యాంశ ముఖ్యాంశాలు  || జీవంలో ||

మాటలతో విజ్ఞానం పరిచయాల కార్య కలాపం
మౌనంతో పరిశోధనం సంభాషణలతో సమీక్షం

దీర్ఘ కాల ఆలోచనలలోనే అద్వైత్వ శిఖండం
హిత కాల భావాలలోనే సత్యాంశ ఆత్మ దైవత్వం

మరుపులేని మేధస్సుతో కాలాన్ని భవిష్యతగా భావిస్తూ ఆలోచించడం అద్వైత్వ దైవత్వం
మరవలేని విజ్ఞానంతో సత్యాన్ని హితముగా బోధిస్తూ పరిశోధించడం అమరత్వ జీవత్వం   || జీవంలో ||