Tuesday, July 26, 2016

జీవంలో తత్వమా దేహంలో దైవమా

జీవంలో తత్వమా దేహంలో దైవమా
ఆలోచనలో భావమా మేధస్సులో వచనమా
మాటలతో సాగే జీవన వేదమా కాలంతో విజ్ఞానమా  || జీవంలో ||

సర్వం విజ్ఞానం సర్వాంత సుజ్ఞానం సత్యాంశ భోదనం
విశ్వం విధేయం విశ్వాంతర సంభోధం నిత్యాంశ పఠనం

అద్వైత్వ భావమే దేహంలో ఆత్మ స్వభావం
దైవత్వ స్వభావమే జీవంలో శ్వాస తత్వం

మరవలేని జీవిత ప్రయాణంలో ఎన్నో జీవ తత్వాలు ఆలోచనల స్వభావాలు
మరుపేలేని కాల గమనంలో ఎన్నో దైవత్వ స్వభావాలు సత్యాంశ ముఖ్యాంశాలు  || జీవంలో ||

మాటలతో విజ్ఞానం పరిచయాల కార్య కలాపం
మౌనంతో పరిశోధనం సంభాషణలతో సమీక్షం

దీర్ఘ కాల ఆలోచనలలోనే అద్వైత్వ శిఖండం
హిత కాల భావాలలోనే సత్యాంశ ఆత్మ దైవత్వం

మరుపులేని మేధస్సుతో కాలాన్ని భవిష్యతగా భావిస్తూ ఆలోచించడం అద్వైత్వ దైవత్వం
మరవలేని విజ్ఞానంతో సత్యాన్ని హితముగా బోధిస్తూ పరిశోధించడం అమరత్వ జీవత్వం   || జీవంలో ||

No comments:

Post a Comment