Thursday, July 14, 2016

సూర్యోదయమే జగతికి జీవం

సూర్యోదయమే జగతికి జీవం
సూర్యకిరణమే ప్రకృతికి తేజం

సూర్యుని వెలుగే విశ్వానికి నవోదయం
సూర్యుని తేజమే లోకానికి మహోదయం  || సూర్యోదయమే ||

ఉదయంతో మేధస్సులో మెలకువ సాగే యత్నం  
సూర్యునితో మన ఆలోచనలు కార్యాలతో నిమగ్నం

ఉదయించే భావాలలో ఉన్న ఉత్తేజం మహా వేదం
ప్రజ్వలించే స్వభావాలలో మన తత్వం వేదాంతం  || సూర్యోదయమే ||

ప్రతి కిరణం జగతికి ఎన్నో విధాల అవసరం
ప్రతి తేజం విశ్వానికి ఎన్నో వైపులా విశిష్టం

సూర్యుడే ప్రతి జీవికి విజ్ఞాన సూచక సోపానం
సూర్యుడే ప్రతి జ్ఞానికి అనుభవ సూత్ర చరితం  || సూర్యోదయమే ||   

No comments:

Post a Comment