Friday, July 29, 2016

అమ్మంటే ప్రాణమని తల్లిగా జీవం పోసి ఉచ్చ్వాస నిచ్చ్వాసాలనే ధారపోసే మాతృ మూర్తిగా జగతిలో వెలుగుతున్నది

అమ్మంటే ప్రాణమని తల్లిగా జీవం పోసి ఉచ్చ్వాస నిచ్చ్వాసాలనే ధారపోసే మాతృ మూర్తిగా జగతిలో వెలుగుతున్నది
అమ్మంటే తత్వమని మహాత్మగా ఎదిగే జీవన హృదయంగల మహా సాత్వి స్త్రీ స్వరూపిణి మాతృదేవోభవగా నిలిచినది  || అమ్మంటే ||

అమ్మతో మన జననం జగతికి విజ్ఞాన సోపానం
విశ్వంతో మన ఎదుగుదల లోకానికే సముచితం

అనుబంధం మన దేహానికి జీవ రక్త సంబంధం
అనురాగం మన ఆలోచనకు మహా బంధుత్వం  || అమ్మంటే ||

మాటలతో పలుకు పిలుపులతో పదాల తేనీయం భాషకే మాతృత్వం
వ్యాసాలతో తెలిపే మహానుభావుల వర్ణన కథనం మానవ జాతికే సగర్వం

అమ్మతో జగమంతా మాతృత్వం మహా సంగ్రామ జీవన విధానం
అమ్మతో విశ్వమంతా విజ్ఞానం మహా జీవుల తత్వ వేదాంతరం    || అమ్మంటే ||

No comments:

Post a Comment