Tuesday, July 12, 2016

బాబా నీవలె ఎవరు అవతరించెదరు

బాబా నీవలె ఎవరు అవతరించెదరు
సాయి నీలాగే ఎవరు ఉదయించెదరు

నీ రూపాన్నే ఇంకెవరు ధరించెదరు
నీ ఆకారాన్నే మరల ఎవరు పొందగలరు
నీ భావ తత్వాలతో ఎవరు జీవించగలరు   || బాబా ||

నీలోని ఆత్మ తత్వం మహాత్మగా నిలిచేను
నీలోని వేద భావం మాతృ తత్వమై సాగేను

నీలోని విజ్ఞానం విశ్వ విజ్ఞాన పాండిత్యం
నీలోని వేదాంతం దివ్య జ్ఞాన సాహిత్యం

నీలోని ఓర్పుకు మహా విశ్వమే నిలయమైనది
నీలోని సహనానికి ప్రకృతియే శాంతించినది  || బాబా ||

నీలో దాగిన కరుణాదయామృతం ఓ మహా తత్వం
నీలో నిండిన మధురామృతం ఓ గొప్ప నిర్వచనం

నీవు సాగే కాలం అజ్ఞానాన్ని తొలగించే అనుభవం
నీవు నడిచే ప్రదేశం ప్రశాంతతను పొందే యోగం

నీవు లేని లోకం అల్లా కల్లోలమై పోతున్నది
నీవు లేక ఈ జగతి అదో రకమై సాగుతున్నది  || బాబా || 

No comments:

Post a Comment