Monday, July 25, 2016

అమ్మవో దేవతవో మహాత్ములకే తల్లివో

అమ్మవో దేవతవో మహాత్ములకే తల్లివో
విశ్వానివో జీవానివో ఆత్మలకే తత్వానివో  || అమ్మవో ||

జీవ సృష్టికే స్పందన కలిగే తరుణం నీలో దాగిన మహా మాతృ స్వభావమే
విశ్వ జగతికే మధురం కలిగే సమయం నీలో నిండిన మాతా స్వర తత్వమే

జగతికి మరణమే లేని జీవ సృష్టిలో నీవే మహా అద్భుత మూర్తివో
విశ్వానికే నిలయమైన జీవుల భావ స్వభావాలతో జీవించే ధాతవో   || అమ్మవో ||

ఆత్మ తత్వాలతో జీవం పోసే మహాత్మదేవోభవ నీలోని జీవత్వమే
విశ్వ భావాలతో ఊపిరి నింపే మాతృదేవోభవ నీలోని ప్రేమత్వమే

అమ్మగా ఉదయించే నీ కిరణమే ఆకార రూపాల జీవములు
తల్లిగా ఒదిగిపోయే నీ ఆశయమే ప్రకృతి నిర్మాణ ద్వీపములు  || అమ్మవో || 

No comments:

Post a Comment