Wednesday, July 13, 2016

నా తల్లికి నేనే హృదయం

నా తల్లికి నేనే హృదయం
నా తల్లికి నేనే నేత్రం
నా తల్లికి నేనే రూపం
నా తల్లికి నేనే ఆకారం   || నా తల్లికి ||

నాలోని శ్వాసే తన జీవం
నాలోని ధ్యాసే తన భావం
నాలోని మనస్సే తన మమకారం
నాలోని ఉచ్చ్వాస నిచ్చ్వాసాలే తనకు ప్రాణం

నాలోని ఆత్మకు నీవే ప్రతి రూపం
నీలోని మహాత్మకు నీవే మహా దైవం

నీవే నాలో దాగిన విశ్వం
నీవే నాలో నిండిన లోకం
నీవే నాలో వెలసిన జగతి
నీవే నాలో విరిసిన ప్రకృతి    || నా తల్లికి ||


నా ఊపిరిలో నీవే ఉత్సాహం
నా ఉష్ణములో నీవే ఉత్తేజం
నా దేహములో నీవే స్పందనం

నాలో ఉన్న బంధమే నీ అనుబంధం
నాలో ఉన్న మమతే నీ అనురాగం

నేను నడచిన మార్గమే నీ ప్రయాణం
నేను నిలిచిన స్థానమే నీ గమ్యం
నేను కొలిచిన వేదమే నీ విజ్ఞానం
నేను తలచిన గౌరవమే నీ సత్కారం   || నా తల్లికి || 

No comments:

Post a Comment