Friday, July 29, 2016

సోదరా నా మాట వినరా ఎప్పటికైనా ఏనాటికైనా నీ కోసమేరా

సోదరా నా మాట వినరా ఎప్పటికైనా ఏనాటికైనా నీ కోసమేరా
నేను నీతో సాగలేనురా నా విజ్ఞానం నీతోనే జీవిస్తూ ఉంటుందిరా  || సోదరా ||

సమస్యలకు పరిస్కారం కాలం సూచించినా తెలుసుకోలేని అనుభవమే
అనుభవం ఉన్నా ఆచరణ లేని జీవన వ్యసనాల జీవిత అనర్థాలే ఎన్నో

కలుషితాన్ని తొలగించు మలినాన్ని వదిలించు నీటినే ప్రవహించు
ఆగే నీటి మట్టం కలుషితమై మలినంతో కఠినమై నిన్ను ఆవహించేనురా   || సోదరా ||

జీవన విధానము పద్ధతిగా సాగలేక పోతే సమాజం పరిస్కారంలేని సమస్యలతోనేరా
ప్రణాళికలు సరికాకపోతే శ్వాశ్విత విజ్ఞాన కాల ప్రణాళికతో మరో సృష్టిని సృష్టించరా

ప్రకృతి వైపరిత్యాలు ఎన్ని ఎదురైనా తట్టుకునే మహా గ్రామాలనే పునః నిర్మించు
ప్రళయాలు ఎన్ని సంభవించినా నిత్యం సురక్షితంగా నిలిచే నగరాలనే స్థాపించు || సోదరా || 

No comments:

Post a Comment