Wednesday, July 27, 2016

అమ్మగా వచ్చాను ఈ లోకానికి అమ్మమ్మగా ఉన్నాను ఈ జగతికి

అమ్మగా వచ్చాను ఈ లోకానికి అమ్మమ్మగా ఉన్నాను ఈ జగతికి
తల్లిగా ఒదిగాను ఈ భువనానికి మహాత్మగా ఎదిగాను ఈ విశ్వానికి  || అమ్మగా ||

జీవమే శ్వాసగా ప్రాణమే ఊపిరిగా ఉచ్చ్వాస నిచ్చ్వాసాలే ధ్యాసగా సాగేను
ఆత్మయే దైవంగా తత్వమే వేదంగా స్వభావాలే నాలో ఆలోచనగా కలిగేను

జీవత్వములోనే దైవత్వమై నేనుగా జీవిస్తున్నా
ఆత్మ తత్వములోనే మహాత్మనై నాలోనే ఒదిగున్నా

ఏనాటి నా భావ తత్వములు ఈ జగతికి ప్రాణమై కొనసాగేను
ఎప్పటి జీవ బంధములు ఈ లోకానికి ఊపిరిగా సాగిపోయేను  || అమ్మగా ||

మౌనమై ఉన్నాను ఆకాశంతో ధ్యానమై ఉన్నాను ప్రకృతిలో
దేహమై ఉన్నాను శిఖరంతో లీనమై ఉంటాను భవ సృష్టిలో

మరణమైనను నాలో నిలిచే మౌనం శ్వాసే ఆగేపోయే తరుణం
శరీరం క్షీణిస్తూ మట్టిలో కలిసి శూన్యమై కదలిక లేని కణజాలం

జన్మతోనే నేను అవతరిస్తూ మరో జన్మనే ప్రసాదిస్తూ మిగిలిపోయాను
జీవులకై అనుగ్రహిస్తూ జన్మలతోనే ప్రేమామృతత్వమై ఉండిపోయాను  || అమ్మగా || 

No comments:

Post a Comment