Thursday, July 21, 2016

అమ్మ అనే భావన మేధస్సులో జీవిస్తున్నది

అమ్మ అనే భావన మేధస్సులో జీవిస్తున్నది
తల్లీ అనే వేదన హృదయంలో నివశిస్తున్నది  || అమ్మ అనే ||

జన్మించగా శ్వాసలో తొలి భావన అమ్మే అని
జీవించగా జీవంలో తొలి స్పర్శ తల్లియే అని

అమ్మతో జన్మించడం మధురమైన విశ్వ భావన
తల్లితో ఎదగడం మనోహరమైన దివ్య స్పందన

అమ్మతో జీవించడంలో కరుణామయ తన్మయం
అమ్మతో కొనసాగడంలో దయామయ తరుణత్వం  || అమ్మ అనే ||

అమ్మ అనే పిలుపుతో తన హృదయంలో మరో జీవం ఉదయిస్తుంది
అమ్మ అనే పలుకుతో తన మనస్సులో మరో శ్వాసయే ఎదుగుతుంది

అమ్మకు మనమే మరో ప్రాణమై మన సుఖ సంతోషాలనే కోరుకుంటుంది
అమ్మకు మనమే మరో జీవమై మన విజ్ఞాన అనుభవాలనే పంచుకుంటుంది

అమ్మతో మొదలైన జీవితం మరలా మరో జన్మ మరో అమ్మతోనే జననం
అమ్మతో సాగే జీవనం ఎప్పటికి మరవలేని గొప్ప జ్ఞాపకాల భావన వచనం  || అమ్మ అనే || 

No comments:

Post a Comment