Showing posts with label శరణం. Show all posts
Showing posts with label శరణం. Show all posts

Monday, August 14, 2017

గమనించవా నా శృతి భావాలను

గమనించవా నా శృతి భావాలను
వినిపించవా నా ధృతి స్వరాలను
ధ్వనించవా నా కృతి తత్వాలను ... హరా హరా!  || గమనించవా ||

స్వరం శృతిస్తున్న గానమే గాత్రం
గళం స్మరిస్తున్న గంధర్వమే ఘనం
శుభం పలుకుతున్న శోభనమే శరణం

దేహం జీవిస్తున్న విధానమే దైవం
దైవం వరిస్తున్న స్వభావమే జీవం
జీవం విహరిస్తున్న తత్వమే గానం  || గమనించవా ||

మోహం తపిస్తున్న కాలమే తపనం
సూక్ష్మం జీవిస్తున్న క్షణమే వినయం
దాహం పలికిస్తున్న గానమే గమకం

వేదం తరిస్తున్న విజ్ఞానమే కమలం
భావం ఫలిస్తున్న మేధస్సే మధురం
తత్వం తిలకిస్తున్న దేహమే తన్మయం  || గమనించవా || 

Thursday, March 23, 2017

మరణం తెలిసిందా ప్రయాణం ముగిసిందా ఉదయం అస్తమించిందా

మరణం తెలిసిందా ప్రయాణం ముగిసిందా ఉదయం అస్తమించిందా
ప్రాణం నిలిచిపోయిందా మౌనం కలిగిందా హృదయం ఆగిపోయిందా

జీవితం అంతమౌతుందా  సందర్భం తెలిపిపోతుందా జీవనం నిలిచిపోతుందా
సమయం చెప్పి వస్తుందా కాలం తలచి పోతుందా తరుణం తపించి పోతుందా  || మరణం ||

శరణం లేని జీవితం అభయం లేని జీవనం ప్రశాంతమై కదిలేనా
విజ్ఞానం లేని గమనం ఉపయోగం లేని కార్యం సుఖాంతమై సాగేనా

భావమే లేని తత్వంతో స్పర్శ లేని స్వభావంతో మరణము సంభవించేనా
వేదమే లేని విజ్ఞానంతో మౌనమే లేని హృదయంతో మృత్యువు ఆవహించేనా  || మరణం ||

కారణం లేని కార్యం పరమార్థం లేని అర్థం పరిశోధన లేని పర్యవేక్షణ ఆగేనా
కాలం లేని కర్తవ్యం రూపం లేని ఆకారం దైవం లేని ధర్మం నిత్యం నిలిచేనా

ధైర్యం లేని జీవనం కోరిక లేని జీవితం విజ్ఞానం లేని కార్యం అంతమయ్యేనా
రక్షణ లేని జీవం శ్వాస లేని రూపం శాంతం లేని హృదయం నిలిచిపోయేనా  || మరణం || 

Monday, March 13, 2017

జీవము నీవే ప్రాణము నీవే వేదము నీవే జ్ఞానము నీవే

జీవము నీవే ప్రాణము నీవే వేదము నీవే జ్ఞానము నీవే
విశ్వము నీవే జగము నీవే లోకము నీవే బ్రంహము నీవే
దైవము నీవే దేహము నీవే రూపము నీవే ఆకారము నీవే
సత్యము నీవే నిత్యము నీవే ధర్మము నీవే మర్మము నీవే

శూన్యం నీవే గమ్యం నీవే చిత్రం నీవే చైత్రం నీవే
జననం నీవే శరణం నీవే మరణం నీవే మౌనం నీవే
హాస్యం నీవే భాస్పం నీవే దుఃఖం నీవే సుఖనం నీవే
మననం నీవే గమనం నీవే చరణం నీవే తరుణం నీవే

కాలం నీవే కావ్యం నీవే భావం నీవే తత్వం నీవే
సర్వం నీవే శాంతం నీవే గానం నీవే గాత్రం నీవే
ప్రకృతి నీవే ఆకృతి నీవే దేశం నీవే ప్రదేశం నీవే
తేజం నీవే ప్రకాశం నీవే కిరణం నీవే కాంతం నీవే

కంఠం నీవే శంఖం నీవే శ్లోకం నీవే శోభితం నీవే
పత్రం నీవే పుష్పం నీవే పద్మం నీవే బిల్వం నీవే
నేత్రం నీవే స్నేహం నీవే వచనం నీవే ప్రవచనం నీవే
మధురం నీవే సంతోషం నీవే ఆనందం నీవే ఆకాశం నీవే

జలం నీవే జయం నీవే వర్షం నీవే మేఘం నీవే
వనం నీవే నివాసం నీవే వరం నీవే వసంతం నీవే
మార్గం నీవే ప్రయాణం నీవే స్థానం నీవే స్థైర్యం నీవే
ఆరంభం నీవే ఆద్యంతం నీవే అంతం నీవే అనంతం నీవే 

Wednesday, March 8, 2017

వరసిద్ధి వినాయక వరమియ్యవా

వరసిద్ధి వినాయక వరమియ్యవా
నీ సిద్దులకు విజ్ఞానం ప్రసాదించవా
నీ భక్తులను ప్రయోజనం చేయవా   || వరసిద్ధి ||

నీ విశ్వ విజ్ఞానాన్ని మహిమగా చూపవా
నీ విశ్వ తేజాన్ని మేధస్సుకే కలిగించవా

నీలో దాగిన అనంత భావాలను వర్ణించవా
నీలో నిండిన అమృత తత్వాన్ని తెలుపవా

లోకానికి నీ విజ్ఞానమే శరణం అభయం  
జగతికి నీ ధ్యానమే తపనం తరుణం    || వరసిద్ధి ||

వేదాలనే బోధించి తత్వాలనే అపురూప వర్ణ తేజస్సులతో రుచింపవా
భావాలనే పరిశోధించి స్వభావాలనే అద్వితీయ గుణాలతో మార్చవా

జగతినే ప్రశాంతమైన ప్రకృతి పర్యావరణం చేయవా
లోకాన్నే నిర్మలమైన కాల కార్యాలతో నడిపించవా

దైవం రూపం నీవే ధర్మం
వేదం భావం నీవే సత్యం   || వరసిద్ధి || 

Thursday, February 9, 2017

ఏనాటిదో మరణం ఎప్పటి వరకో శరణం

ఏనాటిదో మరణం ఎప్పటి వరకో శరణం
ఏనాటిదో జననం ఎప్పటి వరకో జీవితం

జన్మించిన నాటి క్షణము నుండి తల్లి రక్షణమే కవచం
మరణించిన నాటి క్షణము నుండి పర లోకమే శరణం   || ఏనాటిదో ||

మరణంతో దేహం పంచ భూతాలుగా కలసినా శూన్యమే ధర్మం
జననంతో శరీరం పంచ భూతాలుగా వెలసినా విజ్ఞానమే సత్యం

మరణంతో మేధస్సులో నిండిన విశ్వ విజ్ఞాన భావ స్వభావ తత్వాలు పర బ్రంహ లోకానికే అంకితం
మరణంతో దేహంలో దాగిన ఆత్మ పరంజ్యోతి పరమాత్మగా పర విష్ణు వైకుంఠ లోకానికే సర్వాంకితం
మరణంతో శరీరంలో ఆగిన ఉచ్చ్వాస జీవ పరంధామగా పర ఈశ్వర కైలాస లోకానికే జగతాంకితం    || ఏనాటిదో ||

మరణాన్ని జయించడం వేద విజ్ఞాన సత్య ధర్మాలను అధిగమించడం
జననాన్ని కోరుకోవడం విశ్వ విజ్ఞాన భావ స్వభావ తత్వాలను ధరించడం

జననంతో ప్రతి క్షణం ఉచ్చ్వాస నిచ్చ్వాసాల పోరాటమే దేహానికి సౌఖ్యం
జననంతో ప్రతి క్షణం హృదయ చలన తత్వాల సమరమే దేహానికి సౌలభ్యం
జననంతో ప్రతి క్షణం మేధస్సు ఆలోచన భావాల ఉపోద్ఘాతమే దేహానికి సౌభాగ్యం  || ఏనాటిదో || 

Monday, October 17, 2016

బుద్ధమ్ శరణం గచ్ఛామి సంఘమ్ శరణం గచ్చామి

బుద్ధమ్ శరణం గచ్ఛామి సంఘమ్ శరణం గచ్చామి
గౌతమ్ శరణం గచ్చామి గమనమ్ శరణం గచ్చామి
దైవమ్ శరణం గచ్చామి దేహమ్ శరణం గచ్చామి
వేదమ్ శరణం గచ్చామి భావమ్ శరణం గచ్చామి
లోకమ్ శరణం గచ్చామి విశ్వమ్ శరణం గచ్చామి
రూపమ్ శరణం గచ్చామి జీవమ్ శరణం గచ్చామి
సత్యమ్ శరణం గచ్చామి నిత్యం శరణం గచ్చామి
నాదమ్ శరణం గచ్చామి నాట్యమ్ శరణం గచ్చామి
జ్ఞానమ్ శరణం గచ్చామి విజ్ఞానమ్ శరణం గచ్చామి
ఆత్మమ్ శరణం గచ్చామి అఖిలమ్ శరణం గచ్ఛామి
ధర్మమ్ శరణం గచ్చామి అభయమ్ శరణం గచ్చామి
సర్వమ్ శరణం గచ్చామి సమయమ్ శరణం గచ్చామి
పూర్ణమ్ శరణం గచ్చామి సంపూర్ణమ్ శరణం గచ్చామి