Friday, May 26, 2017

ఏకాంతత ఏకాగ్రతతో ఏకీభవించగా


ఏకాంతత ఏకాగ్రతతో ఏకీభవించగా
ప్రశాంతత పరధ్యాసతో పరిశోధించగా
మేధస్సు మనస్సుతో ముక్తించగా
ఆలోచనలు ఊహాలుగా విహారించునే

కలలతో కథగా సాగిపోనా ఊహలతో కల్పితమై చిత్రించనా

కలలతో కథగా సాగిపోనా ఊహలతో కల్పితమై చిత్రించనా
భావాలతో బంధానై సాగినా ఆలోచనలతో అనుబంధమై వెళ్ళనా

ఏనాటి కలలు కథలుగా ఏనాడు చెప్పుకున్నా
ఈనాటి ఊహలు చిత్రాలుగా చూసుకున్నాము   || కలలతో ||

కలలన్నీ గతానికే వెళ్ళగా ఊహలు భవిష్యవాణిగా వచ్చునేమో
కలలెన్నో జరగకపోయినా ఊహాలు స్వల్పమై సంభవించునేమో

ఆలోచనల అవధులు ఏవైనా కలలకు కథలకు ఊహలు ఏమైనా చిత్రించునే
భావాల స్వభావాలు ఏమైనా ఆలోచనల నడవడిలో కార్యాలు ఏవైనా జరుగునే   || కలలతో ||

కలలే కథలుగా ఊహలే చిత్రాలుగా విజ్ఞానమే ఎదుగుతున్నదా
ఉపాయమే కార్యాలుగా ఆలోచనలే పరిశోధనగా సాగుతున్నదా

కలైనా కథైనా పరమార్థాన్ని విజ్ఞానంతో పరిశోధించగా అనుభవమే తెలిసేనా
ఊహైనా చిత్రమైనా పరమార్థాన్ని జ్ఞానంతో పరిశీలించగా ఉపాయమే తోచేనా   || కలలతో ||
 

Thursday, May 25, 2017

ఆలోచన ఒక భావమై మేధస్సునే కదిలించేను

ఆలోచన ఒక భావమై మేధస్సునే కదిలించేను
భావమే ఒక కార్యమై మేధస్సునే నడిపించేను

మనలో ఎన్ని కార్య భావాల ఆలోచనలు సాగినా
మేధస్సులో అంతరంగ స్వత భావాలు దాగేను
 
విజ్ఞానము మేధస్సులో ఆలోచనగా లేకున్నను
భావనగా దేహములో అంతర్భావమే కొనసాగేను   || ఆలోచన ||

ఏనాడు నా శ్వాసపై స్వధ్యాస ఉంచకున్నను 
నా మేధస్సే హృదయ క్రియలను సాగించేను

ఏనాడు నా స్వభావాలపై సమయాలోచన చేయకున్నను
నా మేధస్సే ఆలోచనలతో ఎన్నో కార్యాలను జరిపించేను  || ఆలోచన ||

ఏనాడు నా అంతర్భావాలను గమనించకున్నను
నా మేధస్సే అంతర్లీనమై దేహాన్ని సమకూర్చేను

ఏనాడు నా దేహాన్ని స్వతహాగ ఓదార్చకున్నను
నా మేధస్సే నన్ను మహా గొప్పగా మైమరిపించేను  || ఆలోచన ||

Friday, May 5, 2017

శ్వాసలో ఉచ్చ్వాస నిచ్ఛ్వాస తత్వాలే ధ్యాసగా మేధస్సులో ఊపిరి భావాలతో ఉన్నాయా

శ్వాసలో ఉచ్చ్వాస నిచ్ఛ్వాస తత్వాలే ధ్యాసగా మేధస్సులో ఊపిరి భావాలతో ఉన్నాయా
మేధస్సులో ఆలోచనల భావ స్వభావాలే పరధ్యాసగా మహా వేదాల తత్వాలతో ఉన్నాయా  || శ్వాసలో ||

ప్రతి క్షణం ప్రతి సమయం జీవిత కాలమంతా జీవుల దేహాలలో జీవమై ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు శ్వాసతో ఉన్నాయా
ప్రతి ధ్యాస ప్రతి ప్రయాస జీవన ప్రమాణమంతా జీవుల రూపాలలో దైవమై పర భావ స్వభావ తత్వాలతో ఉన్నాయా  || శ్వాసలో ||

శ్వాసలో పరమాత్మమే పరిశోధనగా ఉచ్చ్వాస నిచ్ఛ్వాస భావాలు జంటగా తపిస్తున్నాయా
మేధస్సులో పరధ్యానమే పర్యవేక్షణగా ఆలోచనల వేద స్వభావ తత్వాలు జ్వలిస్తున్నాయా  || శ్వాసలో || 

ఓ పరమాత్మా ... ! నీవే నా ఆత్మా ... !

ఓ పరమాత్మా ... ! నీవే నా ఆత్మా ... !
ఓ పరంధామా ... ! నీవే నా ధామా ... !

జగతికి నీవే జీవమై విశ్వానికి నీవే శ్వాసవై
లోకానికి నీవే ధ్యాసవై సృష్టికి నీవే ప్రాణమై
ప్రతి జీవి దేహంలో మహా దైవమై నిలిచావు  || ఓ పరమాత్మా ||

ఎదిగే జీవులకు విజ్ఞానం నీవే కల్పించావు
ఒదిగే జనులకు ప్రజ్ఞానం నీవే అందిచావు

మనిషిగా మానవత్వం చాటే వారికి మహాత్మ భావాలే చూపావు
మహాత్మగా మహోన్నత తత్వం చూసే వారికి కరుణే ఇచ్చావు   || ఓ పరమాత్మా ||

మహర్షిగా మారే నీ రూపంలో దైవాన్నే కొలిచావు
దేవర్షిగా మారే నీ దేహంలో ధర్మాన్నే నిలిపావు

మనిషిలోనే మహాత్ముడు ఉన్నాడని మహా తత్వాన్ని నింపావు
మహాత్మలోనే పరమాత్ముడు ఉంటాడని మహా భావాన్ని చాటావు   || ఓ పరమాత్మా || 

Thursday, May 4, 2017

శ్వాసతో జీవమై హృదయంతో ఊపిరివై రూప దేహాన్ని మహా నిర్మాణంగా మార్చావా

శ్వాసతో జీవమై హృదయంతో ఊపిరివై రూప దేహాన్ని మహా నిర్మాణంగా మార్చావా
ఉచ్చ్వాస నిచ్చ్వాసతో చలనమై కాలంతో జీవ రూప దేహాన్ని మహా గొప్పగా చూపావా  || శ్వాసతో ||

విశ్వానికి విజ్ఞానముకై మేధస్సును మహా ఆలోచనలతో నింపుతూ వచ్చావా
జగతికి ప్రజ్ఞానముకై మనస్సును మహా బంధాలతో సాగిస్తూ పరిశోధించావా

కాలంతో సాగే కార్యాలకై అజ్ఞాన విజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నావా
సమయంతో సాగే కార్యాలకై వేద విజ్ఞానాన్ని పరీక్షిస్తున్నావా  || శ్వాసతో ||

ఆరోగ్యమే ఆయువుగా చేసి ఆహారాన్నే దేహానికి సామర్థ్యంగా అందిస్తున్నావా
బంధాలనే ఆనందంగా మార్చి సంతోషాలతో రూపాలను కొనసాగిస్తున్నావా

అనుభవంతో వేద విజ్ఞానాన్ని అన్వేషిస్తూ నూతన పరిశోధనతో మహా జ్ఞానాన్ని కల్పిస్తున్నావా
అనుబంధంతో అనురాగాలను పంచిస్తూ మహా కార్యాలతో అద్భుత రూపాలనే సృష్టిస్తున్నావా  || శ్వాసతో || 

శ్వాసతో జీవమై హృదయంతో ఊపిరివై రూప దేహాన్ని కాలంతో సాగిస్తున్నావా

శ్వాసతో జీవమై హృదయంతో ఊపిరివై రూప దేహాన్ని కాలంతో సాగిస్తున్నావా
ఉచ్చ్వాసతో ఉదయిస్తూ నిచ్చ్వాసతో అస్తమిస్తూ విశ్వ జగతిలా జీవిస్తున్నావా  || శ్వాసతో ||

ప్రతి జీవిలో శ్వాసగా జీవమై ఊపిరితో జీవిస్తున్నావా
ప్రతి జీవిలో ధ్యాసగా జీవమై భావంతో సాగుతున్నావా

భావాలతో సాగే దేహాలను వేద తత్వాలతో సాగిస్తున్నావా
బంధాలతో సాగే రూపాలను అనురాగాలతో నడిపిస్తున్నావా  || శ్వాసతో ||

ప్రతి జీవికి ప్రాణం శ్వాసేనని దేహానికి హృదయం అతికించావా
ప్రతి జీవికి ఆహారం ధ్యాసేనని రూపానికి ఉదరాన్ని చేర్పించావా

శ్వాసలోనే ఉన్నస్పర్శా భావాల దేహ చలనముకై మేధస్సును చేర్చావా  
ఊపిరిలోనే ఉన్న భావ స్వభావాల తత్వాలకై ఆలోచనలనే కల్పించావా  || శ్వాసతో || 

ఏనాటిదో నీ రూపం ఏనాటిదో నీ దేహం

ఏనాటిదో నీ రూపం ఏనాటిదో నీ దేహం
ఏనాటికి చెదరని బెదరని భావ స్వభావం

ఎక్కడి నుండి వచ్చావో ఎక్కడి దాక ఉంటావో
ఎవరికి తెలియని మహానుభావుడివై ఉన్నావో   || ఏనాటిదో ||

పరమాత్మ నీలోనే పరిశుద్ధం నీలోనే
పరిశోధన నీలోనే ప్రజ్ఞానం నీలోనే

విజ్ఞానం నీతోనే వైభోగం నీతోనే
వేదాంతం నీతోనే విశ్వాసం నీతోనే

ప్రతి జీవికి నీవే పరబ్రంహవై ప్రత్యక్షమైనావు   || ఏనాటిదో ||

ప్రకృతిలో ఉన్నావో పరిశోధనలో ఉన్నావో
పరవశమై ఉన్నావో ప్రభాతములో ఉన్నావో

ఎక్కడైనా నీ ధ్యాసే ఎక్కడున్నా నీ శ్వాసే
ఎక్కడైనా నీ ప్రయాసే ఎక్కడున్నా నీ ఉచ్చ్వాసే

ప్రతి జీవిలో నీవే విశ్వ జగమై లీనమైనావు   || ఏనాటిదో ||

బహుజన రూపం బహుజన భావం

బహుజన రూపం బహుజన భావం
బహుజన సైన్యం బహుజన తత్వం
బహుజన గమనం బహుజన వచనం
భళారే భళా బహువీర సంగ్రామ దళం  || బహుజన ||

బహుజన జీవం బహుజన ప్రాణం
బహుజన దేహం బహుజన కార్యం
బహుజన లోకం బహుజన విశ్వం
భళారే భళా బహుధీర రణ రంగం  || బహుజన ||

బహుజన బంధం బహుజన సంఘం
బహుజన నేత్రం బహుజన దర్పణం
బహుజన చిత్రం బహుజన ప్రదేశం
భళారే భళా బహుకర భోగమే భాగ్యం  || బహుజన ||

బహుజన స్నేహం బహుజన స్థైర్యం
బహుజన రాజ్యం బహుజన శిఖరం
బహుజన శాంతం బహుజన కుశలం
భళారే భళా బహుపరా మనదే విజయం  || బహుజన || 

చరిత్రకే తెలియని జీవితాలు ఎన్నో మనలోనే ఉండిపోయెనే

చరిత్రకే తెలియని జీవితాలు ఎన్నో మనలోనే ఉండిపోయెనే
జగతికే తెలియని ఊహలు ఎన్నో మేధస్సులలోనే ఆగిపోయెనే

ఎవరికి తెలియని జీవ భావాలు ఆలోచనలలోనే నిలిచిపోయెనే
ఎవరికి తెలియని దేహ తత్వాలు మనస్సులలోనే ఉండిపోయెనే  || చరిత్రకే ||

ఎవరి జీవితం వారికే తెలియునని
ఎవరి సుఖ దుఃఖాలు వారికే చెందునని
ఎవరి మనస్సులో వారే ఒదిగిపోయేనని
ఎవరి మేధస్సులో వారే ఉండిపోయేనని
చరిత్రగా ఎవరికి వారే నిలిచిపోయేనని
గతంలో జరిగిన మహా కథనాలే చరిత్రగా మారేనని
భవిష్య కాల చరిత్రాలే మహా పరిశోధన ప్రజ్ఞానమని  || చరిత్రకే ||

చరిత్రలో ఎన్నో కథనాలు జరిగిపోయేనని
కథలు కథలుగా కలలెన్నో కలిసిపోయేనని
జీవుల స్వభావ తత్వాలు ఎన్నెన్నో చెప్పేనని
కాలమే పురాణాలుగా సాగుతూ మనతో వచ్చేనని
ఎన్నో గొప్ప ఆలోచనలు మహా కార్యాలుగా సాగేనని
మన చరిత్ర నిర్మాణాలు సంపుటాలుగా భోదించేనని  
అనుభవాలకే చరిత్ర పరిశోధనలు విజ్ఞానమయ్యేనని  || చరిత్రకే ||

Wednesday, May 3, 2017

ఏది నీ దేశం ఏది మన దేశం

ఏది నీ దేశం ఏది మన దేశం
ఏది మన భావం ఏది మన తత్వం
మనలోనే విశ్వ గీతం మనలోనే జగతి పతాకం
మనమే చైతన్యం మనమే ఐక్యత చిహ్నం ఓ మానవా!  || ఏది నీ దేశం ||

మనిషిగా జీవించు మనస్సుతో జగతినే నడిపించు
మహర్షిగా దీవించు మనస్సుతో విశ్వాన్నే సాగించు

మనలోనే మాధవుడు మనలోనే మహాత్ముడు ఉదయిస్తున్నాడు
మనలోనే పరమాత్మ మనలోనే పరంధామ ఎదుగుతున్నాడు ఓ మానవా!  || ఏది నీ దేశం ||

దేశ దేశాలు తిరిగినా ప్రపంచమంతా విజ్ఞాన అన్వేషణయే
ఎన్ని రోజులు గడిచినా విశ్వమంతా విజ్ఞాన పరిశోధనయే

మనిషిలోనే సద్భావం మనలోనే మానవత్వం
మనిషిలోనే విజ్ఞానం మనలోనే పరిశుద్ధాత్మం ఓ మానవా!  || ఏది నీ దేశం ||