Showing posts with label భాష. Show all posts
Showing posts with label భాష. Show all posts

Friday, December 23, 2016

కవిగా ఉన్నా కలగా లేను

కవిగా ఉన్నా కలగా లేను
కవితగా ఉన్నా ఊహాగా లేను
కవి కవితగా ఉన్నా నేనే లేనే లేను   || కవిగా ఉన్నా ||

కవి భాషలో కవితలు ఎన్నో
కవి కవితలో భావాలు ఎన్నో
కవి కలగన్న ఊహల కవితలు ఎన్నెన్నో
కవి ఊహించే కలల కవితలు ఎన్నో మరెన్నో  || కవిగా ఉన్నా ||

కవి భాషల కవితలు విజ్ఞానమే
కవి కవితల భాష పరిశోధనమే
కవి కవితల ఊహలు ప్రజ్ఞానమే
కవి కవితల కలలు మహా జ్ఞానమే   || కవిగా ఉన్నా || 

Friday, November 11, 2016

ప్రేమించాను నిన్నే ప్రేమిస్తాను నిన్నే ప్రతి క్షణం

ప్రేమించాను నిన్నే ప్రేమిస్తాను నిన్నే ప్రతి క్షణం
నీవు నన్ను ప్రేమించేదాక నీతోనే ఉంటానులే ప్రతి సమయం
నా ప్రేమ నీకు తెలిసేదాక నీకు తోడుగా నీడై వస్తానులే ప్రతి తరం  || ప్రేమించాను ||

ప్రేమతో పిలిచేదాక నా కోసం పలికేదాక నీతోనే వేచి ఉన్నానులే
ప్రేమతో చూసే దాక ప్రేమతో పలకరించేదాక నీతోనే ఉంటానులే

ప్రేమలో ధ్యాస నీకై శ్వాస మరవని ఆగని క్షణాల అలల తీరమే
ప్రేమలో భాష నీకై ప్రయాస మౌనమై తీరని మోహన భావ తత్వమే  || ప్రేమించాను ||

ప్రేమించే తత్వమే నాలో యోగమై నీలో మహా జీవమైనదే
ప్రేమించే భావమే నాలో ధ్యానమై నీలో అభియోగమైనదే

ప్రేమనే తలచాను నీలోని శ్వాసతో మరో జన్మనే తపించాను
ప్రేమనే తిలకించాను నీలోని ధ్యాసతో మరో కోరికనే జయించాను  || ప్రేమించాను || 

Tuesday, October 4, 2016

ఒక శ్వాసగా ఒక ధ్యాసగా సాగేనే నా మనస్సు

ఒక శ్వాసగా ఒక ధ్యాసగా సాగేనే నా మనస్సు
ఒకే భాషగా ఒకే యాసగా సాగేనే నా వయస్సు
నాలోని హృదయమే నీలో ఒకటై జీవిస్తున్నదే
నేను నేనుగా లేక నీలోనే నీతో ఉండిపోయానే  || ఒక శ్వాసగా ||

ప్రేమించే భాషకు అర్థం ఒకటేనని తెలిపినదే నా మనస్సు
ప్రేమించే ధ్యాసకు లోకం ఒకటేనని తెలిపిందే నా వయస్సు

ప్రేమతో సాగే నా శ్వాస నీతోనే ధ్యాసగా సాగుతున్నదే
ప్రేమతో సాగే నా మనస్సు నీతోనే మౌనమై పోయినదే  || ఒక శ్వాసగా ||

ప్రతి శ్వాసలో నీ ధ్యాసే నన్ను జీవింపజేస్తున్నది
ప్రతి ధ్యాసలో నీ శ్వాసే నన్ను పలికించేస్తున్నది

ప్రతి క్షణం ఒక ధ్యాస ఒక శ్వాస అదే నా ప్రియమైన భాష
ప్రతి నిమిషం ఒక ధ్యాస ఒక శ్వాస అదే నా ప్రియతమ ఘోష  || ఒక శ్వాసగా || 

Tuesday, July 26, 2016

కవి మాటలలో ప్రతి పదానికి అనంతమైన అర్థం పరమార్థమై ఉంటుంది

కవి మాటలలో ప్రతి పదానికి అనంతమైన అర్థం పరమార్థమై ఉంటుంది
కవి భాషలో ప్రతి వాక్యం శ్లోకమై గ్రంథంలో పరిశోధనమై నిలిచి పోతుంది  || కవి మాటలలో ||

కవి హృదయంలో జగమంతా నిండి విశ్వ విజ్ఞానమే అన్వేషిస్తుంది
కవి మేధస్సులో అంతరిక్షమే పండి పాండిత్యమై పరవశిస్తుంది

కవి గానంలో గమకం రాగ గాత్రమై వేదాంతం పలుకుతుంది
కవి గీతంలో సంగీతం స్వర గానమై మాధుర్యం పండుతుంది

కవి జీవించే విధానంలోనే మహాత్మ తత్వాలు నిలయమై పోతాయి
కవి కొనసాగే మార్గంలోనే మహర్షి ఋషతత్వాలు ఆధారమవుతాయి  || కవి మాటలలో ||

కవి తెలిపిన హితమే జగతిలో సత్యమై నిలుస్తుంది
కవి చూపించిన విజ్ఞానమే విశ్వంలో కాలమై వరిస్తుంది

కవి భావాలు ఆలోచలనలలో మిళితమై దివ్య స్వభావాలుగా జీవిస్తాయి
కవి తత్వాలు మేధస్సులలో పరిమళమై మహా వేదాలుగా సాగుతాయి

కవి కవితలోని జ్ఞానం సుజ్ఞానమై గుణ సద్గుణాలుగా విశేషింపబడుతాయి
కవి కవితలోని వేదం వేదాంతమై భావ స్వభావాలుగా విస్తరింపబడుతాయి  || కవి మాటలలో ||