Showing posts with label సోపానాలు. Show all posts
Showing posts with label సోపానాలు. Show all posts

Tuesday, August 9, 2016

మరచిపోయే భావాలతో జ్ఞాపకాలు శూన్యమాయే

మరచిపోయే భావాలతో జ్ఞాపకాలు శూన్యమాయే
విడిచిపోయే బంధాలతో గుర్తులన్నీ చెదిరిపోయే || మరచిపోయే ||

విజ్ఞానంతో  సాగని ఆలోచనల తీరులో మతి మరుపు చేరిపోయేనే
బంధాలతో సాగని ఎన్నో పరిచయాలు స్నేహాన్ని వదిలిపోయేనే

మరుపు వదలని జ్ఞానం మనిషినే మార్చే అజ్ఞాన వేద సిద్ధాంతాలు
స్నేహానికి దూరమైపోయే జీవితాలు ఒంటరిగా సాగే జీవన విధానాలు  || మరచిపోయే ||

సహాయం లేని హృదయ జీవితం ప్రోత్సాహం లేని జీవనం
ఎదుగుదల లేని విజ్ఞానం ఎవరికి తెలియని మరో ప్రజ్ఞానం

కాలంతో నేర్చుకుంటూ నెమరువేసుకునే ఆలోచనలే విజ్ఞాన జ్ఞాపకాలు
అనుభవంతో తెలుసుకుంటూ పరిశోధిస్తే విజ్ఞానమే మరవలేని సోపానాలు  || మరచిపోయే ||