Showing posts with label జ్ఞాపకం. Show all posts
Showing posts with label జ్ఞాపకం. Show all posts

Thursday, December 22, 2016

మరణం లేదనుకో అసాధ్యం లేదనుకో

మరణం లేదనుకో అసాధ్యం లేదనుకో
సాధనతో సాధించే ప్రయత్నం చేసుకో

తెలిసినదే జ్ఞాపకం చేసుకో తెలియనిదే గమనంతో తెలుసుకో
తెలియకపోతే తెలిసిన వారితో చర్చిస్తూ ఓపికతో ఎంతో నేర్చుకో  || మరణం ||

నీ మేధస్సులో ఎంతో విజ్ఞాన ప్రదేశం ఖాళీగా ఉందని తెలుసుకో
నీ మేధస్సులో ఎంతో ఆలోచనల ప్రవాహం సాగునని తెలుపుకో

నీ  మేధస్సులో ఉన్న అపారమైన విజ్ఞానాన్ని జ్ఞాపకంగా దాచుకో
నీ మేధస్సులో దాగిన విజ్ఞానాన్ని ఉత్తేజమైన మేధాశక్తిగా చేసుకో

నీ మేధస్సులో అన్వేషణ మొదలైతే విశ్వ భావ జీవ రహస్యాలెన్నో చేర్చుకో
నీ మేధస్సులో వేదాంతం ప్రారంభమైతే లోక జ్ఞాన వేదత్వాలెన్నో లెక్కించుకో  || మరణం ||

నీలో జీవించే ప్రాణ శక్తిని స్వధ్యానంతో దీర్ఘాయుస్సుగా మార్చుకో
నీలో ధ్వనించే జీవ శక్తిని స్వర నాదంతో దీర్ఘ కాలంగా సాగించుకో

నీవే మహా వేదమై మహాత్మగా ఎదుగుతూ పరలోకాన్ని అర్థం చేసుకో
నీవే మహా తత్వమై మహర్షిగా ఒదుగుతూ పరమార్థాన్ని గ్రహించుకో

నీవే అణువై ఓ పరమాణువుగా పరిశోధించి సూక్ష్మ జ్ఞానాన్ని పెనవేసుకో
నీవే పరమాణువై మహా అణువుగా పర్యవేక్షించి విజ్ఞానాన్ని పెకలించుకో  || మరణం || 

Friday, December 16, 2016

మేధస్సులోనే ఉన్నావు ఆలోచనలలోనే ఉంటావు

మేధస్సులోనే ఉన్నావు ఆలోచనలలోనే ఉంటావు
భావాలనే తెలుపుతున్నావు తత్వాలనే అందిస్తున్నావు
స్వభావాలతో జ్ఞాపకం వస్తూనే స్పందన కలిగిస్తున్నావు   || మేధస్సులోనే ||

జీవించే ప్రతి సమయం ప్రతి ప్రక్రియ భావనతోనే సాగుతున్నది
ఎదిగే ప్రతి జీవన విజ్ఞానం కాలంతో సాగే అనుభవమై వస్తున్నది

నీవు లేని మేధస్సు విజ్ఞానానికే అర్థం లేని విధంగా సాగేను జీవితం
నీవు లేని జీవనం కాలం విలువ తెలియని విధంగా సాగే ప్రయాణం  || మేధస్సులోనే ||

అవసరమై ఉంటావు గుర్తుండి పోతావు తెలిసినది తెలియకనే మాయ చేస్తావు
ఇక్కడే ఉంటావు అర్థాన్నే కలిగిస్తావు జ్ఞాపకాలతో సాగుతూ మరుపే కలిగిస్తావు

నీ కోసం నిరీక్షణ నీతోనే అన్వేషణ నీవెంటే పర్యవేక్షణ నీవు లేక పరిశోధన
నీ కోసం ఆవేదన నీతోనే ఉద్వేగం నీవెంటే సందిగ్ధం నీవు లేక మనోవేదన

నీవు ఎవరో తెలియాలి నీవే 'ఎరుక' అని గుర్తించాలి
నీవే మేధస్సుకు విజ్ఞానమని ప్రతి జీవి గమనించాలి  || మేధస్సులోనే ||

Friday, August 12, 2016

ఏనాటిదో ఆలోచన ఎప్పటిదో ఆ భావన

ఏనాటిదో ఆలోచన ఎప్పటిదో ఆ భావన
ఎక్కడికో వెళ్ళే తరుణం ఎందుకో వచ్చే తపనం
ఎవరికో ఇచ్చే సంభావనం ఎందరికో నా వందనం  || ఏనాటిదో ||

మేధస్సులోనే ఎన్నాళ్ళుగా ఉండిపోయేనే ఆనాటి మధురాలోచన
మనస్సులోనే ఎన్నో ఏళ్ళుగా నిలబడిపోయేనే ఓనాటి విశ్వాలోచన

విశ్వమే కలిగించే భావన నాలో నిలిచేను ఓ ఆలోచనగా
జగమే దాచేను ఆ భావన నా మేధస్సులో ఒక జ్ఞాపకంగా

నాలోనే ఉండిపోయే ఆలోచన భావానికే తెలియని విశ్వ వేదనం
నాలోనే ఒదిగిపోయే ఆ భావన ఆలోచనకే తెలిసిన కాల గమనం   || ఏనాటిదో ||

భావాలతో జీవించే కాలం ఆలోచనలకే తెలియని సమయం
ఆలోచనలతో వెళ్ళే సమయం భావాలకే అందని తరుణం

క్షణమే నిలిచేనా నా భావనకై నాలో దాగే ఎన్నో ఏళ్ళుగా ఆలోచనకై
ఒక క్షణమే కలిగేనా నా కోసమై నాలోనే ఎన్నాళ్ళుగా నిలిచేందుకై    

నేనే తెలుపుకుంటాను వందనం అది అందరికి అందే సంభావనం
నేనే తెలుసుకుంటాను ఓ క్షణం అది ఎవరని తలిచే మహా తరుణం  || ఏనాటిదో || 

Tuesday, August 9, 2016

నిజమే లేని హృదయం కరిగిపోయే జీవం

నిజమే లేని హృదయం కరిగిపోయే జీవం
సత్యమే లేని తరుణం మరచిపోయే యోగం  || నిజమే ||

శ్వాసే లేని జీవం మరణించిన రూపం
ధ్యాసే లేని ఆకారం ఆగిపోయిన మౌనం

మనస్సే లేని మర్మం మతిలేని జ్ఞాపకం
వయస్సే తెలియని సమయం ఓ లోపం

ధ్యేయం లేని కర్తవ్యం సాహసం లేని అంతం
ధర్మం లేని సత్యం హంసత్వం లేని హితం   || నిజమే ||

విషాదంతో సాగే బంధం విలవిలలాడే తపనం
ఔషధంతో సాగే రోగం కలుషితమైన దేహ కర్మం

బంధాలతో సాగే జీవితం ఎటు వెళ్లినా పరవశం
వేదాలతో సాగే జీవనం ఎటు మారినా వేదాంతం

కాలంతో సాగే సమయం క్షణాలకు చరితం
భావంతో సాగే కార్యం అభివృద్ధికి పరిచయం  || నిజమే || 

Thursday, July 21, 2016

ప్రతిరోజు నేర్పుతో నేర్చుకో విజ్ఞానమే తెలుసుకో

ప్రతిరోజు నేర్పుతో నేర్చుకో విజ్ఞానమే తెలుసుకో
ప్రతిరోజు ఓర్పుతో చూసుకో అనుభవమే తెలుపుకో   || ప్రతిరోజు ||

ప్రతి క్షణం ఒక ఆలోచన గమనమే
ప్రతి నిమిషం ఒక విజ్ఞాన భరితమే
ప్రతి గడియ ఒక అనుభవ చరితమే
ప్రతి సమయం ఒక వేదాంత వచనమే  

కాలమే కలిగించేను సమస్యలను ఎన్నో విధాల ఎన్నో వైపులా
అనుభవమే సాగించును పరిస్కార మార్గాలను నలు దిక్కులా   || ప్రతిరోజు ||

ప్రతి క్షణం ఆలోచించుటలోనే ముఖ్యాంశం
ప్రతి నిమిషం స్మరించుటలోనే మహా జ్ఞాపకం
ప్రతి గడియ అన్వేషించుటలోనే వేదాంతం
ప్రతి సమయం చదువుటలోనే పరమార్థం

కాలంతో సాగే విజ్ఞానంతోనే మనలో సమస్యలు పరిష్కారమవుతుంటాయి
సమయంతో సమన్వయ సమయోచితమైతే పరిష్కారాలు సకాలమవుతాయి  || ప్రతిరోజు || 

Wednesday, July 20, 2016

అమ్మా అని పిలిచే పలుకులలోనే ఒక తియ్యని రాగం

అమ్మా అని పిలిచే పలుకులలోనే ఒక తియ్యని రాగం
తల్లీ అని పలికే మాటల పదాలలోనే ఒక తేనీయ స్వరం  || అమ్మా ||

అమ్మా అని పిలిచినా హృదయములో ఒక జీవన నాదం
అమ్మా అని పలికినా మనస్సులో ఒక మమకారపు గీతం

అమ్మగా లాలించే అలనాటి పాటలలో ఒక కమ్మని సంగీతం
అమ్మగా నడిపించే ఆనాటి నడకలలో ఒక నూతన కుసుమం  || అమ్మా ||

అమ్మగా ఎదిగినా అమ్మమ్మగా చూసే ప్రేమలో అనురాగం
అమ్మగా ఒదిగినా అమ్మమ్మతో కలిసే తీరులో అనుబంధం

అమ్మవై అమృతాన్ని పంచే అలనాటి జ్ఞాపకం తెలియని దైవం
అమ్మవై విజ్ఞానాన్ని పంచే ఆనాటి విద్యా గీతమే వేదాంత సత్యం  || అమ్మా ||  

Tuesday, June 14, 2016

మళ్ళీ మళ్ళీ వచ్చే మధురమైన క్షణమే

మళ్ళీ మళ్ళీ వచ్చే మధురమైన క్షణమే
మళ్ళీ మళ్ళీ వచ్చే మనోహరమైన క్షణమే
మళ్ళీ మళ్ళీ తలిచే మకరందమైన క్షణమే || మళ్ళీ మళ్ళీ ||

మళ్ళీ మళ్ళీ వస్తుందని మధురమైన జ్ఞాపకం
మళ్ళీ మళ్ళీ వస్తుందని మనోహరమైన భావం
మళ్ళీ మళ్ళీ వీస్తుందని మకరందమైన సుగంధం

మళ్ళీ మళ్ళీ ఏదో జరగాలని సంతోషమైన జీవం
మళ్ళీ మళ్ళీ ఏదో కలగాలని ఆనందమైన హృదయం
మళ్ళీ మళ్ళీ ఏదో జరిగేనని ఉత్సాహమైన ప్రాణం         || మళ్ళీ మళ్ళీ ||

మళ్ళీ మళ్ళీ ఎవరో వస్తారని మనలోనే స్నేహం
మళ్ళీ మళ్ళీ ఎవరో కలుస్తారని మనలోనే బంధం
మళ్ళీ మళ్ళీ ఎవరో పిలుస్తారని మనలోనే అనుబంధం

మళ్ళీ మళ్ళీ జరిగే మహోత్సవమైన కార్యం
మళ్ళీ మళ్ళీ కలిగే స్వర్ణోత్సవమైన కల్యాణం
మళ్ళీ మళ్ళీ తలిచే బ్రంహోత్సవమైన ఉత్సవం   || మళ్ళీ మళ్ళీ ||