Friday, December 16, 2016

మేధస్సులోనే ఉన్నావు ఆలోచనలలోనే ఉంటావు

మేధస్సులోనే ఉన్నావు ఆలోచనలలోనే ఉంటావు
భావాలనే తెలుపుతున్నావు తత్వాలనే అందిస్తున్నావు
స్వభావాలతో జ్ఞాపకం వస్తూనే స్పందన కలిగిస్తున్నావు   || మేధస్సులోనే ||

జీవించే ప్రతి సమయం ప్రతి ప్రక్రియ భావనతోనే సాగుతున్నది
ఎదిగే ప్రతి జీవన విజ్ఞానం కాలంతో సాగే అనుభవమై వస్తున్నది

నీవు లేని మేధస్సు విజ్ఞానానికే అర్థం లేని విధంగా సాగేను జీవితం
నీవు లేని జీవనం కాలం విలువ తెలియని విధంగా సాగే ప్రయాణం  || మేధస్సులోనే ||

అవసరమై ఉంటావు గుర్తుండి పోతావు తెలిసినది తెలియకనే మాయ చేస్తావు
ఇక్కడే ఉంటావు అర్థాన్నే కలిగిస్తావు జ్ఞాపకాలతో సాగుతూ మరుపే కలిగిస్తావు

నీ కోసం నిరీక్షణ నీతోనే అన్వేషణ నీవెంటే పర్యవేక్షణ నీవు లేక పరిశోధన
నీ కోసం ఆవేదన నీతోనే ఉద్వేగం నీవెంటే సందిగ్ధం నీవు లేక మనోవేదన

నీవు ఎవరో తెలియాలి నీవే 'ఎరుక' అని గుర్తించాలి
నీవే మేధస్సుకు విజ్ఞానమని ప్రతి జీవి గమనించాలి  || మేధస్సులోనే ||

No comments:

Post a Comment