Tuesday, December 27, 2016

ఒక శ్వాస ఒక ధ్యాస ఒకటే జీవం ఒకటే దేహం

ఒక శ్వాస ఒక ధ్యాస ఒకటే జీవం ఒకటే దేహం
ఒకటిగా జీవించే ప్రాణమే ఉచ్చ్వాస నిచ్చ్వాస
ఒకటైన ఊపిరి ప్రవాహం హృదయానికే గమ్యం  || ఒక శ్వాస ||

ప్రతి క్షణం శ్వాసించే ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ప్రయాణం
నాభి నుండి నాసికమై హృదయాన్ని ధ్వనింపజేస్తూనే
మేధస్సును భావాల ఆలోచనల చలనంతో సాగిస్తున్నది  

ప్రతి క్షణం శ్వాసతో ఆలోచనల కార్యాలను సాగిస్తూ
కార్యాలపైననే శ్రద్ధ ధ్యాస వహిస్తూ తనకు తానుగా
దేహంలో ఒకటై పరధ్యానంతో జీవిస్తూ సాగుతుంది   || ఒక శ్వాస ||

ఒక శ్వాసతో ఒక ధ్యాసనై పరధ్యాసతో పరమాత్మనై
ఒక జీవంతో ఒక దేహాన్నై పరదేహంతో పరంధామనై
ఒకటిగా ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో పర శ్వాస పరంజ్యోతినై
ఒకటిగా జీవించే హృదయంతో ఊపిరిలా పరిశోధనమైపోయా

ఒకటిగా జన్మించే జీవం దేహంతో ఒక రూపమై
ఒక మేధస్సుతోనే మహా విశ్వాంతర విజ్ఞానమై
ఒక శ్వాసగా దేహంలోనే ఒదిగిపోతూ జీవిస్తున్నది  || ఒక శ్వాస || 

No comments:

Post a Comment