Monday, December 5, 2016

కవి రాజుకే అందని తోచని భావానివో

కవి రాజుకే అందని తోచని భావానివో
కవి ధాతకే కలగని తెలియని వేదానివో
కవి వర్మకే వినిపించని కనిపించని తత్వానివో   || కవి రాజుకే ||

ఏ కవికి తెలియని భావాల మధుర పుష్పాల కవితలే నా మేధస్సులో మాధుర్యమూ
ఏ కవికి కలగని వేదాల మధుర మాణిక్యములే నా ఆలోచనలలో మహా మనోహరమూ
ఏ కవికి వినిపించని మందార మకరందాలే నా మనస్సులో మహా మహా మోహనమూ
ఏ కవికి కనిపించని సుందర సుగంధాల సువర్ణములే నా దేహములో మహా తేజమూ
ఏ కవికి స్పర్శించని రూపాల ఆకార స్వరూపములే నా యదలో మహా స్వప్నమూ     || కవి రాజుకే ||

ఏ కవి శర్మకు తోచని నవ భావాల సోయగాల వంపులే నాలోని పద్మముల పదజాలమూ
ఏ కవి చంద్రకు అందని వేదాల నవ కాంతుల వయ్యారములే నాలోని రాగాల పదకీర్తనమూ
ఏ కవి తేజకు ఎదురవ్వని తత్వాల సుగంధ సువర్ణములే నాలోని పుష్పాల పదభూషణమూ
ఏ కవి నేత్రకు స్పర్శించని స్వభావాల సుందర సుమధురాలే నాలోని పూల పదపాండిత్యమూ
ఏ కవి గాత్రకు అనిపించని ఆనంద సంతోష గానములే నాలోని గీతముల పదసంభాషణమూ
ఏ కవి జంటకు అన్వేషించని రూప స్వరూపముల ఆకారాలే నాలోని గానాల పదస్వరూపమూ  || కవి రాజుకే ||

No comments:

Post a Comment