Thursday, December 22, 2016

మరణం లేదనుకో అసాధ్యం లేదనుకో

మరణం లేదనుకో అసాధ్యం లేదనుకో
సాధనతో సాధించే ప్రయత్నం చేసుకో

తెలిసినదే జ్ఞాపకం చేసుకో తెలియనిదే గమనంతో తెలుసుకో
తెలియకపోతే తెలిసిన వారితో చర్చిస్తూ ఓపికతో ఎంతో నేర్చుకో  || మరణం ||

నీ మేధస్సులో ఎంతో విజ్ఞాన ప్రదేశం ఖాళీగా ఉందని తెలుసుకో
నీ మేధస్సులో ఎంతో ఆలోచనల ప్రవాహం సాగునని తెలుపుకో

నీ  మేధస్సులో ఉన్న అపారమైన విజ్ఞానాన్ని జ్ఞాపకంగా దాచుకో
నీ మేధస్సులో దాగిన విజ్ఞానాన్ని ఉత్తేజమైన మేధాశక్తిగా చేసుకో

నీ మేధస్సులో అన్వేషణ మొదలైతే విశ్వ భావ జీవ రహస్యాలెన్నో చేర్చుకో
నీ మేధస్సులో వేదాంతం ప్రారంభమైతే లోక జ్ఞాన వేదత్వాలెన్నో లెక్కించుకో  || మరణం ||

నీలో జీవించే ప్రాణ శక్తిని స్వధ్యానంతో దీర్ఘాయుస్సుగా మార్చుకో
నీలో ధ్వనించే జీవ శక్తిని స్వర నాదంతో దీర్ఘ కాలంగా సాగించుకో

నీవే మహా వేదమై మహాత్మగా ఎదుగుతూ పరలోకాన్ని అర్థం చేసుకో
నీవే మహా తత్వమై మహర్షిగా ఒదుగుతూ పరమార్థాన్ని గ్రహించుకో

నీవే అణువై ఓ పరమాణువుగా పరిశోధించి సూక్ష్మ జ్ఞానాన్ని పెనవేసుకో
నీవే పరమాణువై మహా అణువుగా పర్యవేక్షించి విజ్ఞానాన్ని పెకలించుకో  || మరణం || 

No comments:

Post a Comment