Thursday, December 22, 2016

ఇది జరిగిన కథగా జ్ఞాపకాలతో తెలుపనా

ఇది జరిగిన కథగా జ్ఞాపకాలతో తెలుపనా
ఇది జరిగే కథగా ఊహాలతో తెలుపుకోనా   || ఇది జరిగిన ||

జరిగినది సత్యమై జ్ఞాపకాలతో మళ్ళీ గుర్తు తెచ్చేనా
జరగబోయేది జరుగునని ఊహాలు మనలో కలిగేనా

కథలుగా సాగే మనలో నిజమైనవి కథలు కాదని జీవితమని తెలిసేనా
కథలుగా తోచే మనలో అసత్యమైన ఊహాల కథలని మనతోనే సాగేనా

నిజాలను కథలుగా అల్లుటలో సత్యం కాస్త కల్పితమై తరిగిపోవునా
కథలను నిజాలుగా సాగించుటలో సాధన కాస్త కాలంతో మారిపోవునా  || ఇది జరిగిన ||

మానవుడే చరిత్ర భావాలను కథలుగా విజ్ఞానాన్ని ఇతరులకు పంచేనా
మానవుడే గ్రంధాల తత్వాలను కథలుగా వేదాన్ని ఎందరికో భోధించేనా

కథల విజ్ఞానంలో దాగిన శాస్త్రీయమైన వివిధ పద్ధతులు పూర్వ జీవన విధానాన్ని తెలిపేనా
కథల అనుభవాలను నాటకాలతో వివిధ ప్రచారణలతో తరతరాల యుగాలకు అందించేనా

కథలే చిన్నారులకు ఎన్నో గుణ పాఠాలుగా పాఠశాలలో తరగతులుగా చెప్పుకుంటూ వచ్చేనా
కథలే భక్తులకు గుణ తత్వాలుగా మఠములలో భోదిస్తూ ఎన్నో మహా అధ్యాయాలను సాగించేనా  || ఇది జరిగిన || 

No comments:

Post a Comment