Wednesday, December 28, 2016

కథలు నావే కలలు నావే కవితలు నావే ఊహలు నావే

కథలు నావే కలలు నావే కవితలు నావే ఊహలు నావే
రచయితగా వ్రాసే కథల కలలు నాలోన ఉన్న భావాలే
కవిగా వ్రాసే కవితల ఊహలు నాలోన ఉన్న తత్వాలే    || కథలు నావే ||

రచయితల ఆలోచనలు వాక్యముల సముదాయ భాగాలుగా వ్రాయబడెను
ఎన్నో విభాగాలుగా వాక్యముల సముదాయ విషయాలను లేఖరి తెలిపేను

కవి ఆలోచనలు కవిత్వమై పద్య కావ్యములుగా కీర్తనలు లిఖించబడెను
ఎన్నో వాక్య పద్యములు కలిసి మహా గ్రంథాల సారాంశాన్ని తెలుపబడెను

జరిగిన ఎన్నో విషయాలను చరిత్రగా లిఖించబడెను
జరగబోయే మరెన్నో కలలను కథలుగా వ్రాయబడెను   || కథలు నావే ||

భవిష్య ప్రజ్ఞానాన్ని కవితల కీర్తనలుగా ఎందరో తెలిపేను
తెలిసిన పాత విజ్ఞానాన్ని కవితల కావ్యాలుగా తెలుపబడెను

పద్య భావాలనే ప్రతి పదార్థాలుగా ఎందరో గురువులు భోదించేను
పద్యాల పదాలనే నానార్థాలుగా ఎందరో మహా అర్థాన్ని తెలిపేను

కథలనే చిత్రాలుగా మార్చి విషయాలను క్లుప్తంగా వివరించబడెను
చిత్రాలనే కథలుగా మలచి ఎన్నో అర్థాలను మనకు తెలుపబడెను

ఏనాటి కాలం నుండైనా ఎప్పటి వరకైనా బోధనలు కథలుగా మారుస్తూ సాగేను
ఏనాటి ప్రయాణమైనా ఎప్పటి వరకైనా కవితలు పాఠాలుగా చెప్పుతూ వచ్చేను  || కథలు నావే || 

No comments:

Post a Comment