Showing posts with label అనారోగ్యం. Show all posts
Showing posts with label అనారోగ్యం. Show all posts

Monday, June 5, 2017

ఆరోగ్యంతో జీవితం బహు దూర కాల ప్రయాణం

ఆరోగ్యంతో జీవితం బహు దూర కాల ప్రయాణం
అనారోగ్యంతో జీవనం బహు స్వల్ప కాల గమనం
ధీర్ఘాయుస్సుతో జీవిస్తే జీవం మహా కాలంతో తరుణం
ధీర్ఘారోగ్యముతో జీవిస్తే దేహం మహా కాలంతో కరుణం   

Thursday, October 6, 2016

అనారోగ్యం కలగక ముందే ఆరోగ్యంతో జాగ్రత్త వహించు

అనారోగ్యం కలగక ముందే ఆరోగ్యంతో జాగ్రత్త వహించు
కాలం వృధా కాకముందే సమయాన్ని సద్వినియోగించు
ధనం అత్యధిక ఖర్చులతో సాగక ముందే సంపాదించు
విశ్వమందు నీవు ఎచట ఎలా ఉన్నా నేను నీ మేధస్సులోనే మిత్రమా! 

Wednesday, October 5, 2016

ఆహారం వృధా ఐతే అనారోగ్యం కలుగునా

ఆహారం వృధా ఐతే అనారోగ్యం కలుగునా
కాలం వృధా ఐతే విజ్ఞానం తరుగునా
ధనం వృధా ఐతే దుఃఖం పెరుగునా
విశ్వమందు నీవు ఎచట ఎలా ఉన్నా నేను నీ మేధస్సులోనే మిత్రమా! 

Monday, June 13, 2016

విశ్వమే లేదని విజ్ఞానమే ఇక ఎందుకని

విశ్వమే లేదని విజ్ఞానమే ఇక ఎందుకని
ఆవేశంతో సాగే విజ్ఞానం ఎవరికి ఎందుకని
అనర్థాలతో సాగే జీవితం ఎందుకో తెలుసుకోలేమని  || విశ్వమే ||

విజ్ఞానం ఉన్నా ఉపయోగించుకోలేని మాటల తీరు
అనుభవం ఉన్నా స్వార్థంతో సాగే జీవన విధానం

ప్రతి పనికి సమయస్పూర్తి సమయాలోచన లేకపోవటం
ప్రతి కార్యానికి ఏదో ఒక వంకర చాటు మాటల విధానం

ఖర్చులతో సాగే జీవితం అనర్థాల విలాసాల సంధ్యా వేళ జీవనం
మోసపోవడం మోసగించడం అనవసరమైన వాటికి అధికంగా వ్యచ్చించడం   || విశ్వమే ||

ప్రతి పనికి ఒక లాభం ఆశించడం కర్తవ్యాన్ని మరచిపోవడం
రోజుతో పోయేదానికి మాసాలు సంవత్సరాలు వాయిదా వేయడం

ఉన్నవారికి అందని ప్రతిఫలం ఎవరికో లభించడం
అనుభవించడానికి వయసు లేని వృద్ద్యాప్యం అనారోగ్యం

సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా ఏదో కావాలని ఏదో లేదని తిప్పించుకోవడం
ఒకసారి వివరాలు సేకరించి సమాచారాన్ని అందిస్తే చాలు పనైపోతుంది  || విశ్వమే ||